Gunde Ninda Gudi Gantalu: ప్రభావతి నడుము విరగ్గొట్టిన మీనా, మనోజ్ నోరు మూయించిన శ్రుతి

Published : Jan 28, 2026, 09:11 AM IST

 Gunde Ninda Gudi Gantalu: దెయ్యం పేరుతో శ్రుతి.. ప్రభావతికి చుక్కలు చూపిస్తుంది. విపరీతంగా భయపడిన ప్రభావతి రోహిణీతో కలిసి కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. శ్రుతి, మీనాలను విడదీయాలని అనుకుంటుంది.నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీ కోసం... 

PREV
15
Gunde Ninda Gudi Gantalu

శ్రుతి దెయ్యం ఆటకు ప్రభావతి, మనోజ్ వణికిపోతారు. ఇద్దరూ కలిసి.. శ్రుతి, మీనాలను తిడతారు. ప్రభావతి మాత్రం.. ఇదంతా మీనానే కావాలని చేసిందని ప్రభావతి ఆడిపోసుకుంటుంది. అప్పుడు..శ్రుతి.. ఇదంతా తన ప్లానే అని చెబుతుంది. దీంతో.. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ఆటలు ఆడొద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ‘ చూశావుగా.. ఈ ఇంట్లో ఏం జరిగినా అత్తయ్య నన్నే తిడతారు. ముందు నన్ను తిట్టి.. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటారు’ అని మీనా ఫీల్ అవుతుంది. ‘ ఏం కాదులే మీనా.. ఆంటీ ఇంకోసారి మనతో పెట్టుకోరు’ అని శ్రుతి అంటుంది. ‘ నేను వద్దు అంటూనే ఉన్నాను.. నువ్వే వినలేదు’ అని మీనా ఫీలౌతుంది. దీంతో.. తన వల్లే అని.. శ్రుతి సారీ చెబుతుంది. ఇద్దరూ కలిసి నవ్వుకుంటారు.

25
రవి- శ్రుతి మధ్యలో అమ్మ...

మరుసటి రోజు ఉదయాన్నే మీనా ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటే.. బాలు వచ్చి..వాళ్ల నాన్న ఎక్కడికి వెళ్లాడు అని అడుగుతాడు. మీనా సమాధానం చెబుతుంది. అయితే.. నిద్రలేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల బాలు కళ్లు అలసిపోయాయి అని మీనా బాధపడుతుంది. నైట్ ట్రిప్ లు చేయకండి అని మీనా అడిగితే.. ‘ ఎలా కుదురుతుంది..? పగలు మాత్రమే కారు నడిపితే.. డబ్బు సరిపోదు కదా.. మనం రూమ్ కట్టాలి కదా.. ఇప్పటికీ ఈ ఇంట్లో మా నాన్న తప్ప అందరూ రూమ్ గురించి అడుగుతున్నారు.. మా అమ్మ అయితే వెటకారంగా మాట్లాడుతుంది’ అని బాలు అంటాడు. ‘ఒకటి కావాలంటే.. మరొకటి త్యాగం చేయాల్సిందేగా’ అని మీనా అంటే.. ‘ తప్పదు కదా మరి’ అంటాడు. మీనా కళ్లు కూడా అలసిపోయి ఉన్నాయి ఏంటి అని బాలు అడగగా.. రాత్రి శ్రుతి చేసిన పని మొత్తం చెబుతుంది.

మరోవైపు రవి బయటకు వెళ్లడానికి రెడీ అవుతుంటే.. శ్రుతి వచ్చి కొత్త షర్ట్ గిఫ్ట్ గా ఇస్తుంది. అయితే... తనకు సేమ్ అలాంటి షర్ట్ ఉందని రవి అనడంతో... శ్రుతి హర్ట్ అవుతుంది. పనిలో పనిగా.. ప్రభావతిని కూడా లాగి.. రవితో కలిపి తిడుతుంది. శ్రుతి.. రవి వాళ్ల అమ్మని తప్పు పడితే.. రవి.. శ్రుతి వాళ్ల అమ్మని తప్పు పడతాడు. ఇద్దరూ ఇదే విషయంలో చాలా సేపు వాదించుకుంటారు.ఆవేశంగా బయటకు వెళ్లిన శ్రుతి.. మీనా తీసుకువచ్చిన నూనె పడేస్తుంది.

35
విరిగిన ప్రభావతి నడుము..

బాలుకి డ్రైవింగ్ చేసి ఒళ్లు నొప్పులతో బాధపడుతూ ఉంటే.. ఆ నూనెను వేడి చేసి మసాజ్ చేద్దాం అని తీసుకు వెళ్తుంటే.. శ్రుతి పడేస్తుంది. మీనా కి మళ్లీ కొత్త పని పెట్టినందుకు శ్రుతి సారీ చెబుతుంది. ఆ నూనెను మీనా తుడవబోతుంటే.. దానిమీద ప్రభావతి కాలు వేసి.. పనిలో పనిగా మీనాని కూడా కింద పడేస్తుంది. ఆ అరుపు విని.. ఇంట్లో అందరూ బయటకు వస్తారు. కిందపడిన ప్రభావతిని బాలు లేపడానికి చెయ్యి ఇస్తే.. కనీసం తీసుకోదు. పైగా మీనాని తిట్టడం మొదలుపెడుతుంది. ‘ ఇది నన్ను చంపడానికి ప్లాన్ వేసింది’ అని ప్రభావతి అంటే.. ‘ దానికి ఇంత కాలం ఎందుకు ఆగుతుంది? వెర్రిదా?’ అని బాలు అడగడం ఫన్నీగా ఉంటుంది. ‘ ఏం జరిగింది అత్తయ్య?’ అని రోహిణీ అడిగితే...‘ నేను కిందపడి తల పగిలిపోయి చచ్చిపోవాలని ప్లాన్ వేసింది’ అని ప్రభావతి అంటుంది. ‘ అంత పొడుగు ప్లాన్ వేసిందా? నోటికి ఏమీ కాలేదా?’ అని బాలు అడిగుతాడు. ‘ మీరు ఏం మాట్లాడుతున్నారో.. మీకు అయినా అర్థం అవుతుందా? నేను ఎందుకు మిమ్మల్ని చంపాలని అనుకుంటాను.. రాను రాను మీ నోటికి అద్దు అదుపు లేకుండా పోతోంది?’ అని మీనా ప్రశ్నిస్తుంది.‘ టీ వడపోసే ఫిల్టర్ లాగా.. మా అమ్మ నోటికి కూడా ఒక ఫిల్టర్ పెట్టాలి’ అని బాలు అంటాడు. ‘ నేను కింద పడాలని కాకపోతే.. నేల మీద నూనె ఎందుకు పోసిందిరా? ఎన్ని రోజుల నుంచి నా చావు గురించి ఎదురుచూస్తుంది’ అని ప్రభావతి అడుగుతుంది. దీంతో.. జరిగిన విషయాన్ని శ్రుతి చెబుతుంది. ‘ ఆయిల్ పడితే వెంటనే తుడవాలి కదా’ అని రోహిణీ అంటే.. ‘ అసలు ఇది అటెంటూ మర్డర్ కిందకు వస్తుందమ్మా..’ అని మనోజ్ ఏదో మాట్లాడుతుంటే.. బాలు సీరియస్ అవుతాడు. మనోజ్ గతంలో చేసిన తప్పులన్నీ మాట్లాడటంతో.. నోరు మూస్తాడు.

45
మీనా జోలికి వస్తే ఊరుకోను.. శ్రుతి వార్నింగ్..

‘ అసలు ఏం జరిగిందో శ్రుతి చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కావడం లేదా?.. ఇదేదో ఇంటర్నేషనల్ క్రైమ్ లాగా మాట్లాడుతున్నావ్’ అని రవి.. మనోజ్ ని తిడతాడు. అయితే.. తనను కనీసం కింద పడితే ఎవరూ లేపలేదు అని ప్రభావతి ఫీలౌతుంటే.. బాహుబలి లాంటి నేను ఉన్నాను అని మనోజ్ ఫోజులు కొడతాడు. ప్రభావతిని లేపబోయి.. మనోజ్ కూడా కింద పడిపోతాడు.దీంతో.. బాలు.. బాహుబలి పాటను పేరడీ చేసి పాడతాడు. అందరూ నవ్వేస్తారు. తర్వాత అందరూ కలిసి ప్రభావతిని పైకి లేపి కుర్చీలో కూర్చోపెడతారు. మనోజ్ ని రోహిణీ లేపుతుంది.

తర్వాత.. కింద పడినందుకు ఒళ్లు నొప్పులతో మనోజ్, ప్రభావతి తిప్పలు పడుతూ ఉంటారు. రోహిణీ వచ్చి.. ఆ నొప్పులకు మందు రాస్తుంది. ఆ మీనా కావాలనే నన్ను కింద పడేసింది అని ప్రభావతి అంటే.. ‘ అవును.. మీనా ఈ మధ్య బాగా మారిపోయింది. మాటకు మాట సమాధానం చెబుతోంది’ అని రోహిణీ అంటుంది. ‘ నన్ను ఏదో ఒక రోజు ఆ మీనా చంపేస్తుంది’ అని ప్రభావతి అంటుంటే.. ఆ మాటలు శ్రుతి వింటుంది. వెంటనే కోపంతో ఊగిపోతుంది. ‘ ఏమన్నారు.. మీనా మిమ్మల్ని చంపడానికి ప్లాన్ వేసిందా? డైలీ సీరియల్ స్టోరీ రాసేది నేను... కానీ కథలు మీరు బాగా అల్లుతున్నారు’ అని శ్రుతి అంటుంది. ‘ నీకు ఏం తెలుసమ్మా.. దాని గురించి’ అని ప్రభావతి అంటే.. ‘ ఆయిల్ కింద పడటానికి కారణం నేను అని నాకు తెలుసు.. మీకు తెలుసు.. నేనే చెప్పాను. అయినా కూడా మీరు మీనాదే తప్పు అంటున్నారు.. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏదో ఒక నింద వేసి మీనాని ఏదో ఒకటి అంటూనే ఉండాలా?’ అని శ్రుతి చాలా సీరియస్ గా ప్రశ్నిస్తుంది.

‘ నువ్వు ఎందుకు వాయిస్ పెంచుతున్నావ్?’ అని రోహిణీ అడిగితే.. ‘ మీరంతా ఈవిడకు భజన చేస్తున్నారు?’ అని శ్రుతి రివర్స్ లో రోహిణీని అడుగుతుంది. ‘ పెద్దా, చిన్నా తేడా లేకుండా మాట్లాడుతున్నావ్? నువ్వు ఎందుకు ఆ పూలు అమ్ముకునే దానికి సపోర్ట్ చేస్తున్నావ్?’ అని ప్రభావతి అడుగుతుంది. ‘ మొదటి నుంచీ శ్రుతి మీనా కే సపోర్ట్ చేస్తుంది’ అని మనోజ్ అంటాడు.‘ మీరు ఆగండి.. ఇది ఆడవాళ్ల విషయం.. మీరు తలదూర్చకండి’ అని మనోజ్ నోరు మూయించిన శ్రుతి..‘ మీరు ఏం చేస్తున్నారు.. మీనాని ఏదో ఒకటి అనడానికి సాకు ఎప్పుడు దొరుకుతుందా? అని ఎదురు చూస్తారు. సాకు దొరక్కపోతే క్రియేట్ చేసుకుంటారు.. మీనా ఆయిల్ పడేసిందే అనుకుందాం.. మీ కళ్లు ఎక్కడ పెట్టుకొని వచ్చారు? ఇక నుంచి మీనా జోలికి వచ్చే ముందు ఆలోచించుకోని రండి’ అని శ్రుతి వార్నింగ్ ఇస్తుంది.

55
మీనాకి వ్యతిరేకంగా ప్రభావతి కుట్ర..

‘ ఇదేంటి? శ్రుతి మీనాకి ఇంత సపోర్ట్ చేస్తుంది..’ అని రోహిణీ అంటే.. ‘ ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నారు అనుకుంట. నిన్న కూడా ఇద్దరూ కలిసి అమ్మను దెయ్యం పేరుతో భయపెట్టారు’ అని మనోజ్ అంటాడు. ‘ దీనికి పరిష్కారం నేను చెబుతాను.. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు’ అని ప్రభావతి అంటుంది. ఇక మీనా.. కింద పడిన ప్రభావతికి దెబ్బలు తగిలాయి అని... నాటు వైద్యం చెప్పమని.. తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేస్తుంది.వాళ్లు సలహా ఇస్తారు. వాళ్లు చెప్పినట్లే మీనా చేస్తుంటే.. బాలు వచ్చి ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. అత్తయ్యకు కాపుడం పెడుతున్నాను అని మీనా చెబుతుంది. అయితే.. నువ్వు ఎన్ని సేవలు చేసినా.. మా అమ్మ ఊరుకోదు అని.. బాలు అంటాడు. ప్రభావతి ఏం చేస్తుందో.. లైవ్ లో యాక్ట్ చేసి మరీ చూపిస్తాడు. అయినా.. మీనా ఆగదు. అత్తకు సేవ చేయడానికే వెళ్తుంది. ప్రభావతి మాత్రం... ఇంట్లో అందరూ మీనాకి సపోర్ట్ చేస్తున్నారని.. శ్రుతి మాటలకు ఒళ్లు మండిపోతుందని.. ఎలాగైనా మీనా , శ్రుతి లను విడదీయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories