కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:దీపను తోసేసిన జ్యో-స్పృహ తప్పి పడిపోయిన దీప-గుడ్ న్యూస్ చెప్పనుందా?

Published : Nov 22, 2025, 07:52 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 22వ తేదీ)లో దీప మీద ఫైర్ అయిన జ్యో. పూర్ణాహుతిని కావాలనే వదిలేశావా అని జ్యోను ప్రశ్నించిన శివన్నారాయణ. దీపను మెచ్చుకోవాలి అన్న గురువు. దీపను తోసేసిన జ్యో. స్పృహ తప్పి పడిపోయిన దీప. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

PREV
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో జ్యోత్స్న పూర్ణాహుతి వదిలేస్తుంది. అంతా టెన్షన్ పడతారు. ఈలోపు దీప చేతుల మీదుగా పూర్ణాహుతి హోమంలో పడుతుంది. దీప అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. మనం తర్వాత మాట్లాడుకుందాం ఆగు అంటాడు శివన్నారాయణ. మీరు చెప్పినట్లు హోమం దిగ్విజయంగా పూర్తిచేశారు గురువు గారు అంటాడు శివన్నారాయణ. సుమిత్ర, దశరథలను పిలిచి మీ చేతుల మీదుగా అందరికీ తాంబూలం ఇవ్వండి అని చెప్తాడు. భార్యా భర్తలు ఇద్దరూ కలిసి తాంబూలం ఇస్తారు. జ్యోత్స్న చిన్నగా గొడవ స్టార్ట్ చేస్తుంది. 

26
పూర్ణాహుతిని కావాలనే వదిలేశావా?

హోమం పూర్తికాలేదు. గురువు గారు వారసురాలి చేతుల మీదుగా పూర్ణాహుతి హోమంలో పడాలి అని చెప్పారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? దీప చేతుల మీదుగా పడింది. అంటే హోమం పూర్తి కానట్లే కదా అంటుంది జ్యోత్స్న. నువ్వు కావాలనే పూర్ణాహుతిని హోమంలో వేశావు కదా అని దీపను నిలదీస్తుంది.

నువ్వు పూర్ణాహుతిని వదిలేస్తే నా భార్య దాన్ని కిందపడకుండా హోమంలో పడేలా చేసిందని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్. ఆమె ఆలోచనలు ఎక్కడో ఉన్నాయిలే అన్నయ్య అంటుంది స్వప్న. నోరుమూయ్.. నువ్వు కూడా శివన్నారాయణ మనుమరాలికి ఎదురు చెప్పే స్థాయికి ఎదిగావా అంటుంది పారు. స్వప్న మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటాడు కాశీ. ఆపరా.. నువ్వు నాకు చెప్పేంత వాడివి అయ్యావా అంటుంది పారు. 

మా అల్లుడి గారెని ఏమైనా అంటే ఊరుకోము అంటారు శ్రీధర్, కావేరి. దీప కావాలని పూర్ణాహుతిని హోమంలో వేసింది అనుకోవాలంటే.. నువ్వు పూర్ణాహుతిని కావాలని వదిలేసి ఉండాలి.. మరి నువ్వు కావాలనే వదిలేశావా అని జ్యోత్స్నను నిలదీస్తాడు శివన్నారాయణ. సైలెంట్ అవుతుంది జ్యోత్స్న. అంతా మంచే జరిగింది ఇక్కడితో వదిలేయండి అంటాడు శివన్నారాయణ.

36
దీపను మెచ్చుకోవాలి

ఈ ఇంటి పనిమనిషి చేతుల మీదుగా పూర్ణాహుతి హోమంలో పడితే మంచే ఎలా జరుగుతుంది అంటుంది జ్యోత్స్న. జరుగుతుంది అంటాడు గురువు గారు. పూర్ణాహుతి నేల మీద పడకుండా దీప హోమంలో పడేలా చేసింది. అందుకు మెచ్చుకోవాలి అంటాడు. కార్తీక్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దీప ఈ ఇంటికి బంధువైంది కానీ.. లేకపోతే అమ్మానాన్న లేని అనాథ అంటుంది పారిజాతం. కోపంగా చూస్తారు కార్తీక్, కాంచన. కొందరి స్వార్థం వల్ల పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవుతారు కానీ.. దీప తల్లిదండ్రులు కూడా ఎక్కడో బ్రతికే ఉన్నారు. దేవుడే వాళ్లను కలుపుతాడు అంటాడు గురువు.

46
దీపను తోసేసిన జ్యోత్స్న

నువ్వు ఏం చేసినా కరెక్ట్. నేను ఏం చేసినా తప్పే. అందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు. అసలు నా కుటుంబానికి నాకు మధ్య నువ్వు అడ్డుగోడలా ఉన్నావు అని కోపంతో దీపను తోసేస్తుంది జ్యోత్స్న. స్పృహ తప్పి పడిపోతుంది దీప. అంతా షాక్ అవుతారు. దీప అంటూ.. దగ్గరికి వెళ్లి లేపే ప్రయత్నం చేస్తారు. నువ్వు మనిషివేనా జ్యోత్స్న అని కోపంతో ఊగిపోతాడు శివన్నారాయణ. దీపకు ఏం కాలేదు అని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది పారు. దీపను ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్తాడు కార్తీక్. దీపను ప్రేమగా చూసుకుంటుంది సుమిత్ర. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లండి. నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది.

56
జ్యోపై ఫైర్ అయిన పారు

జ్యోత్స్నను బయటకు తీసుకెళ్తుంది పారు. అసలు ఏమైందే నీకు.. కోపానికి కూడా హద్దు ఉంటుంది. ఎందుకు ఇలా చేశావు అని జ్యోపై ఫైర్ అవుతుంది పారు. నేను ఏం చేయలేదు గ్రానీ. ముట్టుకోగానే అదే పడిపోయింది అంటుంది జ్యోత్స్న. ఆ విషయం నీకు నాకు తెలుసు. కానీ ఇంట్లో వాళ్లకు తెలియదు కదా.. అదే పూర్ణాహుతిని హోమంలో వేసి కుటుంబాన్ని కాపాడిందని అందరూ అనుకుంటున్నారు అంటుంది పారు. 

అయినా.. పూర్ణాహుతి ఎవరు వేస్తే నీకెందుకు. నువ్వు అలాంటివి అన్నీ నమ్మను అన్నావు కదా అంటుంది పారు. ఎవ్వరు వేసిన నాకు ఇబ్బంది లేదు కానీ.. దీప వేయకూడదు అంటుంది జ్యోత్స్న. ఎందుకు అని అడుగుతుంది పారు. ఎందుకంటే అదే ఈ ఇంటి వా.. అని ఆగిపోతుంది జ్యోత్స్న. హా చెప్పు ఏంటి అంటుంది పారు. దీప ఈ ఇంటి పని మనిషి. నా శత్రువు. అని కవర్ చేస్తుంది జ్యోత్స్న.

66
వీళ్ల మధ్య ఏదో జరిగింది

మరోవైపు అందరికీ ప్రసాదం పెడుతుంది స్వప్న. కాశీకి పెట్టకుండా వెళ్తుంది. గమనించిన కార్తీక్.. కాశీకి ఎందుకు పెట్టలేదు అని అడుగుతాడు. మర్చిపోయాను అన్నయ్య అంటుంది స్వప్న. వీళ్ల ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే అనుమానంతో చూస్తాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories