Karthika Deepam 2 Today Episode: జ్యోకు దాసు వార్నింగ్- దీనస్థితిలో కాశీ- కార్తీక్‌తో చేతులు కలిపిన పారు

Published : Jan 29, 2026, 08:33 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 29వ తేదీ)లో కార్తీక్ కి దొరికిపోయాం అన్న పారు. జ్యోకు వార్నింగ్ ఇచ్చిన దాసు. దీప శాంపిల్స్ తీసుకోవడానికి ఒప్పుకున్న డాక్టర్. కాశీని చూసి బాధపడ్డ కాంచన. కన్నీళ్లు పెట్టుకున్న కాశీ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

PREV
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో మనం ఆల్రెడీ కార్తీక్ గాడికి దొరికిపోయాం అంటుంది పారు. నీ రిపోర్ట్స్ ఎప్పుడైతే మ్యాచ్ కాలేదో అప్పుడే సగం దొరికిపోయాం. దశరథ ముఖం చూస్తే ఏదో అనుమానం వచ్చినట్లే ఉంది, శ్రీధర్ ముఖం చూసినా అలాగే ఉంది అని అంటుంది పారు. మన లోపల భయం ఉంటే ఎవరి ముఖం చూసినా అలాగే ఉంటుంది అంటుంది జ్యోత్స్న. ఈ టెన్షన్లతో నేను ఎప్పుడుపోతానో కూడా అర్థం కావడం లేదు అంటుంది పారు. నన్ను యువరాణిలా చూడకుండానే పోతావా అంటుంది జ్యోత్స్న. ఆ ఆశే నన్ను బ్రతికిస్తోంది అంటుంది పారు. మరి నాకు సపోర్ట్ చెయ్ గ్రానీ అంటుంది జ్యోత్స్న. ఏంటి సపోర్ట్ చేసేది అని తన స్టైల్లో పిచ్చి తిట్లు తిడుతుంది పారు. మీ నాన్న ఉన్నా ఏదో ఒకటి చేసేదాన్ని. ముందు దాసు ఎక్కుడున్నాడో తెలుసుకోవాలి అంటుంది. 

27
జ్యోకు దాసు వార్నింగ్

ఇంతలో జ్యోకు దాసు దగ్గరినుంచి ఫోన్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అనగానే రా.. కాదు నాన్న అను అంటాడు దాసు. నీ చెంచాగాళ్లు మాట్లాడుకుంటుంటే తెలిసింది ప్లాన్ ఫెయిల్ అయిందట కదా అంటాడు దాసు. ఎన్ని చేసినా నీ బుద్ధి మాత్రం మారడం లేదు. దీప మహర్జాతకురాలు. ఇప్పటికే మూడు సార్లు చావు నుంచి తప్పించుకుంది. తనను కాపాడడానికి నా అల్లుడు కార్తీక్ ఉన్నాడు. నీకే ఎవ్వరూ లేరు. ఇప్పుడు నీ వంతు. ఇక నువ్వు తప్పించుకోలేవు. నిజం ఒప్పుకొని తప్పుకోవడం తప్ప నీకు వేరే దారి లేదు అంటాడు దాసు. ఆ మాటలకు భయపడి కాల్ కట్ చేస్తుంది జ్యోత్స్న.

37
టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న డాక్టర్

మరోవైపు కార్తీక్, దీప, డాక్టర్ మాట్లాడుకుంటూ ఉంటారు. కన్నకూతురు జ్యోత్స్న శాంపిల్సే మ్యాచ్ కాలేదు. ఇంటితో ఏ సంబంధం లేని దీప శాంపిల్స్ ఎలా మ్యాచ్ అవుతాయి కార్తీక్ అని అడుగుతుంది డాక్టర్. మీరు ఏ ప్రశ్నలు అడగకుండా తీసుకోండి. రిపోర్ట్సే మీకు సమాధానం చెప్తాయి అంటాడు కార్తీక్. సుమిత్రమ్మను ఎలాగైనా కాపాడుకోవాలి అని ఏడుస్తుంది దీప. జ్యోత్స్న సొంత కూతురు అయినా బ్లెడ్ శాంపిల్స్ ఇవ్వడానికి భయపడింది. నీకు ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేకపోయినా సుమిత్రను కాపాడాలని నువ్వు తాపత్రాయ పడుతున్నావు. శాంపిల్స్ మ్యాచ్ కావని నాకు తెలుసు. అయినా సరే మీకోసం టెస్టు చేస్తాను అంటుంది డాక్టర్.

47
దీప ఏం పాపం చేసింది?

గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటుంది కాంచన. మా వదినకు ఒక రకమైన కష్టం వస్తే, నా కోడలికి మరొక రకమైన కష్టం వచ్చింది. అసలు దీప ఏం తప్పు చేసింది. ఏం పాపం చేసిందని తన ప్రాణాలు తీయాలని అనుకుంటున్నారు. నా కోడల్ని నువ్వే కాపాడాలి దేవుడా అని మొక్కుకొని బయటకు వస్తుంది కాంచన. అక్కడే పక్కన దీనంగా కూర్చొని ఉన్న కాశీని చూస్తుంది.

57
కన్నీళ్లు పెట్టుకున్న కాశీ

కాశీ అవతారం చూసి, ఇలా అయిపోయావ్ ఏంట్రా? అని బాధపడుతుంది కాంచన. నీ గురించి అడిగితే కోపంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయావని చెప్పారు. నువ్వు వైజాగ్ వెళ్లావేమో అనుకున్నాను, నువ్వు ఇక్కడే తిరుగుతున్నావా అంటుంది కాంచన. నాకు ఇంకా వేరే ఎవరున్నారు అత్తా వెళ్లడానికి.. ఇక్కడే ఉన్నాను అంటాడు కాశీ. అయితే ఇంటికి రావచ్చు కదరా అంటుంది కాంచన. ఏ ముఖం పెట్టుకొని మీ దగ్గరకు రావాలి. మామను, బావను, ఆఖరికి నా భార్యను కూడా మోసం చేశా. అందరూ నన్ను వదిలేశారు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు కాశీ. నువ్వు అలా మాట్లాడకురా అని బాధపడుతుంది కాంచన. స్వప్నను నన్ను కలుపు అత్తా.. తను లేకుండా నేను ఉండలేను. తను నా మాట వినట్లేదు, నమ్మట్లేదు అని ఫీల్ అవుతాడు కాశీ. మనం ముందు ఇంటికి వెళ్దాం పదా అని కాశీని తీసుకొని వెళ్తుంది కాంచన.

67
నువ్వు అసలు నిజంగా తల్లివేనా?

మరోవైపు హాల్లో తిరుగుతూ ఉంటుంది పారు. ఇంతలో కార్తీక్ వస్తాడు. దీపను రెగ్యులర్ చెకప్ కి తీసుకెళ్లావు కదా ఏమైంది అని అడుగుతుంది పారు. తాత, మామయ్య ఎక్కడున్నారు అని అడుగుతాడు కార్తీక్. పని ఉందని బయటకు వెళ్లారు అంటుంది పారు. మరి చిన్నమరదలు, అత్త అని అడుగుతాడు. ఎవరి గదిలో వారున్నారు అని చెప్తుంది పారు. అయితే నువ్వు ఖాళీగా ఉన్నావన్నమాట అంటాడు కార్తీక్. నేను ఖాళీగానే ఉన్నా కానీ బుర్రలో వంద ఆలోచనలు ఉన్నాయి అంటుంది పారు.

నేను మా తాత వయసులో ఉంటే నిన్ను ఎలా తిట్టేవాడినో తెలిసా అని పారును కొన్ని మాటలంటాడు కార్తీక్. ఎందుకురా అలా అంటున్నావు. నేనేం తప్పు చేశా అంటుంది పారు. నువ్వు అసలు నిజమైన తల్లివేనా? కొడుకు కనిపించకుండా పోతే కొంచెం కూడా బాధలేదా? నీ కొడుకు తాయత్తు గార్డెన్ లో కనిపించింది. నీకేమో తను వాకిట్లో కనిపించాడు. నీకే కాదు ఆ రోజు నాకు కూడా దాసు మామయ్య కనిపించాడు అని చెప్తాడు కార్తీక్. షాక్ అవుతుంది పారు. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదురా అంటుంది. ఎవరు నమ్మరు అని చెప్పలేదు అంటాడు కార్తీక్. 

77
కార్తీక్ చేతులు కలిపిన పారు

ఈ విషయంలో నీకు ఎవరిపైనా అనుమానం లేదా అంటాడు కార్తీక్. లేదు అంటుంది పారు. నాకైతే ఒకరిపై ఉంది అంటాడు కార్తీక్. ఎవరిపై అనగానే జ్యోత్స్నపై అని చెప్తాడు. దాసు మామయ్య కనిపించకుండా పోవడానికి జ్యోత్స్నకు ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తోంది అంటాడు కార్తీక్. ఈ ఒక్కసారికి నిన్ను నమ్మాలి అనిపిస్తోంది అంటుంది పారు. అయితే నీ మనుమరాలి దగ్గరకు వెళ్లి నేను చెప్పినట్లు చెప్పు అని పారు చెవిలో ఏదో చెప్తాడు కార్తీక్. సరే అని చెప్పి జ్యోత్స్న దగ్గరకు వెళ్తుంది పారు. దాసు మాటలను గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. పారు వచ్చి జ్యోత్స్న అని పిలుస్తుంది. చెప్పు గ్రానీ అంటుంది జ్యోత్స్న. మనం పోలీస్ స్టేషన్ కు వెళ్దాలి అంటుంది పారు. షాకై లేచి నిలుచుంటుంది జ్యోత్స్న. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories