కృష్ణంరాజు చేసిన పనికి నరకం చూసిన హీరోయిన్‌.. చీరని చించేసి మీదికి కుక్కలను వదిలాడా?

Published : Mar 21, 2025, 06:06 PM ISTUpdated : Mar 22, 2025, 08:46 PM IST

Krishnam raju: కృష్ణంరాజు టాలీవుడ్‌లో రెబల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అగ్ర హీరోల్లో ఒకరిగా రాణించారు. అయితే ఆయన ఓ హీరోయిన్‌ చీరలాగి, బట్టలు చించి నాన రచ్చ చేశాడట. మరి ఆ కథేంటో చూద్దాం.   

PREV
15
కృష్ణంరాజు చేసిన పనికి నరకం చూసిన హీరోయిన్‌.. చీరని చించేసి మీదికి కుక్కలను వదిలాడా?
Krishnam raju

Krishnam raju: కృష్ణంరాజు ఆవేశానికి కేరాఫ్‌. ఆయన సినిమాల్లో చాలా వరకు కృష్ణంరాజు పాత్రలు అలానే ఉంటాయి. అందుకే ఆయన్ని రెబల్ స్టార్‌ అంటారు. తిరుగుబాటుకి కేరాఫ్‌ అడ్రప్‌.

కృష్ణంరాజు హీరోగానే కాదు, చాలా సినిమాల్లో విలన్‌ పాత్రలు కూడా పోషించారు. పాత్రలను రక్తికట్టించారు. కానీ తన విలనిజం వల్ల ఓ హీరోయిన్‌ రియల్‌గానే ఇబ్బంది పడిందట. ఆ రోజు తన లైఫ్‌లో మర్చిపోలేదట. మరి ఏం జరిగిందనేది చూస్తే.. 
 

25
Krishnam raju

కృష్ణంరాజు వ్యక్తిగతంగా చాలా మంచివారు. రాజుల కుటుంబం నుంచి రావడంతో ఆయన మనసు కూడా రాజులాగే ఉంటుంది. కృష్ణంరాజు, ప్రభాస్‌లు తన టీమ్‌లకు భోజనం పెట్టిన తీరుపై ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా మాట్లాడుతుంటారు.

తనతో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి వాళ్లు పసందైన విందు వడ్డిస్తుంటారు. అందుకే వారిని మనసులోనూ రాజులు అంటారు. ఎవరినీ ఇబ్బంది పెట్టని తత్వం వాళ్లదనే టాక్‌ కూడా ఉంది. 

35
geetanjali, Krishnam raju

కానీ కృష్ణంరాజు చేసిన పనికి ఓ హీరోయిన్‌ చాలా ఇబ్బంది పడిందట. తన జీవితంలో ఆ సంఘటన మర్చిపోలేనని తెలిపింది. ఆమె సీనియర్‌ నటి గీతాంజలి. ఆరేళ్లక్రితమే ఆ కన్నుమూశారు. అయితే ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం బయటకు వచ్చింది. కృష్ణంరాజుతో సీన్‌ చేసేటప్పుడు జరిగిన సంఘటన పంచుకుంది. 

45
geetanjali

గీతాంజలి `మంచి రోజులు వచ్చాయి` సినిమాలో ఏఎన్నార్‌కి చెల్లిగా నటించింది. ఇందులో కాంచన హీరోయిన్‌ కాగా, కృష్ణంరాజు విలన్‌ పాత్రలో నటించాడు. ఇందులో ఓ సీన్‌లో గీతాంజలిని కృష్ణంరాజు ఇబ్బంది పెట్టాలి. రేప్‌ సీన్‌ అది. ఆ సన్నివేశం చేసేటప్పుడు గీతాంజలి నిజంగానే నరకం అనుభవించిందట. 

ఇద్దరి మధ్య మాట మాట పెరిగి, కృష్ణంరాజుపై గీతాంజలి ఉమ్మేయాల్సి ఉంటుంది. ఆ సీన్‌ చేయడానికి గీతాంజలి చాలా ఇబ్బంది పడిందట. తన వల్ల కాదని చెప్పినా దర్శకుడు మధుసూధన రావు వినలేదు. దీంతో ఐస్‌ క్రీమ్‌ని నోట్లో వేసుకుని ఆ నూరగని ఉమ్మిందట.

55
Krishnam raju

దీంతో కోపానికి గురైన కృష్ణంరాజు నాపైనే ఉమ్మేస్తావా? ఇప్పుడు చూడు నీ పని ఏమైతుందో అని, ఆమెపై పడి చీర లాగి, బట్టలన్నీ చించేసి చుట్టూ అంతా నలిపేసి ఆగమాగం చేశాడట. చివరికి కుక్కని కూడా తనపైకి వదిలాడట. 

ఇప్పుడు చూడు నీ జీవితం ఎలా చించిన విస్తారులా మారుతుందో అని చెప్పి ఆ పని చేశాడట. అయితే అది సినిమాలో సీనే అయినా ఆ సన్నివేశం చేసేటప్పుడు నిజంగానే గీతాంజలి చాలా ఇబ్బంది పడిందట. ఓ రకంగా నరకం చూసిందట. జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సీన్‌ అని వెల్లడించింది గీతాంజలి. సాక్షితో కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది.  

read  more: బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్స్ వివాదంలో బాలకృష్ణ.. 80లక్షలు కోల్పోయానంటూ బాధితుడి ఆరోపణలు

also read: ఉదయ్‌ కిరణ్‌ కి తోడుగా ఆ ఒక్కరు ఉంటే బతికేవాడు.. చివరికి భార్య కూడా రాలేదు, అనాథలా శవం
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories