సడెన్ గా ఆ డెసిషన్ తీసుకుని జాక్ పాట్ కొట్టిన ఉదయ్ కిరణ్.. కానీ కమెడియన్ ఫ్యామిలీ కొంప మునిగింది 

First Published Apr 14, 2024, 4:34 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న హీరో ఉదయ్ కిరణ్ పిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళాడు. ఉదయ్ కిరణ్ జీవితంపై అనేక రూమర్స్ ఉన్నప్పటికీ అతడి జీవితం విషాదాంతంగా ముగిసిందనేది వాస్తవం.

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న హీరో ఉదయ్ కిరణ్ పిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళాడు. ఉదయ్ కిరణ్ జీవితంపై అనేక రూమర్స్ ఉన్నప్పటికీ అతడి జీవితం విషాదాంతంగా ముగిసిందనేది వాస్తవం. ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా అప్పటి యువతని ఎంతగానో అలరించాడు. 

ఉదయ్ కిరణ్ తాను ఎదిగే క్రమంలో చాలా మంది నిర్మాతలతో సినిమాలు చేశాడు. దివంగత కమెడియన్ ఏవీఎస్ గురించి పరిచయం అవసరం లేదు. తనకి సాధ్యమైన వాయిస్ తో ఆయన ఎన్నో చిత్రాల్లో నవ్వులు పూయించారు. క్యారెక్టర్ రోల్స్ కూడా చేశారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరికొన్ని చిత్రాలని నిర్మించారు. 

తాజాగా ఇంటర్వ్యూలో ఏవీఎస్ తనయుడు ప్రదీప్.. ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏవీఎస్ నిర్మాతగా ఉదయ్ కిరణ్ తో ఒక చిత్రం చేయాలనుకున్నారట. డైరెక్టర్ గా విఎన్ ఆదిత్యని కూడా అనుకున్నారు. స్టోరీ అంతా రెడీ అయింది. ఆ చిత్రం పేరు 'ఓరి నీ ప్రేమ బంగారం కాను'. 

అంతా రెడీ అనుకున్న టైంలో సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ నుంచి ఉదయ్ కిరణ్ కి పిలుపు వచ్చింది. అది మనసంతా నువ్వే చిత్రం. ఆ చిత్రానికి డైరెక్టర్ గా వాళ్ళు కూడా విఎన్ ఆదిత్యనే ఫిక్స్ చేశారు. రెండు చిత్రాలు ఒకే సారి చేయడం కష్టం కాబట్టి ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే చిత్రమే చేయాలని నిర్ణయించుకున్నాడు.  దీనితో నాన్న నిర్మించాలన్న చిత్రం సందిగ్ధంలో పడింది. 

అయినప్పటికీ నాన్న వెనక్కి తగ్గకుండా మరో హీరోతో ఆయనే దర్శకుడిగా, నిర్మాతగా ఓరినీ ప్రీమ బంగారం కాను చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అప్పటి వరకు నాన్న సంపాదించిందంతా ఆ చిత్రంతో పోయింది. మా ఫ్యామిలీ మొత్తం తలక్రిందులు అయింది అనే చెప్పాలి. మళ్ళీ జీరో నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అని ఏవీఎస్ తనయుడు ప్రదీప్ అన్నారు.

ఒక వేళ ఆ చిత్రాన్ని ఉదయ్ కిరణ్ చేసి ఉంటే బాగా సెట్ అయి ఉండేది. కానీ అది జరగలేదు. కానీ నాన్నగారు ఎప్పుడూ అధైర్యపడలేదు అని ప్రదీప్ అన్నారు.నాన్న ఏం చేసినా మేము అడ్డు చెప్పేవాళ్ళం కాదు. ఓరి నీ ప్రేమ బంగారం కాను చిత్రం వద్దని కూడా చెప్పలేదు. ఏ దర్శకుడు అయినా ఒక కథని నమ్మే సినిమా చేస్తారు. నాన్నగారు కూడా అలాగే చేశారు. కానీ వర్కౌట్ కాలేదు అని అన్నారు. 

మొత్తంగా ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే చిత్రం చేయాలని నిర్ణయించుకోవడం వల్ల అతడికి జాక్ పాట్ తగిలినట్లు అయింది మనసంతా నువ్వే ఉదయ్ కిరణ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. కానీ ఓరినీ ప్రేమ బంగారం కాను చిత్రం వదిలేయడం వల్ల ఏవీఎస్ ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. 

click me!