Nithiin and Gopichand : నితిన్, గోపీచంద్ లాంటి క్రేజీ హీరోలకు సమానంగా డెబ్యూ మూవీతో రెమ్యునరేషన్ అందుకున్న కమెడియన్ ఒకరున్నారు. ఆయనెవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒక్క మూవీలో ఛాన్స్ వస్తే చాలు తమ ట్యాలెంట్ ప్రదర్శించి మంచి గుర్తింపు అందుకునే నటులు ఉంటారు. తేజ, శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో కొత్త వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తుంటారు. తేజ దర్శకత్వంలో పరిచయమై ఆ తర్వాత టాలీవుడ్ లో మంచి పొజిషన్ కి చేరుకున్న నటీనటులతో నితిన్, సదా, ఉదయ్ కిరణ్ లాంటి వారు ఉన్నారు.
25
తేజ కోసం సుమన్ శెట్టి ఇంట్లో ఒక గది
కమెడియన్ గా సుమన్ శెట్టిని పరిచయం చేసింది కూడా డైరెక్టర్ తేజానే. వైవిధ్యమైన వాయిస్, నవ్వులు పూయించే నటనతో సుమన్ శెట్టి కమెడియన్ గా మంచి గుర్తింపు పొందారు. కమెడియన్ గా సంపాదించిన డబ్బుతో సుమన్ శెట్టి కొత్త ఇల్లు కూడా నిర్మించుకున్నారు. డైరెక్టర్ తేజపై కృతజ్ఞతతో తన ఇంట్లో ఒక గదిని సుమన్ శెట్టి ఆయన కోసం కేటాయించారు.
35
నితిన్, గోపీచంద్ లతో సమానంగా రెమ్యునరేషన్
సుమన్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జయం చిత్రానికి గాను తనకి ఇచ్చిన రెమ్యునరేషన్ వివరాలు బయటపెట్టారు. జయం చిత్రానికి తనకి ఇచ్చిన రెమ్యునరేషన్ 11 వేలు అని సుమన్ శెట్టి తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ చిత్రంలో హీరో గా నటించిన నితిన్ కి, హీరోయిన్ సదాకి, విలన్ గోపీచంద్ లకు కూడా ఒక్కొక్కరి రెమ్యునరేషన్ 11 వేలు మాత్రమే అని సుమన్ శెట్టి తెలిపారు.
11 వేలు ఇవ్వడం అనేది తేజ గారికి సెంటిమెంట్. తన చిత్రంలో కొత్త నటీనటులకు 11 వేలు రెమ్యునరేషన్ ఇస్తే మూవీ హిట్ అవుతుందనేది ఆయన సెంటిమెంట్. అంతకు ముందు చిత్రం మూవీలో ఉదయ్ కిరణ్ కి కూడా ఆయన 11 వేలే ఇచ్చినట్లు సుమన్ శెట్టి పేర్కొన్నారు.
55
తొలి చెక్కు తల్లిదండ్రులకు ఇచ్చా
తనకు వచ్చిన తొలి రెమ్యునరేషన్ ని మా తల్లి దండ్రులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించాను అని సుమన్ శెట్టి అన్నారు. అదొక గొప్ప ఫీలింగ్ అని తెలిపారు. ప్రస్తుతం సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోలో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారు.