కేజీఎఫ్ చాచా హరీష్ రాయ్ కన్నుమూత

Published : Nov 06, 2025, 01:01 PM IST

Harish Rai passed away సీనియర్ నటుడు కేజీఎఫ్ ఫేమ్ హరీష్ రాయ్ కన్నుమూశారు. 35 ఏళ్ళుగా సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న ఆయన కేజీఎఫ్ సహా పలు హిట్ చిత్రాల్లో విలన్‌గా నటించారు.

PREV
14
హరీష్ రాయ్ కన్నుమూత

కేజీఎఫ్ ఫేమ్ సీనియర్ నటుడు హరీష్ రాయ్ థైరాయిడ్ క్యాన్సర్‌తో కన్నుమూశారు. 90వ దశకం నుంచి యాక్టివ్‌గా ఉన్న ఆయన, ఓం, కేజీఎఫ్ సహా పలు హిట్ చిత్రాల్లో విలన్‌గా నటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు చిత్ర పరిశ్రమ ఆర్థిక సహాయం అందించింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో మరణించారు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో హరీష్ రాయ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. కానీ అనారోగ్యంతో మళ్లీ చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు.

24
చికిత్స కొసం ఆర్ధిక సాయం

అనారోగ్యంతో బాధపడుతున్న హరీష్ రాయ్ చికిత్సకు చిత్ర పరిశ్రమలోని పలువురు నటుడు ఆర్థిక సహాయం చేశారు. థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న హరీష్ రాయ్ పొట్ట ఉబ్బి, శరీరం కృశించిపోయింది. సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు వైరల్ అయ్యాయి.

34
సూపర్ హిట్ సినిమాల్లో హరీష్..

కరవాలి ప్రాంతానికి చెందిన హరీష్ రాయ్ 90వ దశకం నుంచి చిత్ర పరిశ్రమలో చురుకుగా ఉన్నారు. ఓం, నల్ల సహా పలు కన్నడ సూపర్ హిట్ సినిమాల్లో విలన్‌గా నటించారు. 90లలో హరీష్ రాయ్ హెయిర్ స్టైల్ ట్రెండ్‌గా ఉండేది. ఒక కేసులో అరెస్టై జైలు జీవితం కూడా గడిపారు.

44
కన్నడతో పాటు తమిళ సినిమాల్లో

రాజ్ బహదూర్, నన్న కనసిన హూవె, మీండుమ్ ఒరు కాదల్ కధై, జోడి హక్కి, తాయవ్వ, అండర్ వరల్డ్, నల్ల, సంజు వెడ్స్ గీత, స్వయంవర, భూగత, జాఫర్ అలియాస్ ముర్గి జాఫర్ వంటి కన్నడ, తమిళ చిత్రాల్లో హరీష్ నటించారు. హరీష్ రాయ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories