రాజమౌళి కొడుకుతో ప్రియాంక చోప్రా స్టెప్పులు, గ్లోబల్ బ్యూటీతో కలిసి రెచ్చిపోయిన కార్తికేయా

Published : Nov 23, 2025, 01:33 PM IST

Priyanka Chopra Dances : వారణాసి సినిమాలో మహేష్ బాబు జోడీగా పవన్ ఫుల్ రోల్ చేస్తోంది.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. జక్కన్న టీమ్ తో చాలా కాలంగా ట్రావెల్ చేస్తోంది. ఈక్రమంలో ఓ పార్టీలో రాజమౌళి తనయుడితో పాటు డాన్స్ చేసింది ప్రియాంక చోప్రా. 

PREV
14
రాజమౌళి తనయుడితో ప్రియాంక చోప్రా డాన్స్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారణాసి సినిమాకు నిర్మాతగా ఉన్నాడు కార్తికేయ. కార్తికేయతో ప్రియాంక డాన్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమళి దర్శకత్వంలో, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా వారణాసి. ఈసినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈసినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

24
కార్తికేయ బర్త్ డే పార్టీలో

వారణాసి టీమ్ గత కొద్ది కాలంగా కలిసి ప్రయాణం చేస్తున్నారు. షూటింగ్ తో పాటు కొన్ని ఈ వెంట్స్.. పార్టీలతో సందడిచేస్తున్నారు. ఇక తాజాగా కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో వారణాసి టీమ్ అంతా పాల్గొన్నారు. కార్తికేయ బర్త్ డే సందర్భంగా ప్రియాంక చోప్రా తన శుభాకాంక్షలను తెలియజేయడమే కాకుండా, ఆయనతో కలిసి ‘ఊర్వశీ ఊర్వశీ టేకిట్ ఈజీ ఊర్వశీ’ పాట ఇన్‌స్ట్రుమెంటల్‌కు సరదాగా స్టెప్పులు వేశారు. ఈ వీడియోలో ఇద్దరూ ఎంజాయ్ చేస్తూ కనిపించగా, ఈ సరదా మూమెంట్‌ను ప్రియాంక తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసుకున్నారు.

34
ప్రియాంక చోప్రా పోస్ట్

ప్రియాంక డాన్స్ వీడియో పోస్ట్ చేస్తూ.. “టేక్ ఇట్ ఈజీ మై ఫ్రెండ్. తెరవెనుక ఉండి అన్ని పనులను సైలెంట్‌గా చక్కబెట్టే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు కార్తికేయ. ఈ సినిమా ప్రయాణంలో నీతో కలిసి డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది” అని రాసుకొచ్చారు. ప్రియాంక సోషల్ మీడియా నుంచి ఈ వీడియో పోస్ట్ అయిన కొద్ది గండల్లోనే వైరల్ అయ్యింది. అభిమానులు, నెటిజన్లు ఈ వీడియోకు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

44
వారణాసిపై భారీ అంచనాలు

దాదాపు గా 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న వారణాసిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేశ్ బాబు ఫాస్ట్ టైమ్ పాన్ వరల్డ్ సినిమా చేస్తుండటంతో.. అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈమూవీ రిలీజ్ కు ఇంకా ఏడాదిన్నరకు పైగా టైమ్ ఉన్నా.. ఇప్పటినుంచే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తోన్న ఈసినిమా 2027 సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories