కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు దాసు. నేను ఇప్పుడు ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్తున్నాను. కానీ దీపకు, దీప కడుపులో బిడ్డకు నువ్వు ఏమైనా చేయాలి అనుకుంటే మాత్రం... నిన్ను వదిలిపెట్టను. ఎక్కడున్నా ఇక్కడికి వస్తాను. నిజం అందరితో చెప్తాను. నువ్వు అన్నింటికి సిద్ధంగా ఉండు. త్వరలోనే నువ్వు నా కూతురివి అనే నిజం బయటపడనుంది అని జ్యోత్స్నతో చెప్పి వెళ్లిపోతాడు దాసు.
25
కార్తీక్ ని హగ్ చేసుకున్న దీప
డాక్టర్ తో ఫోన్ లో మాట్లాడుతుంటాడు కార్తీక్. ఇంతలో అక్కడికి వస్తుంది దీప. ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దీపకు ప్రేమగా చెప్తాడు కార్తీక్. భర్తను హగ్ చేసుకుంటుంది దీప. భార్యా భర్తలు ఇద్దరూ కలిసి పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుకుంటారు. నాన్న అని పిలవడానికి శౌర్య ఉన్నా.. ఇంకో పిలుపు కోసం నేను సంతోషంగా వెయిట్ చేస్తున్నా.. ఆ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పలేను అంటాడు కార్తీక్. 9 నెలలు సంతోషంగా గడవాలి. ప్రతి క్షణం నేను నీ పక్కనే ఉండి నీకు సేవలు చేయాలి. నిన్ను జాగ్రత్తగా, సంతోషంగా చూసుకోవాలి అంటాడు కార్తీక్. రేపటి నుంచి నువ్వు తాత వాళ్ల ఇంటికి రావద్దు అని చెప్తాడు. అక్కడికి వస్తే అమ్మానాన్న పక్కనే ఉంటారు. నాకు అదో సంతోషం అంటుంది దీప.
35
కాశీపై ఫైర్ అయిన శ్రీధర్
మరోవైపు కాశీ, స్వప్నకు ఎదురుగా వస్తూ చూడకుండా డ్యాష్ ఇస్తాడు. సారీ చెప్తే.. స్వప్న పట్టించుకోదు. మీ అన్నయ్య మన ఇద్దరినీ కలిపాడు కదా.. ఇంకా అలాగే ఉన్నావెందుకు అని స్వప్నను అడుగుతాడు కాశీ. మా అన్నయ్య కలిపినంత మాత్రానా.. నేను అన్ని మర్చిపోయి నవ్వుకుంటూ మాట్లాడలేను అంటుంది స్వప్న. ముందు జాబ్ తెచ్చుకో అంటుంది. జాబ్ లేకపోతే నాకు ఏ విలువ లేదా అంటాడు కాశీ.
భర్తంటే ఎలా ఉండాలో మా అన్నయ్యను చూసి నేర్చుకో అంటుంది స్వప్న. కార్తీక్ గురించి తక్కువ చేసి మాట్లాడుతాడు కాశీ. నా కొడుకు గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అంటూ కాశీపై ఫైర్ అవుతాడు శ్రీధర్. కార్తీక్ చేసిన త్యాగాలను గుర్తుచేసి.. వాడితో నీకు ఏ రకంగా పోలిక లేదు అని చెప్పి వెళ్లిపోతాడు. అనవసరంగా బావ గురించి మాట్లాడాను. నా టైం బాగోలేదు అని మనసులో అనుకుంటాడు కాశీ.
ఒంటరిగా కూర్చొని గురువు గారు చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటాడు శివన్నారాయణ. ఈ ప్రమాదం నుంచి నా కుటుంబాన్ని ఎవరు కాపాడుతారు అని ఆలోచిస్తుండగా.. కార్తీక్, దీప ఎంట్రీ ఇస్తారు. నువ్వు ఎందుకు వచ్చావమ్మా.. ఈ టైంలో నువ్వు మంచిగా రెస్ట్ తీసుకోవాలి కదా అంటాడు దశరథ. అదేంటి డాడీ.. ఈ విషయాలు దీపకు ముందే తెలుసు కదా.. ఇది తనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏం కాదు కదా.. అని ఎగతాళిగా నవ్వుతుంది జ్యోత్స్న.
దీప, బావతో పిల్లల్ని కనడం మొదటిసారి అని ఈ జాగ్రత్తలు చెప్తున్నారా? అంటుంది జ్యోత్స్న. అవమానంతో తలదించుకుంటుంది దీప. జ్యో పైకి చేయి ఎత్తుతాడు దశరథ. ఈలోపు జ్యోత్స్న చెంప పగలకొడుతుంది సుమిత్ర. నువ్వు అవమానించింది దీపను కాదు.. అమ్మతనాన్ని. కడుపులో బిడ్డను మోయడం గురించి నీకెం తెలుసు. నేను కూడా నిన్ను అలాగే కన్నాను. దీప పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు, అర్హత నీకు లేవు. మరోసారి ఇలా మాట్లాడితే క్షమించను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర.
55
కాంచన గుర్తొచ్చింది
నీతో మాట్లాడాలి అని కార్తీక్ ని బయటకు తీసుకెళ్తాడు శివన్నారాయణ. గురువు గారు చెప్పిన విషయాలు కార్తీక్ తో చెప్తాడు. ఎవరికి ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది రా. నా గురించి నాకు బాధలేదు. కానీ ఎవరికైనా ఏమైనా అయితే తట్టుకునే వయసు కాదురా నాది అంటాడు కార్తీక్ తో. ఎవరి మొహం చూసినా భయంగా ఉంది. అప్పుడే కాంచన గుర్తొచ్చింది అంటాడు శివన్నారాయణ. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.