balakrishna (aha-unstoppable show )
Balakrishna Betting app: బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇందులో చిన్న చిన్న సెలబ్రిటీల నుంచి బిగ్ స్టార్స్ పేరు కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఓ బాధితుడు బాలయ్యపై ఆరోపణల చేస్తున్నారు.
harsha sai, Vishnu Priya, rithu Chowdary, tasty teja, Pallavi Prashanth,
బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలా మంది అమాయకులు బలవుతున్నారు. బెట్టింగ్ ఆడుతూ లక్షలు కోల్పోతున్నారు. కొందరైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దానికి కారణం చాలా మంది పేరున్న సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడమే.
దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే టీవీ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసుు నమోదు చేశారు. విష్ణు ప్రియా, సుప్రీత, రీతూ చౌదరీ, సన్నీ యాదవ్, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్, సన్నీ యాదవ్ వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. వీరిని పోలీసులు విచారించారు.
balakrishna (aha-unstoppable show )
ఈ క్రమంలో బిగ్ స్టార్స్ పేర్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ పేర ప్రస్తావన వచ్చింది. ఆయన దీనిపై స్పందించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని, లీగల్‌గా పర్మీషన్ ఉన్న యాప్స్ నే ప్రమోట్ చేసినట్టు పీఆర్ టీమ్ వెల్లడించింది.
ఇప్పుడు బాలకృష్ణ పేరు తెరపైకి వస్తుంది. ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఓ బాధితుడు ఏకంగా బాలయ్య ప్రమోట్ చేసిన యాప్ కారణంగా తాను 80 లక్షలు కోల్పోయానని ఆరోపిస్తున్నాడు.
read more: విజయ్ దేవరకొండ ఇల్లీగల్ గా చేయలేదు, సుప్రీంకోర్టే చెప్పింది..బెట్టింగ్ యాప్స్ వివాదంపై అతడి టీమ్ కామెంట్స్
balakrishna, betting app (photo credit big tv)
నెల్లూరుకి చెందిన శ్రీరామ్ బాబు అనే వ్యక్తి `ఆహా` అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ ప్రమోట్ చేసిన `ఫన్88` అనే యాప్‌ని డౌన్ లోడ్ చేసుకుని తాను బెట్టింగ్ ఆడినట్టు తెలిపారు. ఆ యాప్ వల్ల తాను 80 లక్షల వరకు నష్టపోయినట్టు చెబుతున్నాడు.
మొదట్లో పది వేలు పెడితే 18 వేలు వచ్చాయట. ఆ తర్వాత మళ్లీ డబ్బులు వచ్చాయట. ఇలా ఆడుకుంటూ వెళ్తుంటే చాలా నష్టపోతున్నానని, ఫ్యామిలీ బంధువుల వద్ద అప్పులు తెచ్చి బెట్టింగ్‌లో పెట్టినట్టు తెలిపారు.
TS RTC MD Sajjannar
దారుణంగా నష్టపోవడంతో సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను అని, సజ్జనార్ అవగాహన కల్పిస్తూ భరోసా ఇస్తున్న నేపథ్యంలో తాను బయటకు వచ్చినట్టు తెలిపారు. బీగ్ టీవీ ముందు ఈ విషయాన్ని శ్రీరామ్ బాబు అనే వ్యక్తి వెల్లడించారు. హీరోలు సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం వల్లే మాలాంటి వాళ్లు ఇలాంటి బెట్టింగ్ యాప్‌లను నమ్ముతున్నామని తెలిపారు.
బెట్టింగ్ ఆడుతున్నామని తెలిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో ఇన్నాళ్లు రాలేదని, సజ్జనార్ సార్ బరోసా ఇవ్వడంతో ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చానని, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చినట్టు తెలిపారు.