చిరంజీవి సినిమాలో రజినీకాంత్ ? మెగా సూపర్ మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా?

Published : Nov 26, 2025, 09:36 AM IST

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో మూవీ రాబోతున్నట్టు వార్త వైరల్ అవుతోంది. అందులో నిజమెంత?

PREV
16
అభిమానుల నుంచి డిమాండ్..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ ఇద్దరు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఈ స్థాయికి వచ్చారు. ఎంతో కష్టపడి, తమను తాము నిరూపించుకుని ఈ స్టేజ్ కు వచ్చారు. అయితే ఈ ఇద్దరు హీరోల కాంబోలో సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మధ్యలో చాలా సార్లు చిరు, రజినీ సినిమా చేయబోతున్నారన్న వార్తలు వినిపించినా..? అవి నిజం అవ్వలేదు. ఇక ఇద్దరు హీరోలు ఏడు పదుల వయస్సులో మల్టీ స్టారర్ మూవీకి రెడీ అయినట్టు సమాచారం. మరి ఈసినిమా అయినా నిజం అవుతుందా? అభిమానుల కల నెరవేరనుందా?

26
రజినీకాంత్ రిటైర్మెంట్ వార్తలు ..

రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు.. కానీ అనారోగ్యం వల్ల... ఆయన వెనకడుకు వేయాల్సి వచ్చింది. ఇక సినిమాల నుంచి కూడా సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇంకా రెండు మూడు సినిమాల తరువాత రజినీకాంత్ సినిమాలు కూడా మానేసి.. ఆథ్యాత్మికి మార్గంలో వెళ్తారన్న టాక్ కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈలోపే సూపర్ స్టార్ తన స్నేహితుడు.. సమకాలీన నటుడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలనే ఆలోచన చేసినట్టు సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. దాంతో కమల్ హాసన్ నిర్మాతగా ఒక సినిమా మాత్రం స్టార్ట్ చేయబోతున్నారు. ఈసినిమాలో కమల్ అతిథి పాత్రలో కనిపించే అవకాశం లేకపోలేదు. ఇక రజినీకాంత్ తో మెగాస్టార్ చిరంజీవిని కూడా తెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. దాంతో చిరు, రజినీ కాంబో కూడా త్వరలో తెరపై కనిపించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

36
చిరంజీవి సినిమాలో రజినీకాంత్..?

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను కమిట్ అయ్యారు. వీరి కాంబో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ కాంబో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటడానికి రెడీ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త సినిమా 2026 ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈసినిమాలో రజినీకాంత్ చేత పవర్ ఫుల్ పాత్ర ఒకటి చేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

46
చిరు, రజినీతో బాబీ మాస్టర్ ప్లాన్?

డైరెక్టర్ బాబీ ఈ పాత్రను ముందే డిజైన్ చేసి పెట్టుకున్నారట. రజనీకాంత్ కోసం సుమారు 30 నిమిషాల ప్రత్యేక పాత్రను రాసుకున్నారట. ఇది కేవలం కెమెరాలో కనిపించే చిన్న క్యారెక్టర్ మాత్రమే కాదు, కథను మలుపు తిప్పి, సినిమాపై కీలక ప్రభావం చూపే పాత్రగా డిజైన్ చేస్తున్నారన్న ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మూవీ టీమ్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇది నిజమైతే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.

56
హిట్ కోసం రజినీకాంత్ ఎదరుచూపులు

రజనీకాంత్ కెరీర్ పరంగా చూస్తే, ఇటీవలి కూలీ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో.. మంచి సక్సెస్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జైలర్ 2పైనే తలైవా ఆశలన్నీ పెట్టుకున్నారు. రిటైర్మెంట్ ప్రకటన లోపు చిరంజీవితో సినిమా కన్ ఫార్మ్ అయితే.. ఇండస్ట్రీలోనే ఇది భారీ అంచనాలను క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ నిజంగా తెరపై కనిపిస్తే.. సౌత్ ఆడియన్స్ కు ఇది భారీ విజువల్ ట్రీట్ అవుతుంది.

66
స్టార్ హీరోల ఇమేజ్ ను బ్యాలెన్స్ చేయగలడా?

బాబీ లాంటి కమర్షియల్ టచ్ ఉన్న దర్శకుడు ఈ ఇద్దరు సూపర్‌స్టార్లను సమానంగా చూపించగలడా, కథను ఎలా బాలెన్స్ చేస్తాడు అన్నది పెద్ద ప్రశ్న. రజనీకాంత్, చిరంజీవి ఇద్దరూ స్క్రీన్‌పై సమానమైన ఇమేజ్ తో కనిపించే విధంగా కథను ప్లాన్ చేస్తే, ఈ సినిమా భారీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్ మాత్రమే. ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు వేచి చూడాల్సిందే.

Read more Photos on
click me!

Recommended Stories