వారణాసి లో రుద్రగా సందడి చేయబోతున్నాడు మహేష్ బాబు. ఇక ఈసినిమాలో ఎమోషనల్ ప్లాప్ బ్యాక్ కూడా చూపించబోతున్నాడట రాజమౌళి. అందులో మహేష్ చిన్ననాటి రుద్ర క్యారెక్టర్ కోసం ఎవరిని తీసుకున్నారో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఏడాదికి పైనే టైమ్ ఉన్నా.. ఈసినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. భారీ గ్లోబల్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోన్న వారణాసి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. రోజుకో రూమర్ పుట్టుకొస్తూనే ఉంది. అయితే వారణాసి నుంచి ఏ విషయం బయటకు వచ్చినా.. సూపర్ ఫాస్ట్ గా వైరల్ అవుతోంది. ఈక్రమంలో ఈసినిమాలో మహేష్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు సబంధించి ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.
25
వారణాసి లో కృష్ణ వారసుడు
తాజా ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ సినిమాలో మహేష్ బాబుకు ప్లాష్ బ్యాక్ ఉంటుందట. అందులో మహేష్ బాబు చిన్ననాటి పాత్ర ను చూపించబోతున్నట్టు సమాచారం. ఇక చిన్న రుద్ర పాత్ర కోసం ఆయన మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, సుధీర్ బాబు కుమారుడు దర్శన్ ను తీసుకున్నట్టు టాలీవుడ్ ర్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
35
ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ లో
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. బాహుబలి లో చిన్నప్పటి మహేంద్ర బాహుబలి పాత్రను ఎంతో ఎమోషనల్ గా, పవర్ ఫుల్ గా చూపించిన జక్కన్న.. ఈసారి వారణాసి లో అంతకు మించి మహేష్ బాబు ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారట. యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడం, సుధీర్ బాబు తనయుడికి ఈ క్యారెక్టర్ తో ఇండస్ట్రీలో లైఫ్ రావడం పక్కా అంటున్నారు.
దర్శన్ వయసులో చిన్నవాడు అయినా.. నటన విషయంలో అద్భుతగా చేసినట్టు తెలుస్తోంది. రాజమౌళి ఆడిషన్ తీసుకోకుండా యాక్టర్స్ ను సెలెక్ట్ చేయడు. దర్శన్ ను కూడా ఆడిషన్ చేసినట్టు సమాచారం. రాజమౌళిని మెప్పించే నటన చూపించాడంటే.. కృష్ణ వారసుడిగా మరో హీరో త్వరలో ఇండస్ట్రీలో సందడి చేయబోతున్నాడంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. దర్శన్ లో తాత కృష్ణ పోలికలు, మేనమామ మహేష్ బాబు షేడ్స్ కూడా కనిపిస్తాయని అభిమానులు అంటున్నారు. అయితే మహేష్ బాబు చిన్ననాటి పాత్రకోసం దర్శన్ ను తీసుకున్నారా లేదా అనే విషయం..వారణాసి టీమ్ నుంచి మాత్రం ఇంత వరకూ అఫీషియల్ గా ప్రకటించలేదు. ఇండస్ట్రీలో మాత్రం టాక్ గట్టిగా నడుస్తోంది.
55
మరో రెండు సినిమాల్లో అవకాశం..
అంతే కాదు వారణాసి తో పాటు మరో రెండు సినిమాల్లో కూడా దర్శన్ కనిపించబోతున్నాడనే వార్త ఘట్టమనేని అభిమానుల్లో సంతోషాన్నికలిగిస్తోంది. అందులో ప్రభాస్ ఫౌజీలో కూడా యంగ్ ప్రభాస్ గా దర్శన్ నటిస్తున్నట్టు టాక్. సుధీర్ బాబు ఇప్పటికే పిల్లలకి నటనతో పాటు జిమ్నాస్టిక్స్ లాంటి వాటిలో కూడా ట్రైయినింగ్ ఇస్తూ.. ఆ వీడియోలు, ఫిట్‌నెస్ క్లిప్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉన్నారు. దాంతో సుదీర్ బాబు తన వారసులను రంగంలోకి దింపడానికి టైమ్ కోసం చూసినట్టు తెలస్తోంది. వారణాసిలో నిజంగా దర్శన్ కనిపిస్తే.. కృష్ణ అభిమానులకు కు అది పండగనే చెప్పాలి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వారణాసి షూటింగ్ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తైన తర్వాత దర్శన్ పాత్రపై లేదా చిన్నప్పటి మహేష్ బాబు ఎపిసోడ్స్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది.