'తెలుగులో అతడే నా ఫేవరెట్.. ఆ సినిమాతో పిచ్చపిచ్చగా నచ్చాడు..' రాజాసాబ్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్

Published : Jan 05, 2026, 08:10 PM IST

Actress Malavika Mohanan: రాజాసాబ్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది. తెలుగులో అతడే నా ఫేవరెట్ హీరో అని.. ఆ సినిమా చూసి పిచ్చ పిచ్చగా అభిమాని అయిపోయా అని హీరోయిన్ చెప్పింది. 

PREV
15
సంక్రాంతికి రాజాసాబ్ మూవీ..

ప్రభాస్, దర్శకుడు మారుతీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'ది రాజాసాబ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

25
జోరందుకున్న ప్రమోషన్స్..

సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరోయిన్ మాళవిక మోహనన్.. తన క్రష్, తెలుగులో ఫేవరెట్ హీరో ఎవరన్న దానిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

35
ప్రభాస్ తన క్రష్..

తెలుగులో తన క్రష్ ప్రభాస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడు అంటే తనకు చాలా ఇష్టమని మాళవిక మోహనన్ పేర్కొంది. షూటింగ్ సమయంలో ప్రభాస్ బిహేవియర్ చాలా బాగా నచ్చినట్టుగా పేర్కొంది. బాహుబలి సినిమా చూసిన తర్వాత ప్రభాస్ పిచ్చపిచ్చగా నచ్చాడని.. తనకు అభిమానిని అయిపోయానని వెల్లడించింది.

45
హైదరాబాద్ బిర్యానీ..

తెలుగులో తన క్రష్ ప్రభాస్ అని చెప్పిన మాళవిక మోహనన్.. తనకు హైదరాబాద్ బిర్యానీ కూడా తినిపించాడని పేర్కొంది. ది రాజాసాబ్ సినిమా షూటింగ్ టైంలో ప్రభాస్ ఇంటి నుంచి భోజనం వచ్చేదని చెప్పుకొచ్చింది మాళవిక. దీంతో ఈ కామెంట్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.

55
విజయ్ దేవరకొండతో అరంగేట్రం..

వాస్తవానికి మాళవిక మోహనన్.. విజయ్ దేవరకొండ సినిమాతో ఓ లవ్ స్టోరీతో తెలుగు ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయాల్సి ఉంది. కానీ విజయ్ ఆ సమయంలో లైగర్ మీద ఎక్కువగా దృష్టి సారించడంతో.. ఈ లవ్ స్టోరీ అటకెక్కింది. ఇలా ఇప్పుడు ప్రభాస్ సరసన 'ది రాజాసాబ్' ద్వారా పరిచయం అవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories