Karthika Deepam 2 Latest Episode: దశరథ కాళ్లు పట్టుకున్న జ్యో-మనువరాలిపై కోపంతో ఊగిపోయిన శివన్నారాయణ

Published : Oct 22, 2025, 08:01 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 22వ తేదీ)లో అత్త మనసు గాయపడింది. కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందన్న కార్తీక్. అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం నువ్వే డాడీ అన్న జ్యోత్స్న. జ్యోపై విరుచుకుపడ్డ శివన్నారాయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

PREV
15
కార్తీక దీపం 2 సీరయల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో తాత, మామయ్యలను సోఫాలో కూర్చోబెట్టి వారితో నిదానంగా మాట్లాడుతాడు కార్తీక్. అత్త మనసు గాయపడింది. అది నయం కావడానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు మనం వెతికినా దొరకదు. దొరికినా ఇంటికి రాదు. కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి. అత్త తప్పకుండా ఇంటికి వస్తుంది. క్షేమంగా నేను తీసుకువస్తాను అని దశరథ, శివన్నారాయణలతో చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్.

కార్తీక్ మాటలు వింటుంటే ధైర్యంగానే ఉంది కానీ.. సుమిత్ర ఎలా ఉందోనని భయం వేస్తోంది నాన్న అని బాధపడుతాడు దశరథ. అన్నింటికి తెగ బాధపడిపోతానవ్ నువ్వు మారిపోయావ్ గ్రానీ అంటుంది జ్యోత్స్న. దశరథను చూస్తే నాకు దాసు గుర్తుస్తొన్నాడు. వాడు కన్న కొడుకైతే.. దశరథ పెంచిన కొడుకు అంటుంది పారు. ఈ పారిజాతాన్ని చావు తప్ప ఏది మార్చలేదు. కానీ నువ్వు వెళ్లిన పని ఏమైందని అడుగుతుంది పారు. దీప ఇంటికి వెళ్లాను. మమ్మీ అక్కడ ఉందేమోనని డౌట్ ఉంది. ఇల్లు మొత్తం వెతికాను కానీ అక్కడ లేదు. ఏదో మిస్ అవుతున్నాను అని అంటుంది జ్యోత్స్న.

25
అమ్మమ్మ ఔట్ అవుతుంది

మరోవైపు.. శౌర్య అమ్మమ్మ ఇక్కడ ఉందని ఎందుకు ఎవ్వరితో చెప్పకూడదని దీపను అడుగుతుంది. నువ్వు దాగుడు మూతలు ఆట ఆడినప్పుడు నిన్ను ఎవరైనా చూస్తే ఏమవుతుందని అడుగుతుంది దీప. ఔట్ అయిపోతాను అంటుంది శౌర్య. అలాగే అమ్మమ్మ కూడా ఔట్ అయిపోతుంది. కాబట్టి ఎవరితో చెప్పకూడదు అంటుంది దీప. కానీ జ్యో అమ్మమ్మ కూతురే కదా.. జ్యోకు ఎందుకు చెప్పకూడదు అంటుంది శౌర్య. ఎవ్వరితో చెప్పకూడదు. చెప్తే అమ్మమ్మ ఓడిపోతుంది అని చెప్తుంది దీప. ఇదిగో ఈ నారింజ మిఠాయి తిను అని శౌర్య చేతికిస్తుంది అనసూయ. 

35
వేరే ఇంటికి వెళ్లిపోతాం

మేము వేరే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నామని శ్రీధర్ తో చెప్తాడు కాశీ. ఎందుకు ఇక్కడే ఉండొచ్చు కదా అంటాడు శ్రీధర్. మేము ఏమైనా అన్నామా.. బాగానే చూసుకుంటున్నాం కదా అంటాడు. మీరు ఎలా చూసుకున్నా ఇక్కడ నేను ఉండలేను. వేరే ఇల్లు చూసి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నా అంటాడు కాశీ. అల్లుడు గారితో నువ్వేమైన గొడవ పడ్డావా అని స్వప్నను అడుగుతాడు. ఏంటీ డాడీ అన్నింటికి నన్నే అంటారు. నేనేం గొడవ పడలేదు అంటుంది స్వప్న. వీలైనంత త్వరగా వెళ్లిపోవాలి అంటాడు కాశీ. సరే ఈ ఏరియాలోనే ఏదో ఒక ఇల్లు చూద్దాం. ఒకరికొకరు అందబాటులో ఉండొచ్చు అని చెబుతాడు శ్రీధర్.

45
దశరథ కాళ్లు పట్టుకున్న జ్యోత్స్న

టాబ్లెట్ వేసుకో తాత అని వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది జ్యోత్స్న. నాకొద్దు నువ్వు వెళ్లు అంటాడు శివన్నారాయణ. వేసుకో తాత అంటుంది జ్యో. నువ్వు పైకి వెళ్లు జ్యోత్స్న అంటాడు దశరథ. ఎందుకు వెళ్లాలి అంటుంది జ్యోత్స్న. నిన్ను చూస్తే మాకు ఉన్న ఆశ కూడా పోతుంది వెళ్లు అంటాడు దశరథ. బావ, దీప టైంపాస్ చేస్తున్నారు. వాళ్ల మాటలు మీకు నచ్చుతాయి. కానీ నా మాటలు మీకు నచ్చడం లేదా అంటుంది జ్యోత్స్న. అసలు మమ్మీ వెళ్లిపోయిన దగ్గరినుంచి దీప ఇంటికే రాలేదు. బావ వెతుకున్నా అని చెప్తున్నాడు కానీ మమ్మీ ఎక్కడ ఉందో చెప్పట్లేదు. వాళ్లమీద మీకు కొంచెం కూడా అనుమానం రావట్లేదా అంటుంది జ్యోత్స్న. 

సుమిత్ర వెళ్లిపోతుంటే చూసి ఆపకుండా.. కనీసం మాకు చెప్పకుండా ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు అని జ్యోపై మండిపడతాడు దశరథ. నాది తప్పే డాడీ.. నేను వెళ్లే వ్యక్తి మమ్మీ అనుకోలేదు అంటూ దశరథ కాళ్లు పట్టుకొని సారీ చెబుతుంది జ్యోత్స్న. మమ్మీ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే చూసి ఆపనందుకే నన్ను ఇంతలా అంటున్నారు. కానీ అమ్మ వెళ్లిపోవడానికి కారణం మీరే కదా.. ఆ తప్పును మాత్రం మీరు ఒప్పుకోరు కదా అంటుంది జ్యోత్స్న. 

అది విన్న శివన్నారాయణ జ్యోత్స్నపై విరుచుకుపడుతాడు. ఈ గొడవలన్నింటికి కారణం నువ్వే. వారి ఇద్దరి మధ్య దూరం పెంచింది నువ్వే. చిన్న గొడవను మాటలతో పెద్దది చేసింది నువ్వేనని జ్యోపై కోపంతో ఊగిపోతాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు అని కోపంగా అంటాడు. తాత మాటలు విన్న జ్యో షాక్ అవుతుంది. మీకు నేను తప్ప అందరూ నచ్చుతారు అంటూ గదిలోకి వెళ్లిపోతుంది.

55
ఈ ఆట ఎప్పటికీ పూర్తికాదు

మరోవైపు సుమిత్ర గదిలోకి వెళ్తుంది శౌర్య. నారింజ మిఠాయి ఇచ్చి… తిను అమ్మమ్మ అని చెబుతుంది. ఈ రోజు జ్యో వచ్చినట్లే.. తాత కూడా వస్తాడా అని అడుగుతుంది. నాకోసం ఎవ్వరు రారు అంటుంది సుమిత్ర. మరి ఈ ఆట ఎలా పూర్తవుతుంది అంటుంది శౌర్య. ఈ ఆట ఎప్పటికీ పూర్తికాదు. ఈ అమ్మమ్మ ఎవ్వరికీ దొరకదు అంటుంది సుమిత్ర. అయితే ఈ ఆట పూర్తికాదా… అని శౌర్య అంటుండగా అక్కడికి వచ్చిన కార్తీక్ కచ్చితంగా పూర్తవుతుంది రౌడీ. ప్రేమ ఉన్న వాళ్ల చూపుల్లో నుంచి మనసున్న వాళ్లు ఎప్పటికీ తప్పించుకోలేరు. అమ్మమ్మ రెస్ట్ తీసుకోవాలి మనం వెళ్దాం పదా అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories