Success Directors : ఇండియన్ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా కొత్త స్థాయి దక్కింది. బాహుబలి తర్వాత సౌత్ డైరెక్టర్స్ హాలీవుడ్ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడని 100% సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు. ఆ లిస్ట్‌లో ఎవరన్నారు?
100% Success Directors : భారతీయ సినిమా స్థాయి పెరిగింది. వరల్డ్ వైడ్‌గా ఇండియన్ సినిమాలకు ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ అయ్యింది. అందులో ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తున్నాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమా లెవల్ విడుదలై హాలీవుడ్ లెవెల్ క్రేజ్ సృష్టిస్తున్నాయి. బాహుబలి ముందు వరకు సౌత్ సినిమాలపై కొంత చిన్న చూపు ఉన్నాయి. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్, విక్రమ్, కాంతార, సలార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు వరల్డ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు. హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా మెప్పించాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడని డైరెక్టర్స్ జాబితా హాట్ టాపిక్‌గా మారింది. ఆ లిస్ట్‌లో సౌత్ నుంచి 5 గురు ఉండటం విశేషం.
27
ఎస్.ఎస్. రాజమౌళి (Tollywood)
భారతీయ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ డైరెక్టర్ గా పేరొందిన దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి. ఇప్పటి వరకు రాజమౌళి 12 సినిమాలు చేశారు. ఒక్కటి కూడా ఫెయిల్ కాకుండా అన్ని బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. బాహుబలి సిరీస్‌తో ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన క్రెడిట్ ఆయన్నే దక్కింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు.
37
రాజ్‌కుమార్ హిరానీ (Bollywood)
బాలీవుడ్ నుంచి లిస్ట్‌లో చోటు దక్కిన ఏకైక డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ. బాలీవుడ్‌లో 100% సక్సెస్ రేట్ తో దూసుకపోతున్నారు. ఇప్పటివరకు ఆయన కేవలం 5 సినిమాలకే దర్శకత్వం వహించి, అన్నింటినీ బ్లాక్‌బస్టర్‌లుగా నిలిపారు. మున్నాభాయి ఎంబీబీఎస్, 3 ఇడియట్స్, పీకే, సంజూ వంటి 6 సినిమాలు చేసి అన్ని బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. తన ప్రత్యేకమైన కథనం, ఎంటర్టైనింగ్ ట్రీట్మెంట్‌తో రాజ్‌కుమార్ హిరానీ హిందీ సినీ పరిశ్రమలో అత్యంత విశ్వసనీయ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
‘లోకీ’ అని అభిమానులు పిలుచుకునే లోకేష్ ఇప్పటి వరకు 6 సినిమాలు డైరెక్ట్ చేశారు. 2016లో అవియల్ షార్ట్ ఫిల్మ్‌తో తన సినీ ప్రయాణం ప్రారంభించారు. 2017లో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మానగరంతో దర్శకుడిగా బలమైన ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2019లో కార్తీతో ఖైదీ, 2021లో విజయ్‌తో మాస్టర్, కమల్ హాసన్‌తో విక్రమ్, మరోసారి విజయ్‌తో లియో చిత్రాలను తెరకెక్కించి భారీ విజయాలను సాధించారు. తాజాగా రజనీకాంత్‌తో కూలీ సినిమా తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, పూజా హెగ్డే తదితరులు నటించారు. ఈ సినిమా యావరేజ్ హిట్ అందుకుంది.
57
అట్లీ కుమార్ (Kollywood)
తనదైన స్టైల్లో మాస్ ఎంటర్‌టైనర్స్ ఇచ్చే అట్లీ, 5 సినిమాలు డైరెక్ట్ చేసి అన్ని బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచారు. హిందీలో షారుక్ ఖాన్‌తో 'జవాన్' తీసి, బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ ( Atlee Kumar). 'జవాన్' సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రూ. వెయ్యి కోట్లకు పైగా దాటేయడంతో బాలీవుడ్ మార్కెట్‌నే షేక్ చేశారు.
67
ప్రశాంత్ నీల్ (Sandalwood/Tollywood)
ప్రశాంత్ నీల్ ఈ పేరు వింటే సినీ అభిమానికి ఎలివేషన్స్ తో కూడిన భారీ సీన్స్ గుర్తుకు వస్తాయి. కన్నడ సినిమా ఇండస్ట్రీకి ఆయన ఓ వరం. కన్నడ, తెలుగు చలనచిత్ర రంగంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచుకొన్నారు ఒక అద్భుతమైన దర్శకుడు. కేజీఎఫ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు 4 సినిమాలు మాత్రమే చేశారు. కానీ అన్నీ వరల్డ్‌వైడ్ సెన్సేషన్ అయ్యాయి. సలార్ తో తన పాన్-ఇండియా స్థాయిని మరింత పెంచుకున్నారు.
77
అనిల్ రావిపూడి (Tollywood)
కమెర్షియల్ ఎంటర్‌టైన్మెంట్‌లో తనదైన ముద్ర వేసుకున్న అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో ప్రస్తుతం పర్ఫెక్ట్ సంక్రాంతి హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. 2015లో పటాస్ తో కెరీర్ ప్రారంభించి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు. సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకేవ్వరు, ఎఫ్3, భగవంత్ కేసరి వరకూ అన్ని హిట్స్ ఇచ్చిన ఆయన, 2024లో వెంకటేష్‌తో వచ్చిన సంక్రాంతి వస్తున్నాంతో మరోసారి బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్నారు. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మేళవించి ప్రేక్షకులను అలరించడం ఆయన సక్సెస్ మంత్ర. వరుసగా రూ.100 కోట్ల మార్క్ దాటిన సినిమాలతో ఫెయిల్యూర్ అంటే తెలియని డైరెక్టర్ గా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. అన్ని సూపర్ హిట్స్‌గా నిలిచి ఆయనను “100% సక్సెస్ డైరెక్టర్”గా నిలబెట్టాయి.