కేసుల భయం లేదు, తప్పు చేశాను క్షమించండి.. తిరుమల వివాదంపై స్పందించిన శివజ్యోతి

Published : Nov 23, 2025, 10:40 AM IST

Shiva jyothi Apologizes : తిరుమల ప్రసాదంపై చేసిన కామెంట్స్ వివాదం అవుతుండటంతో.. తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి స్పందించింది. క్షమాపణలు కోరుతూ.. ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో ఆమె ఏమన్నదంటే?

PREV
14
తీన్మార్ సావిత్రి తిరుమల వివాదం

బుల్లితెరపై బిజీ స్టార్ శివజ్యోతి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంటుంది. న్యూస్ ప్రెసెంటర్ గా పనిచేసిన ఆమె తీన్మాన్ సావిత్రిగా ఫేమస్ అయ్యింది. దాంతో తరచూ వివిధ విషయాలపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా లో వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఈక్రమంలోనే ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదంలో చిక్కుకుంది. తిరుమలలో అందించే ప్రసాదం గురించి శివజ్యోతి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. పవిత్రమైన ప్రసాదాన్ని అవమానించే విధంగా మాట్లాడినట్లు హిందూ సంఘాలు ఆరోపించడంతో, ఈ అంశం త్వరగానే పెద్ద వివాదంగా మారింది. దాంతో తీన్మార్ సావిత్రి ఈ విషయంపై స్పందిస్తూ.. ఓ వీడియోను రిలీజ్ చేసింది.

24
శివజ్యోతి క్షమాపణలు

తిరుమలలో ప్రసాదంపై తాను చేసిన వాఖ్యలపై పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో, శివజ్యోతి ఒక వీడియోను విడుదల చేసి క్షమాపణలు తెలిపారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ, “తిరుమల ప్రసాదం గురించి నేను చేసిన కామెంట్స్ చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. ముందుగా నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలి. నేను వాడిన రిచ్ అనే పదం తప్పుగా అర్థం చేసుకున్నారు. రిచ్ అనే పదం నేను వాడింది రూ.10,000 ఎల్1 క్యూ లైన్‌లో నిలబడాం కాబట్టే కాదు. కాస్ట్‌లీ లైన్‌లో నిలబడ్డామనే ఉద్దేశంతో అన్నాను. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తి, ఇష్టమో.. నన్ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి బాగా తెలుసు. నేను నాలుగు నెలలుగా ప్రతి శనివారం వ్రతాలు చేస్తున్నాను. నా బిడ్డ కూడా ఆ స్వామి ఇచ్చిన వరప్రసాదమే. అలాంటి స్వామి గురించి తప్పుగా నేను ఎలా మాట్లాడగలను?” అని ఆమె వివరణ ఇచ్చారు.

34
కేసులు పెడతారన్న భయంతో కాదు

శివజ్యోతి మాట్లాడుతూ.. '' నా మాటలపై ఎవరో కేసులు పెడతారన్న భయంతో స్పందించడంలేదు.. నేను మాట్లాడిన తీరు సరైనది కాదని నాకే అనిపించింది. అందుకే క్షమాపణలు చెబుతున్నాను. నా ఇంటెన్షన్ అదికాదు. నా మాటలు తప్పుగా వినిపించి ఉండొచ్చు. అలా మాట్లాడకూడదనిపించింది, అందుకే ఈ క్షమాపణ” అని ఆమె అన్నారు. శివజ్యోతి విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాదం నేపథ్యంలో ఆమె ఇచ్చిన వివరణతో విమర్శలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఈ విషయం ఇంకా కొనసాగుతూనే ఉంది.

44
శివజ్యోతి తిరుమల ప్రసాదంపై చేసిన కామెంట్స్ ఏంటి?

యాంకర్‌ శివజ్యోతి తన భర్త, ఫ్రెండ్ తో కలిసి తిరుమల వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్నతరువాత బయటకు వస్తూ భక్తుల కోసం అందిస్తున్న శ్రీవారి ప్రసాదం తీసుకున్నారు. ఆమెతో పాటు శివ జ్యోతి ఫ్రెండ్‌ సోను కూడా ప్రసాదం తీసుకోగా.. శివజ్యోతి వీడియో తీసింది. ఫ్రెండ్‌ ప్రసాదం తీసుకుంటుండగా, `సోను కాస్ట్ లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్` అని నవ్వుతూ కామెంట్‌ చేసింది జ్యోతి. వెంటనే ఫ్రెండ్‌ సోను స్పందిస్తూ, `జీవితంలో ఎప్పుడూ అడుక్కోలేదు.. ఫస్ట్ టైమ్‌ అడుక్కున్నా` అంటూ రియాక్ట్ అయ్యాడు. దీనికి శివజ్యోతి నవ్వుతూ స్పందించింది. `తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్లం` అని కామెంట్‌ చేయగా, `అడుక్కున్నా కానీ, బాగుంది గాయ్స్` అంటూ సోను అన్నాడు. ఈ వీడియోను శివజ్యోతి స్వయంగా తన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా, ఈ వీడియోని చూసిన భక్తులు, హిందూ సంఘాలు ఆమెపై మండిపడుతున్నారు. ట్రోల్‌ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories