
కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో రౌడీలు పారిపోవడంతో తిరిగి ఇంటికి వస్తాడు కార్తీక్. దొరికారా బావ అని అడుగుతుంది దీప. తప్పించుకున్నారు అంటాడు కార్తీక్. ఇంతకుముందు దీపను చంపాలని చూసినవాళ్లే మళ్లీ వచ్చి ఉంటారా? జైల్లో ఉన్నవాడే ఇదంతా చేస్తున్నాడా.. అని కంగారు పడుతుంది కాంచన. ఇది నరసింహ పని కాదమ్మా అని కార్తీక్ అంటుండగా శౌర్య వస్తుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం ఇంట్లోకి పదండి అంటాడు కార్తీక్.
మన ఇంట్లోకి వచ్చి మరీ నిన్ను చంపాలి అనుకున్నారంటే, అవతలి వాళ్లకు నువ్వంటే తీరని పగైనా ఉండాలి లేదా నువ్వు దేనికైనా అడ్డుగానైనా ఉండాలి అని దీపతో అంటుంది కాంచన. అలాంటి వాళ్లు ఒక్కరే ఉన్నారు. జ్యోత్స్నే ఈ పని చేసి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది దీప.
మరోవైపు జ్యోత్స్నకు రౌడీ కాల్ చేస్తాడు. దాని పని అయిపోయింది అని చెప్పరా అంటుంది జ్యోత్స్న. లేదు మేడం జస్ట్ లో మిస్ అయిందని చెప్తాడు. మళ్లీ తప్పించుకుందా.. ఛా.. అంటుంది జ్యోత్స్న. అవును మేడం వాళ్లు నిద్రలేచారు. పట్టుకోబోతే పారిపోయి వచ్చేశాం అని చెప్తాడు రౌడీ. సరే మీరు డెన్ కి వెళ్లండి అని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే దశరథ కనిపిస్తాడు. షాక్ అవుతుంది జ్యోత్స్న. నేను మాట్లాడింది విన్నాడా అని డౌట్ పడుతుంది.
ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు? మళ్లీ తప్పించుకుంది ఎవరు జ్యోత్స్న అని అడుగుతాడు దశరథ. కెనడాలో నా ఫ్రెండ్ ఉందని చెప్పానుగా తనే ఫోన్ చేసింది. మమ్మీ ట్రీట్ మెంట్ కోసం మంచి డాక్టర్ ని కలవమని చెప్పాను. అది మిస్ అయిందని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్న. నువ్వు ఇంత రాత్రిపూట మీ అమ్మకోసం ఆలోచిస్తున్నావు అంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది జ్యోత్స్న. నీ ఆరోగ్యం కూడా ముఖ్యం కదా.. వెళ్లి పడుకో అని చెప్పి వెళ్లిపోతాడు దశరథ. దీప చచ్చుంటే ముందు ఆ దాసుగాడికి బుద్ధి వచ్చేది. మా మమ్మీ బతకడానికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి సమస్య ఇక్కడితో ముగిసిపోయేది అనుకుంటుంది జ్యోత్స్న.
శౌర్యకు జడవేస్తూ ఉంటుంది కాంచన. ఇంతలో కాంచనకు శ్రీధర్ ఫోన్ చేస్తాడు. దీపను ఎవరో చంపాలనుకున్నారని శ్రీధర్ తో చెప్తుంది కాంచన. షాక్ అవుతాడు శ్రీధర్. అక్కడ ఉండొద్దని చెప్తే వినరు. గతంలో కూడా ఇలాగే జరిగింది అంటాడు శ్రీధర్. భర్త మాట్లాడుతుంటేనే ఫోన్ కట్ చేస్తుంది కాంచన. కడుపుతో ఉన్న మనిషిని చంపాలని ఎవరు అనుకుంటారని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీధర్.
దీప, కార్తీక్ శివన్నారాయణ ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతారు. దీపను ఇంట్లోనే ఉండమంటుంది కాంచన. దీపకు ఏం కాదు, నేను చూసుకుంటానమ్మా అని ధైర్యం చెప్తాడు కార్తీక్. శౌర్య స్కూల్ బస్ రాలేదు. తనని స్కూల్లో డ్రాప్ చేసి అట్నుంచి అటు తాత ఇంటికి వెళ్తామని చెప్తాడు కార్తీక్.
మరోవైపు శివన్నారాయణ ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్తాడు శ్రీధర్. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లయింట్ ఇవ్వకుండా దీపను ఎవరో చంపాలి అనుకున్నారని మాకు వచ్చి చెప్తావేంటీ శ్రీధర్ అంటాడు శివన్నారాయణ. దశరథ నువ్వు వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేసి మాట్లాడు అంటాడు శివన్నారాయణ. అవసరం లేదు అనుకుంటూ ఎంట్రీ ఇస్తాడు కార్తీక్. అసలు చంపడానికే వచ్చాడని మీరు ఎలా చెప్తారు అంటుంది పారిజాతం. జ్యోత్స్నను కోపంగా చూస్తాడు కార్తీక్. వీడు జ్యోత్స్నను చూస్తున్నాడంటే ఆ పని జ్యోత్స్నే చేసిందా? అందుకే రాత్రి ఫోన్ లో అలా మాట్లాడిందా అని అనుమానపడతాడు దశరథ.
కార్తీక్ ని పిలిచి నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? అని అడుగుతాడు శివన్నారాయణ. వాళ్లెవరో, ఎందుకు ఇదంతా చేస్తున్నారో తెలిసింది అంటాడు కార్తీక్. ఎవరు అని అడిగితే జ్యోత్స్న అంటాడు కార్తీక్. అంతా షాక్ అవుతారు. భయంతో వణికిపోతుంది జ్యో. ఎవరో చెప్పమంటే జ్యోత్స్న పేరు చెప్తావెంట్రా అని అడుగుతుంది పారు. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలుసని చెప్పడానికి పిలిచాను అంటాడు కార్తీక్. ఎవరిని వదలి పెట్టను, త్వరలోనే ఊచలు లెక్కపెట్టేలా చేస్తాను అంటాడు కార్తీక్. కథంతా దాసు, జ్యోత్స్న, దీప చుట్టూనే తిరుగుతోంది. వీరి మధ్య ఏదో సంబంధం ఉంది. కచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటాడు దశరథ.
తాత నిన్ను ఒకటి అడుగుతా నీ సమాధానమే దీనికి పరిష్కారం కావచ్చు అంటాడు కార్తీక్. నీకు ఎవరి సీక్రెట్స్ అయినా తెలిస్తే వాళ్లు ఏం చేస్తారు అంటాడు కార్తీక్. అడ్డు తొలగించుకోవాలి అనుకుంటారు అంటాడు శివన్నారాయణ. నాకు, దీపకు కూడా కొంతమంది వ్యాపారానికి సంబంధించిన రహస్యాలు తెలిశాయి. అందుకే చంపాలనుకుంటున్నారు. కానీ వాళ్ల తప్పులు బయటపడే రోజు దగ్గర్లోనే ఉంది అంటాడు కార్తీక్. ఇదంతా వైరా చేశాడేమోనని అనుకుంటారు శ్రీధర్, శివన్నారాయణ. సరే తాత మేము హాస్పిటల్ కి వెళ్తాం. దీపకు చెకప్ చేయించాలి అని చెప్తాడు కార్తీక్.
బయటకు వచ్చి ఇప్పుడు హాస్పిటల్ కి ఎందుకు దీప అని అడుగుతాడు కార్తీక్. నా తల్లిని నేనే కాపాడుకోవాలి. ఇంకా నేను టైం వేస్ట్ చేయను. పదా వెళ్దాం అంటుంది దీప. డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటారు. నేను చాలా కేసులు చూశాను కానీ... కన్నతల్లికి కన్నకూతురు శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా అంటుంది డాక్టర్. ఇక్కడ ఎవ్వరికీ తెలియని నిజం ఏంటంటే జ్యోత్స్న సుమిత్ర కూతురు కానే కాదు. ఇదే విషయాన్ని నేను అక్కడ చాలా సాఫ్ట్ గా చెప్పాను అంటుంది డాక్టర్.
జ్యోత్స్న కాకుండా బ్లెడ్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే మీరు మా అత్తను సేవ్ చేయగలరా అని అడుగుతాడు కార్తీక్. లేరని చెప్పారు కదా అంటుంది డాక్టర్. ఉంది దీపే మా అత్తను కాపాడగలదు అని చెప్తాడు కార్తీక్. ఎలా అంటుంది డాక్టర్.
మరోవైపు దీపను ఎందుకు చంపాలనుకున్నావే అని జ్యోత్స్నను అడుగుతుంది పారిజాతం. నేను ఎందుకు అనుకుంటాను అంటుంది జ్యోత్స్న. అది చేసింది నువ్వే అని నాకు తెలుసు. ఫస్ట్ ఎలా ప్లాన్ చేశావో, ఇప్పుడు కూడా అలాగే ప్లాన్ చేశావ్ అంటుంది పారు. కార్తీక్ గాడు నిజాలు తెలిసినట్లే మాట్లాడుతున్నాడు. ఏదో జరగబోతుంది అంటుంది పారు. ఏం కాదు. బావ అలా ఊరికే అంటున్నాడు. మనం కంగారుపడితే దొరికిపోతాం అంటుంది జ్యోత్స్న. దొరికిపోవడం కాదు.. ఆల్రెడీ దొరికిపోయాము అంటుంది పారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.