తమ్ముడు మంచు మనోజ్‌ రివ్యూపై మంచు విష్ణు రియాక్షన్‌.. ఈ సక్సెస్‌ని వాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు

Published : Jun 28, 2025, 11:13 PM IST

`కన్నప్ప` సినిమా బాగుందంటూ మంచు మనోజ్‌ శుక్రవారం తనదైన స్టయిల్‌లో రివ్యూ ఇచ్చారు. తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించారు. ఆయన ఏమన్నాడంటే? 

PREV
15
`కన్నప్ప` సక్సెస్‌పై మోహన్‌ బాబు కామెంట్స్

మంచు విష్ణు హీరోగా నటిస్తూ రూపొందించిన `కన్నప్ప` మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.20 కోట్లు వసూలు చేసిందని టాక్‌. ఇది వీరికి భారీ ఓపెనింగ్‌ అనే చెప్పాలి. 

దీంతో శనివారం `కన్నప్ప` మూవీ థ్యాంక్స్ మీట్‌ నిర్వహించారు. ఇందులో మోహన్‌ బాబు మాట్లాడుతూ ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పారు. ఎంతో మంది కష్టపడి పనిచేశారని వారందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పారు. 

అదే సమయంలో యాభై ఏళ్లుగా తనని ప్రేమిస్తూ, ఆదరిస్తున్న అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇన్నాళ్లు తన వెంటే ఉన్నారని, వారి వల్లే ఇక్కడి వరకు వచ్చినట్టు తెలిపారు.

25
`కన్నప్ప` కి దారుణమైన ట్రోల్స్ ఫేస్‌చేశా

ఇక మంచు విష్ణు మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఎమోషనల్‌గా ఉందన్నారు. ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని ఈ మూవీని రూపొందించినట్టు తెలిపారు. 

`కన్నప్ప` టీజర్‌ వచ్చినప్పుడు దారుణమైన ట్రోల్స్ వచ్చాయని, ఎన్నో రకాలుగా సినిమాని, తమని అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అదే సమయంలో సినిమా కోసం తన ఆస్తులన్నీ బ్యాంక్‌లో తాకట్టు పెట్టినట్టు తెలిపారు.

35
ప్రభాస్‌ వల్లే `కన్నప్ప`కి ఇంతటి భారీ ఓపెనింగ్స్

ఈ సందర్భంగా మంచు విష్ణు సినిమా సక్సెస్‌ ఆడియెన్స్ ఆదరణ, శివలీల వల్లనే సాధ్యమైందని, ఇంతటి రెస్పాన్స్ భావోద్వేగంతో కూడినదన్నారు. ఈ మూవీ సక్సెస్‌ని నాన్న మోహన్‌ బాబుకి, వారి అభిమాలకు డెడికేట్‌ చేస్తున్నట్టు తెలిపారు. 

అదే సమయంలో ప్రభాస్‌కి రుణపడి ఉంటానని తెలిపారు. ఈ రోజు ఇంతటి భారీ ఓపెనింగ్స్ వచ్చాయంటే అది కేవలం ప్రభాస్‌ వల్లే సాధ్యమైందని, ఆయన వల్లే ఇన్ని కలెక్షన్లు వచ్చాయి, ఆయనకోసమే చాలా మంది ఆడియెన్స్ వచ్చారు, ఆ తర్వాతనే `కన్నప్ప` కథ వారికి కనెక్ట్ అయ్యిందన్నారు మంచు విష్ణు.

45
తమ్ముడు మంచు మనోజ్‌ రివ్యూపై మంచు విష్ణు రియాక్షన్‌

ఈ క్రమంలో తమ్ముడు మంచు మనోజ్‌ `కన్నప్ప`సినిమాపై తనదైన రివ్యూ ఇచ్చారు. సినిమా బాగుందని, నటీనటులు బాగా చేశారని, ప్రభాస్‌ వచ్చాక సినిమా రేంజ్‌ మారిపోయిందంటూ ప్రశంసలు కురిపించారు. 

వారి మధ్య వివాదాలున్నా ఆయన పాజిటివ్‌గా స్పందించారు. వెయ్యి కోట్లు వసూలు చేయాలంటూ కోరుకున్నారు. దీనిపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. తమ్ముడి కామెంట్‌పై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఆయన స్పందిస్తూ థ్యాంక్స్ చెప్పారు. 

సినిమాని చూసి ప్రశంసించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు మంచు విష్ణు. కాకపోతే తమ్ముడి పేరుని పలికేందుకు ఆసక్తి చూపించలేదు.

 ఈ మూవీ ఎంత వసూళు చేస్తుందనే దానికంటే ఎంత మందికి రీచ్‌ అయ్యిందనేదే తనకు ముఖ్యమన్నారు. ఈ తరానికి ఈ కథ తెలియాలన్నారు.

55
నాగార్జున ఫోన్‌ చేశారు, వాళ్లు ఈ సక్సెస్‌ ని జీర్ణించుకోలేకపోతున్నారు

ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే ప్రశ్నకి స్పందిస్తూ, చాలా మంది అప్రిషియేట్‌ చేస్తున్నారని చెప్పారు. నాగార్జున గారు ఫోన్‌ చేసి అభినందించారని, చాలా సేపు మాట్లాడారని, 

అది తనకు ఎంతో సంతోషాన్ని ధైర్యాన్నిచ్చిందని, అలాగే అల్లు అరవింద్‌ ఫోన్‌ చేసి మాట్లాడారని, కోన వెంకట్‌, బీవీఎస్‌ రవి వంటి వారు అభినందించారని వెల్లడించారు.

 బ్రహ్మానందం గారు ఎంతో ధైర్యాన్నిచ్చారని చెప్పారు. రామ్‌ గోపాల్‌ వర్మ పెట్టిన మెసేజ్‌కి కన్నీళ్లు వచ్చాయన్నారు. వాళ్ల అమ్మ కూడా ఫోన్‌ చేసి సన్నివేశాల గురించి మాట్లాడారని తెలిపారు. 

అదే సమయంలో ఇండస్ట్రీలోని మరికొందరి గురించి చెబుతూ, నిజంగానే సినిమా హిట్‌ అయ్యిందా? అని ఆరాతీసే పనిలో ఉన్నారని, వాళ్లు ఆలోచనలో పడ్డారని, ఈ సక్సెస్‌ని వాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని తన మూవీపై రియాక్ట్ కాని వారిపై పరోక్షంగా సెటైర్లు వేశారు మంచు విష్ణు. 

ఇలాంటి సినిమాని తెలుగులో తనతో ఏ దర్శకుడూ తీయడని, అందుకే ముఖేష్‌ కుమార్‌సింగ్‌ని ఎంచుకున్నట్టు ఓ ప్రశ్నకి సమాధానంగా తెలిపారు మంచు విష్ణు. 

ఈ సినిమా ఇంత బాగా రావడానికి, అంత బాగా చేయడానికి కారణం దర్శకుడే అని, ఈ సక్సెస్‌ క్రెడిట్‌ ఆయనదే అన్నారు మంచు విష్ణు. ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories