ఇక `బౌ బుట్టు భూత` సినిమా కథ విషయానికి వస్తే ఒరిస్సాలోని ఒక విలేజ్‌లో తల్లితోపాటు కొడుకు(బాబూషాన్ మొహంతి) జీవిస్తుంటారు. వీరు చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తారు. తల్లి మంత్రగత్తె.
అక్కడే ఉంటే తమ బతుకులు మారవు, మనం ఎదగలేమని భావించిన కొడుకు వేరే ప్రాంతానికి వలస వెళ్లాలని ప్రయత్నిస్తాడు. ఈక్రమంలో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. ఏకంగా దెయ్యం అతన్ని వెంటాడుతుంది. ఊరి దాటి వెళ్లనివ్వదు.
మరి ఆ దెయ్యం ఎవరు? దాని కథేంటి? దాన్ని దాటుకుని కొడుకు తన లక్ష్యం దిశగా వెళ్లాడా? ఆ ఊర్లో ఏం జరిగిందనేది ఈ మూవీ కథ. ఆద్యంతం హర్రర్ ప్రధానంగా సాగుతుంది.
కామెడీ ఎలిమెంట్లు, హర్రర్ అంశాల మేళవింపుగా సాగే ఈ మూవీ ఒరియా ఆడియెన్స్ ని ఆద్యంతం కట్టిపడేస్తుంది. దీంతో వారు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ కలెక్షన్ల పరంపర ఇంకా సాగుతూనే ఉంది. ఎక్కడ ఆగుతుందో చూడాలి.