Poonam Kaur: ఆ నటుడుకి వ్యతిరేకంగా మాట్లాడకపోతే న్యూడ్‌ వీడియోలు రిలీజ్‌ చేస్తామన్నారు.. నటి ఆవేదన

Published : Jan 05, 2026, 08:10 PM IST

నటి పూనమ్‌ కౌర్‌ తన జీవితంలోని విషాదకర సంఘటనలను పంచుకుంది. తనని కొందరు బెదిరించారని, ఆ నటుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని, లేదంటే న్యూడ్‌ వీడియోలు రిలీజ్‌ చేస్తామని బెదిరించినట్టు తెలిపింది. 

PREV
16
మొదటిసారి బయటకొచ్చిన పూనమ్‌ కౌర్‌

పూనమ్‌ కౌర్‌ తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా ఆమెకి ఇతర విషయాల్లో పాపులర్‌ అయ్యింది. ముఖ్యంగా గురువు గురువు అంటూ త్రివిక్రమ్‌కి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతూ సోషల్‌ మీడియాలో దుమారం రేపింది. అదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌కి వ్యతిరేకంగానూ కామెంట్లు చేసింది. పోస్ట్ లు పెట్టింది. తరచూ కామెంట్లతో ఆమె విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో తాజాగా అన్నింటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పూనమ్‌ కౌర్‌ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చింది. తన జీవితంలో జరిగిన విషాదకర విషయాలను వెల్లడించింది.

26
న్యూడ్‌ వీడియోలు రిలీజ్‌ చేస్తామన్నారు- పూనమ్‌ కౌర్‌

 కడప నుంచి వచ్చిన కొందరు తనని చాలా రకాలుగా బెదిరించారని చెప్పింది పూనమ్‌. ఒక పెద్ద నటుడికి వ్యతిరేకంగా మాట్లాడాలని డిమాండ్‌ చేశారని, లేదంటే తన న్యూడ్‌ వీడియోలో మార్కెట్‌లోకి విడుదల చేస్తామని బెదిరించినట్టుగా వెల్లడించింది. ఆ దెబ్బతో తాను చాలా కుంగిపోయానని తెలిపింది. అయితే మొదట డబ్బు ఆశ చూపించారట. ఆ తర్వాత పవర్ ఆశ కూడా చూపించారని, చివరికి బెదిరించినట్టు వెల్లడించింది పూనమ్‌ కౌర్‌.

36
యాక్సిడెంట్‌తో తలక్రిందులు

ఆ టైమ్‌లో తాను అమెరికా వెళ్లానని, యాక్సిడెంట్‌ అయ్యిందని, ఆ విషయాన్ని బయటకు రాకుండా మ్యానేజ్‌ చేశానని, ఈ కారణంగా చాలా ఆఫర్లు కోల్పోయినట్టు చెప్పింది పూనమ్‌. ఆ సమయంలో కోవిడ్‌ వచ్చినట్టు తెలిపింది. యాక్సిడెంట్‌ తర్వాత తన బాడీలో చాలా మార్పులు వచ్చాయట. భారీగా వెయిట్‌ పెరిగిందట. ముఖం అంతా ఉబ్బిపోయిందట. ఆ సమయంలో తన గురించి మీడియా చాలా దారుణంగా రాసిందని, నిజంగా నేను మీడియా కథనాల వల్లే చచ్చిపోయానని చెప్పింది పూనమ్‌.

46
దాసరి ఉంటే ఇలా జరిగేది కాదు

సినిమా పరిశ్రమకి చెందిన ఒక పెద్ద మనిషి తనకు అన్యాయం చేశాడని, ఆయన వద్ద నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా మీడియా కథనాలు రాసిందని, ఈ విషయం గురించి కొందర తన తల్లితో తప్పుగా మాట్లాడారని వాపోయింది. తన తల్లి గురుద్వారా వెళ్లినప్పుడు నీ కూతురుని డబ్బు తీసుకుని అమ్మేశావా? అంటూ అడిగారని తెలిపింది. దాసరి గారు ఉంటే తనకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని, కానీ ఇప్పుడు ఆయన లేకపోవడంతో తాను చెప్పేది ఎవరూ నమ్మరు అని వెల్లడించింది. తన జీవితాన్ని నాశనం చేయడానికి కొందరు రూ.15కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది పూనమ్‌.

56
పోసాని వల్లే నా జీవితం నాశనం

ఈ సందర్భంగా నటుడు పోసాని గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది పూనమ్‌ కౌర్‌. తన జీవితంలో తీవ్రమైన స్ట్రగుల్స్ నడుస్తున్న సమయంలో ఇక మ్యారేజ్‌ చేసుకోవాలనుకుందట. తన ఫ్రెండ్స్ ఒత్తిడి మేరకు స్నేహితుడే మ్యారేజ్‌ చేసుకునేందుకు ముందుకు వచ్చాడట. కానీ ఆ సమయంలో నటుడు పోసాని తనపై పెట్టిన ప్రెస్‌ మీట్‌తో మొత్తం తలక్రిందులయ్యిందని చెప్పింది. ఆయన తన గురించి చెడుగా మాట్లాడాడని, అసత్య ఆరోపణలు, కట్టు కథలు చెప్పాడని, దీంతో తనని మ్యారేజ్‌ చేసుకోవాలనుకున్న వ్యక్తి కూడా వెనకడుగు వేసినట్టు వెల్లడించింది. పోసాని ప్రెస్‌ మీట్‌ తర్వాత తనకు పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా చచ్చిపోయిందని చెప్పింది. తన జీవితంలో సర్వం కోల్పోయానని, డబ్బు, మ్యారేజ్‌, వర్క్, ఆరోగ్యం, సంతోషం ఇలా అన్నీ కోల్పోయినట్టు చెప్పింది. తన జీవితమే నాశనమైందని సిగ్నేచర్‌ స్టూడియోస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనమ్‌ కౌర్‌ వెల్లడించింది.

66
పవన్‌ కళ్యాణ్‌ కి వ్యతిరేకంగా ఇదంతా జరిగిందా?

ఇంకా చాలా విషయాలపై ఓపెన్‌ అయ్యింది పూనమ్‌. మొత్తంగా పవన్‌ కళ్యాణ్‌ విషయంలో అసత్య ఆరోపణలు చేసినట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇదే విషయాన్ని పవన్‌ అభిమానులు చెబుతూ పూనమ్‌ వీడియోలను వైరల్‌ చేస్తున్నారు. పవన్‌ విషయంలో ప్రత్యర్థి పార్టీ నాయకులు తనని ఇరికించినట్టుగా పూనమ్‌ చెబుతుంది. అయితే వారి పేర్లని ఆమె వెల్లడించకపోవడం గమనార్హం. పూనమ్‌ కౌర్‌ తెలుగులో `మాయాజాలం`, `ఒక వి చిత్రం`, `నిక్కీ అండ్‌ నీరజ్‌`, `శౌర్యం`, `వినాయకుడు`, `ఈనాడు`, `గణేష్‌`, `నాగవళ్లి`, `గగనం`, `బ్రహ్మి గాడి కథ`, `ఆడు మగాడ్రా బుజ్జి`, `పొగ`, `సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌`, `ఎటాక్‌`, `నెక్ట్స్ ఏంటి`  వంటి చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ని అలరించింది పూనమ్‌ కౌర్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories