Uday Kiran
ఉదయ్ కిరణ్ ఉవ్వెత్తున ఎగిసిపడ్డం కెరటం. ఎంత ఫాస్ట్ గా ఎదిగాడో, అంతే వేగంగా పడిపోయి, చివరికి అభిమానులను, చిత్ర పరిశ్రమని విషాదంలో ముంచెత్తి వెళ్లిపోయారు.
అయితే ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు ఆయన వెంట ఒక్కరు ఉంటే బతికే వాడని, ఆసుపత్రిలో అనాథ శవంలా ఉండిపోయిందని, కనీసం భార్య కూడా రాలేదని వెల్లడించారు బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా. ఆయన పలు షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.
Uday Kiran
ఉదయ్ కిరణ్ వరుసగా సినిమాలు ఫెయిల్యూర్ కావడం, చాలా కాలంగా హిట్ లేకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లి చనిపోయిన విషయం తెలిసిందే. ఆర్థిక ఇబ్బందులు కూడా కారణమనే టాక్ ఉంది.
కానీ అది నిజం కాదని, ఆస్తులు బాగానే ఉన్నాయని, ఆ సమస్యలు లేవని, కేవలం కెరీర్ పరమైన దిగులే ఉండేదని ఆయన అక్క ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఉదయ్ కిరణ్ వెంట ఒక్కరు ఉంటే బతికే వారు అంటున్నారు శేఖర్ బాష.
Uday Kiran
ఉదయ్ కిరణ్ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఆయన్ని ఓదార్చే ఫ్రెండ్ ఒక్కడు ఉన్నా ఉదయ్ కిరణ్ బతికే వాడని తెలిపారు. సక్సెస్ ఉన్నప్పుడు అంతా ఉంటారని, అదే సక్సెస్ లేకపోతే మన అనుకున్నవాడు కూడా ఉండరని, ఉదయ్ కిరణ్ విషయంలో అదే జరిగిందన్నారు.
ఆయన డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఆ బాధ నుంచి బయటపడేసే, ఆ ఆలోచనలను డైవర్ట్ చేసే, నేనున్నా నీకు అని భరోసా ఇచ్చే ఫ్రెండ్ ఒక్కడు కూడా లేడని, అలాంటి వ్యక్తి ఒక్కరు ఉంటే ఉదయ్ కిరణ్ ఇప్పుడు మన ముందు ఉండేవాడని తెలిపారు.
Uday Kiran
అంతేకాదు ఉదయ్ కిరణ్ చనిపోయి నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన వెంట కనీసం భార్య కూడా లేదన్నారు శేఖర్ బాష. భర్త చనిపోయి ఉంటే చూసుకోవడానికి కూడా ఆమె రాలేదని, ఒక అనాథ శవంలా ఉదయ్ కిరణ్ బాడీ ఉందని తెలిపారు. టీవీలో `నీ స్నేహం`అనే పాట వేస్తూ ఉదయ్ కిరణ్ ని చూపిస్తుంటే వందల మంది అభిమానులు అక్కడికి వచ్చారని, కనీసం భార్య మాత్రం రాలేదన్నారు.
ఎప్పుడో చివర్లో ఫ్యామిలీ వాళ్లు వచ్చారని తెలిపారు. అది అత్యంత బాధాకరం అని తెలిపారు శేఖర్ బాషా. విశితని ఉదయ్ కిరణ్ 2012లో మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన 2014లో జనవరిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
Shekar Basha
ఉదయ్ కిరణ్ తనకు ఎఫ్‌ఎం రేడియోలో పరిచయం అని, తాను కంటిన్యూగా మారథాన్ లా ప్రోగ్రామ్ చేసినప్పుడు చివరి గెస్ట్ గా ఉదయ్ కిరణ్ వచ్చారని, ఆ సమయంలో బాగా క్లోజ్ అయ్యాడని, ఆయన చనిపోయినప్పుడు ఆసుపత్రిలో తానే ఉన్నానని, అన్ని కార్యక్రమాలు తానే దగ్గరుండి చూసుకున్నానని, అంత్యక్రియల వరకు తాను దగ్గరే ఉన్నానని చెప్పారు శేఖర్ బాష. మంచి ఫ్రెండ్ లేకపోవడం వల్లే ఉదయ్ కిరణ్‌కి చనిపోయాడని ఆయన స్పష్టం చేశారు.