నాకు ఉరి వేయండి.. 10 పైసలు కూడా తీసుకోలేదు, ఇవిగో సాక్ష్యాలు...Tv5 మూర్తి సంచలన వ్యాఖ్యలు

Published : Nov 06, 2025, 02:45 PM IST

తానేతప్పు చేయలేదని, ఆరోపణల్లో నిజం ఉంటే ''ఉరి తీయ్యండి'' అని అన్నారు సీనియర్ జర్నలిస్ట్ Tv5 మూర్తి . ఎటువంటి సాక్ష్యాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారికి బుర్రతిరిగేలా సమాధానం ఇచ్చారు మూర్తి. 

PREV
16
Tv5 మూర్తి వివరణ..

తాజాగా సీనియర్ జర్నలిస్ట్ టీవీ5 మూర్తిపై ఓ కేసు నమోదు అయ్యింది. ఫోన్ ట్యాపింగ్ తో పాటు, 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని, తన భార్యతో తిరుగుతున్నాడంటూ.. నటుడు ధర్మసత్యసాయి మహేష్ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. తెలంగాణలోని కూకట్ పల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దాంతో పాటు పలు మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో మూర్తిపై వచ్చిన ఆరోపణలకు ఆయన స్పందించారు. ప్రతీ విషయాన్ని వివరంగా వెల్లడిస్తూ.. ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు మూర్తి.

26
ఆరోపణల్లో నిజం ఎంత..?

జర్నలిస్ట్ మూర్తి మాట్లాడుతూ.. ''నాపై కొన్ని రోజులుగా కుట్ర జరుగుతోంది. ఒక సినిమా హీరో ( ధర్మ మహేష్) , ఆయన భార్య మధ్య మనస్పర్ధలు వస్తే.. అందులో నేనేదో ఎంటర్ అయ్యి.. వారిని బ్లాక్ మెయిల్ చేసి.. 10 కోట్లు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు చేస్తున్నారు. అసలు వారికి సబంధించిన వార్తలు గతంలోనే అనేక మీడియాల్లో వచ్చాయి. టీవీ 5 లో కూడా వచ్చాయి. కానీ నన్నే ఎందుకు టార్గెట్ చేశారు.. అందులో వైసీపీ కుట్ర ఉంది. ఆ అమ్మాయి కుటుంబం నాకు తెలుసు అని.. ఓ వైసీపీ ఎమ్మెల్సీ దగ్గరుండి ఇదంతా నడిపిస్తున్నారు. ఆ అమ్మాయి కుటుంబానికి చెందిన దూరపు బంధువు, జర్నలిస్ట్ మిత్రుడు ఒకరు వారిని నాకు పరిచయం చేశారు. అప్పుడు ఆ అమ్మాయి అమ్మగారు, టీచర్, ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి.. నేనంటే అభిమానంతో గతంలోనే ఓ సారి రాఖీ కట్టింది. ఆ విషయం తరువాత నాకు గుర్తుకు వచ్చింది. వాళ్ల కుటుంబం నాకు బాగా తెలుసు కాబట్టి.. వాళ్లు నన్ను ఒకసారి ఆహ్వానిస్తే .. ఇంటికి వెళ్లాను. అప్పుడు వారితో కలిసి 30 మంది వరకూ ఉన్నారు. అది కూడా వాళ్లకు నాకు కామన్ ఫ్రెండ్, జర్నలిస్ట్ తో కలిసి వెళ్లాను. అంతే కానీ.. నేను ఆ అమ్మాయి రహస్యంగా కలవలేదు.. అందరు కలిసి కూర్చోని భోజనం చేశాం.. ఆ వీడియో వాళ్లు కూడా సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. కానీ దాన్ని కట్ చేసి.. వైసీపీ సోషల్ మీడియాకు కావలసినంత వరకూ తీసుకుని, అబద్దపు ప్రచారం చేస్తున్నారు'' అని మూర్తి అన్నారు.

36
రాఖీ కట్టిన సోదరి కోసం గరళం మింగి కూర్చున్నాను..

జర్నలిస్ట్ మూర్తి మాట్లాడుతూ.. '' వాళ్ల ఫ్యామిలీ బంధువు.. నాకు జర్నలిస్ట్ మిత్రుడు పరిచయం కాబట్టి.. ఓ సారి ఫంక్షన్ కు నన్ను ఆహ్వానిస్తే.. అందరితో కలిసి వెళ్లాను.. అందరితో గ్రూఫ్ ఫోట్ కూడా దిగాను. కానీ అందులో నాది, ఆ అమ్మాయిది ఫోటో మాత్రమే కట్ చేసి.. వాళ్ళు ఇష్టమొచ్చినట్టు కథలు అల్లి ప్రచారం చేస్తున్నారు. అక్కడ అంత మంది ఉన్నారు.. కానీ మేం రహస్యంగా కలిశామని ఆరోపణలు చేస్తున్నారు. కానీ నాకు ఆఅమ్మాయికి రకరకాలుగా సంబంధం అంటగడుతూ.. ప్రచారం చేస్తున్నారు. నేను వాళ్ల ఇంట్లో ఫుడ్ తిన్నప్పుడు అక్కడ 10 మంది పైనే ఉన్నారు. ఇదంతా వైసీపీ అధినేత సలహాతో.. వైసీపీ ఎమ్మెల్సీ చేస్తున్న కుట్ర. ఆ నటుడు కూడా కేసులు ఎదుర్కొలేక.. నాపై కుట్ర చేసి.. నా క్యారెక్టర్ బ్యాడ్ అని ప్రచారం చేయాలని చూస్తున్నాడు. కానీ అందుకు సాక్ష్యాలు లేవు. కానీ వాళ్లు చేస్తున్న కుట్రకు, వాళ్లు చేసిన అక్రమాలకు నాదగ్గర సాక్ష్యాలు చాలా ఉన్నాయి. కానీ అవి సమయం వచ్చినప్పుడు బయటపెడతా. ప్రస్తుతం ఆ అమ్మాయి తల్లి నన్ను రిక్వెస్ట్ చేసింది.. మా మధ్య కాప్రమైజ్ కోసం చర్చలు జరుగుతున్నాయి. కాస్త ఏం మాట్లాడకండీ అని అడిగింది. దాంతో నేను కామ్ గా ఉన్నాను. ప్రస్తుతం గరళం మిగి కూర్చున్నాను. కానీ నాకు మా చైర్మెన్.. ఆయన ఫ్యామిలీ తిరుమల కొండంత అండగా ఉన్నారు. నన్ను నమ్మి నీ పని నువ్వు చేసుకో.. అని ధైర్యం ఇచ్చారు. అందకే నేను ఇలాంటివి పట్టిచుకోను.'' అని మూర్తి అన్నారు.

46
తల్లీ, చెల్లికి అన్యాయం చేసిన కుటుంబ..

మూర్తి మాట్లాడుతూ.. ''సొంత చెల్లి మీద ట్రోల్ చేయించిన కుటుంబ.. తల్లిపైనే ట్రోల్ చేయించిన కుటుంబం... ప్రతిపక్ష నాయకుడి కుటుంబాన్ని అసెంబ్లీలో దారుణంగా అవమానించిన కుటుంబం, కోడెల శివప్రసాద్ ను ట్రోల్ చేయించి.. ఆత్మహత్య చేసుకునేలా చేసిన కుటుంబం.. డాక్టర్ సుధాకర్ మీద పిచ్చివాడు అని ముద్ర వేయించిన వారు.. వాయి వరుసలు లేని వ్యక్తులు.. ఇప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేసి.. 29 ఏళ్ల చిన్న అమ్మాయితో నాకు అక్రమ సంబంధం అంటగట్టి.. నాపై కేసులు కూడా పెట్టిస్తున్నారు. కానీ వేటికీ నేను భయపడను.. ఎందుకుంటే సాక్ష్యాలు లేకుండా కేసులు పెట్టారని కోర్టే అడిగింది. అయినా సరే చిన్న కోర్డు నుంచి హైకోర్టు వరకూ వెళ్లారు. సాక్ష్యాలు ఉంటే ఇవ్వండి యాక్షన్ తీసుకుంటాము అని పోలీసులు కూడా అడిగారు. కానీ వాళ్లు ఇప్పటి వరకూ ఎటువంటి ఆధారాలు ఇవ్వలేకపోయారు.

56
1‌0 పైసలు తీసుకున్నా.. ఉరి వేయండి

మూర్తి పని అయిపోయింది.. టెలిఫోన్ ట్యాపింగ్ లో దొరికేశాడు అని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఏం కాలేదు, మూర్తిని ఎవరు ఏం చేయలేరు.. ఎన్ని ఆరోపణలు చేసినా... ఏం చేయలేరు. 10 కోట్లు అడిగినట్టు ఆరోపిస్తున్నారు.. నేను 10 రూపాయాలు కూడా ఎవరిని అడగలేదు. గతంలో కూడా ఓ జ్యోతీష్యుడిని అడ్డం పెట్టుకుని 5 కోట్లు డిమాండ్ చేశాడు..ఆత్మహత్యే శరణ్యం.. అని ప్రచారం చేశారు..కానీ అది నిరూపించలేకపోయారు. ఇది కూడా అంతే.. నేను 10 రూపాయలు కూడా ఎవరినీ అడగలేదు, మాఛైర్మెన్ ఇస్తున్న జీతభత్యాలమీదనే నేను బ్రతుకుతున్నాను. అంతే కానీ ఎవరినీ రూపాయి అడగను, ఆశించను. సాక్షిలో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. నేను 10 కోట్లు డిమాండ్ చేశానని, గతంలో 5 కోట్లు అని వీరే రాశారు.. ఆతరువాత 15 కోట్లు అని కూడా వేస్తారు. కానీ నేను వాటికి భయపడను.. 10 పైసలు కూడా ఎవరిదగ్గర తీసుకోలేదు, పరుల సొమ్ము నాకు విషంతో సమానం. ఇక కేసులు అన్నీ ఫేక్, ఫాల్స్ కేసులు, అన్నీ బయటపెడతా, అవన్నీ ఫాల్స్ కేసులు. నేను 10 పైసలు తీసుకున్నట్టు తేలితే.. నాకు ఉరివేయండి.. అంతే కానీ ఆధారాలు లేని ఇలాంటి ఆరోపణలకు నేను భయపడను'' అంటూ.. సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేసీ.. ట్యాగ్ లైన్ రాశారు జర్నలిస్ట్ మూర్తి.

66
మూర్తిపై ఆరోపణలు, కేసు

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రముఖ జర్నలిస్టుగా గుర్తింపు పొందారు టీవీ5 మూర్తి. వివాదాస్పద అంశాలపై ఎప్పుడూ సూటిగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు . విషయం ఏదైనా మొహమాటం లేకుండా, ముఖం మీదనే మాట్లాడటం.. సూటిగా సుత్తి లేకుండా చెప్పడం ఆయన స్పెషాలిటీ. ఈక్రమంలో నటుడు ధర్మసత్యసాయి మహేష్ చేసిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణలోని కూకట్ పల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గౌతమి చౌదరి అనే మహిళ తన భర్త మహేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు మీడియా దృష్టిని ఆకర్షించగా, టీవీ5 మూర్తి గౌతమి పక్షాన నిలబడి, ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలు టీవీ5లో ప్రసారమవగా, మహేష్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.తన అనుమతి లేకుండా తన ఇంటికి వస్తున్నాడని, తన భార్యతో అనుచిత సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆరోపించాడు. అంతేకాక, తన ఫోన్ ట్యాప్ చేసి, వ్యక్తిగత విషయాలను టీవీ5లో ప్రసారం చేశారని, తన ఫోన్ ట్యాప్ చేసి.. 10 కోట్లు డిమాండ్ చేశారని కూడా ఆరోపించాడు. దాంతో మూర్తిపై కోర్డు ఆదేశాలతో కేసు నమోదు అయ్యింది.

Read more Photos on
click me!

Recommended Stories