ఫెయిర్‌ నెస్‌ క్రీమ్‌లు వాడుతున్నారా? మీ కిడ్నీల పని ఔట్‌.. అధ్యయనంలో ఫ్యూజులు ఎగిరిపోయే నిజాలు వెల్లడి..

Published : Apr 14, 2024, 04:00 PM ISTUpdated : Apr 14, 2024, 04:07 PM IST

అందం కోసం, స్కిన్‌ రక్షణ కోసం ఫెయిర్‌నెస్‌ క్రీములు వాడే వారికి బిగ్‌ అలర్ట్. షాకింగ్ నిజాలు వెల్లడించింది తాజా ఆధ్యయనం.   

PREV
18
ఫెయిర్‌ నెస్‌ క్రీమ్‌లు వాడుతున్నారా? మీ కిడ్నీల పని ఔట్‌.. అధ్యయనంలో ఫ్యూజులు ఎగిరిపోయే నిజాలు వెల్లడి..

ప్రస్తుతం సమాజంలో అందానికి ప్రయారిటీ పెరిగింది. అందం కోసం, స్కిన్‌ రక్షణ కోసం చాలా మంది స్కిన్‌ ఫెయిర్‌నెస్‌ క్రీములను వాడుతుంటారు. వీటిని ఎక్కువగా ఆడవాళ్లు, మహిళలు ఉపయోగిస్తుంటారు. అందం కోసం వాళ్లు రెగ్యూలర్‌గా ఈ క్రీములను ఉపయోగిస్తుంటారు. చిన్నప్పట్నుంచి ఇది మన జీవితంలో భాగమైపోయింది.
 

28

గ్లోబలైజేషన్‌ ప్రభావం, టెక్నాలజీ కారణంగా స్కిన్‌కి సంబంధించిన రకరకాల ఫెయిర్‌నెస్‌ క్రీములు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. అందాన్ని రెట్టింపు చేయడంలో అవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇంత వరకు బాగానే ఉంది. కానీ దీనికి సంబంధించిన హార్ట్ బ్రేక్‌ అయ్యే విషయం బయటకు వచ్చింది. ఫెయిర్‌నెస్‌ క్రీములు అనారోగ్యానికి కారకంగా మారుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీల సమస్యలకు కారణమవుతున్నాయట.
 

38

తాజాగా ఓ అధ్యయనం మైండ్ బ్లాక్‌ అయ్యే విషయాలను వెల్లడించింది. ఫెయిర్‌నెస్‌ క్రీములు వాడితే మూత్రపిండాల సమస్యలు వస్తున్నాయట. ముఖ్యంగా మన భారత్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉందట. ఇండియాలో స్కిన్‌ ఫెయిర్‌నెస్‌ క్రీముల వాడకం వల్ల కిడ్నీ సమస్యలు పెడుతున్నాయని తాజా ఆధ్యయనం వెల్లడించింది.

48

ఫెయిర్‌ స్కిన్‌పై సమాజానికి ఉన్న మక్కువతో స్కిన్‌ ఫెయిర్‌ నెస్ క్రీములకు భారత్‌లో భారీ మార్కెట్‌ ఉంది. ఇది ఎన్నోలాభాలను తెచ్చిపెడుతుంది. అందుకే రోజుకో కొత్త ప్రొడక్ట్ లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ క్రీముల్లో ఎక్కువగా పాదరసం వాడుతున్నారట. ఇందులో మూత్రపిండాలకు హానీ చేసే పాదరసాన్ని గుర్తించారట. 

58

ఈ విషయాన్ని కిడ్నీ ఇంటర్నేషన్‌ అనే సంస్థ తమ మెడికల్‌ జర్నల్‌ లో ప్రచురించింది. అధిక మెర్య్కూరీ కంటెంట్‌ని ఫెయిర్‌నెస్‌ క్రీముల్లో ఉపయోగిస్తున్నారని, దీని వల్ల మెంబ్రానన్‌ నెఫ్రోపతి(ఎంఎన్‌) కేసులు పెరుగుతున్నట్టు తెలిపారు. ఇది కిడ్నీలు మూత్రాన్ని ఫిల్టర్‌ చేసే ప్రక్రియని దెబ్బతీస్తుందని, అలాగే మూత్రంలో ప్రోటీన్‌ లీకేజీకి కారణమవుతుందని వెల్లడించింది. 
 

68

ఎంఎన్‌(మెంబ్రానన్‌ నెఫ్రోపతి) అనేది స్వయం ప్రతిరక్షక వ్యాధి. దీని ఫలితంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్‌ ఏర్పడుతుందని, ఇది మూత్రపిండ రుగ్మత, మూత్రంలో ఎక్కువ ప్రోటీన్‌ విసర్జించేలా చేస్తుందని మెడికల్‌ జర్నల్‌ వెల్లడించింది. `పాదరసం చర్మం ద్వారా గ్రహించబడుతుంది. మూత్రపిండాల ఫిల్టర్లపై వినాశనం కలిగిస్తుంది. ఇది నెఫ్రోటిక్‌ సిండ్రోమ్ కేసుల పెరుగుదలకు దారితీస్తుంది` అని ఈ పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్‌ సజీష్‌ శివదాస్‌ వెల్లడించారు. ఆయన కేరళాలోని ఆస్టర్ ఎంఐఎంఎస్‌ హాస్పిటల్‌ లో నెఫ్రాలజీ విభాగంలో పనిచేస్తున్నారు. 
 

78

భారత్‌ అనియంత్రిత మార్కెట్‌లో విస్తృతంగా లభించే ఈ క్రీములు, శీఘ్ర ఫలితాలను అందిస్తాయని, వీటికి సంబంధించిన ధరలతో సంబంధం లేకుండా వినియోగధారులు తరచూగా దీన్ని వాడుతుంటారని, ఇదొక వ్యసనంలా మారిందని, కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన కలవపరిచే నిజాలు బయటకు వస్తున్నాయని డాక్టర్‌ వెల్లడించారు. ఈ క్రీములు వాడటం ఆపేస్తే చర్మ ముదురు రంగులోకి మారుతుందన్నారు. జులై 2021 నుంచి సెప్టెంబర్‌ 2023 మధ్య ఎంఎన్‌ కి సంబంధించిన 22 కేసులను అధ్యయనం చేయడం వల్ల ఈ విషయాలు బయటకు వచ్చినట్టు తెలిపారు. 
 

88

అలసట, తేలికపాటి ఎడెమా, మూత్రం ఎక్కువగా నురగతో రావడం వంటి లక్షణాలతో రోగులు ఆస్టర్ ఆసుపత్రికి వచ్చారు. వీరిలో ముగ్గురు రోగులకు స్థూల ఎడెమా ఉందని, వారందరిలోనూ మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించినట్టు చెప్పారు. ఇకపై ఇలాంటి ప్రేరేపిత క్రీముల వాడకం తగ్గించాలని, అప్పుడే దీన్నుంచి బయటపడటం సాధ్యమవుతుందని వెల్లడించారు డాక్టర్‌ సజీష్‌ శివదాస్‌.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories