Actress: ఈమె బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. చేసినవి 8 చిత్రాలు మాత్రమే.. కానీ ఆ తర్వాత అత్తమామల కారణంగా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఈ నటి ఎవరని అనుకుంటున్నారా.? ఓ సారి ఈ స్టోరీ చూసేయండి మరి.
ఒక్క లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఇండస్ట్రీలోని దిగ్గజ హీరోయిన్‌లలో నటి పూజా బేడి ఒకరు. అయితే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దికాలానికే పూజా ఇండస్ట్రీని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. వ్యాపారవేత్త ఫర్హాన్ ఫర్నిచర్‌వాలాను వివాహం చేసుకున్న ఆమె.. ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీని విడిచిపెట్టాలనే తన నిర్ణయాన్ని చెప్పుకొచ్చింది. తన భర్త, అతడి కుటుంబమే ఇందుకు ప్రధాన కారణం అని వెల్లడించింది.
25
1980-90వ దశకంలో ఇలా..
1980-90 దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో తరచూ గాసిప్‌లు తెగ వైరల్ అయ్యాయి. నటీనటులను తరచుగా తమ సహనటులతో ముడిపెట్టి వార్తలు ప్రచురించేవారు. ఇలాంటి సమయంలో ఏ కుటుంబాలు కూడా నటీమణులను తమ కోడళ్లుగా అంగీకరించేవారు కాదని.. అది పెద్ద సవాల్‌గా మారిందని పూజా బేడి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.
35
ఫర్హాన్‌తో వివాహం తర్వాత..
టెలివిజన్ హోస్ట్ సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పూజా ఇలా మాట్లాడింది. 'నేను సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన ఫర్హాన్‌ను వివాహం చేసుకున్నాను. అతని కుటుంబం సినిమా సెట్‌లకు వెళ్లే కోడలిని అస్సలు అంగీకరించే అవకాశం లేదు' అని ఆమె అన్నారు. ఆ రోజుల్లో పెళ్లి తర్వాత సినిమాల్లో పనిచేయడం పెద్ద తప్పుగా భావించేవారని పూజ గుర్తు చేసుకుంది.
'సినిమా, ప్రేక్షకులు చాలా అభివృద్ధి చెందారు. అప్పట్లో ఏ హీరోయిన్ అయినా వివాహం చేసుకున్నట్లయితే ఆమె కెరీర్ ముగిసినట్టుగా భావించేవారు. అలాగే తమ కోడళ్లు గ్లామర్ ఇండస్ట్రీకి చెందినవారు కావడం కూడా వాళ్లకు కష్టమైనదిగా భావించారు' అని పూజా బేడీ నిజాయితీగా చెప్పుకొచ్చింది.
55
జో జీతా వోహి సికందర్ మూవీ..
'జో జీతా వోహి సికందర్' సినిమా ఫేం పూజా బేడి తన అత్తమామలను అసౌకర్యానికి గురి కాకుండా.. వారి సంప్రదాయాలను విస్మరించకుండా జాగ్రత్త పడ్డానని తెలిపింది. 'నేను ఏదైనా సినిమా చేయబోతున్నట్లయితే, దానిని పూర్తి ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఉండాలని అనుకున్నా. ఎవరికీ అసౌకర్యం కలిగించాలని నేను కోరుకోలేదు' అని ఆమె పేర్కొంది. ఇక పరిస్థితులకు అనుగుణంగానే తాను ఇండస్ట్రీని విడిచిపెట్టానని స్పష్టం చేసింది పూజా బేడీ.