
కార్తీక దీపం 2 సోమవారం ఎపిసోడ్ లో జ్యోత్స్న గదిలో వాయిస్ రికార్డర్ ఆన్ చేసిన ఫోన్ ను చాటుగా పెడ్తుంది దీప. జ్యో పరిగెత్తుకుంటూ గదిలోకి వచ్చేసరికి తనకు కనపడకుండా బయటకు వెళ్లిపోతుంది దీప. అదేంటి.. గ్రానీ, దీప నా గదిలోకే వెళ్లిందని చెప్పింది. కానీ ఇక్కడ దీప లేదే. బావ నిజం తెలిసినట్లే మాట్లాడాడు. అంటే వైరా దొరికిపోయాడా? ఏదో జరుగుతోంది అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
ఒకసారి వైరాతో మాట్లాడాలి అనుకొని కాల్ చేస్తుంది. ఇంతలో తనకు దీప పెట్టిన ఫోన్ కనిపిస్తుంది. వెంటనే వైరా కాల్ కట్ చేస్తుంది. ఇది బావ ఫోనే. దీపతో బావే ఈ పని చేయించి ఉంటాడు. నీకు ఒక్కనికే తెలివితేటలు లేవు బావ. ఇప్పుడు చూడు ఈ సమస్య నుంచి నేను ఎలా తప్పించుకుంటానో అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
ఇంతలో వైరా జ్యోత్స్నకు ఫోన్ చేస్తాడు. ఏంటి జ్యోత్స్న గారు ఫోన్ చేసి కట్ చేశారు అంటాడు. జ్యోత్స్న వైరా ఎవ్వరో తెలియనట్లే మాట్లాడుతుంది. కంపెనీ జోలికి వస్తే ఊరుకోను అని హెచ్చరిస్తుంది. ఈ కంపెనీ నాది. నిన్ను అడుగు కూడా పెట్టనివ్వను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తుంది జ్యోత్స్న.
అయోమయంలో పడ్తాడు వైరా. ఇక నేను సేఫ్ అనుకుంటుంది జ్యోత్స్న. ఏంటి బాస్.. ఇలా జరిగింది అంటాడు వైరా అసిస్టెంట్. జ్యోత్స్న నన్ను ఇరికించి తాను తప్పించుకోవాలి అనుకుంటోంది. కానీ.. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తనకు తెలియదు. చూపిస్తా. నువ్వు కంగారుపడకు అంటాడు వైరా.
మరోవైపు జ్యోత్స్న గదిలో పెట్టిన మొబైల్ ని తీసుకొని దీప బయటకు వస్తుంటే.. జ్యోత్స్న ఎదురవుతుంది. ఈ టైంలో నా గదిలో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటుంది దీప. నిజం దొరికిందా అంటుంది జ్యోత్స్న. దొరికిందనే అనుకుంటున్నాను అంటుంది దీప.
కడుపుతో ఉన్నావు జాగ్రత్త. ఇలాంటి పనులు చేయకు. చక్కగా తిని నీ పని నువ్వు చేసుకో అని ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. వలలో చిక్కుకున్న చేప కూడా.. వల నీటిలో ఉన్నంతవరకు నాకు ఏం కాలేదనే అనుకుంటుంది. వల బయటకు వస్తే కదా తనకు ఉచ్చు బిగుసుకుందని తెలిసేది. మీ పరిస్థితి కూడా అంతే అని వెళ్లిపోతుంది దీప.
మరోవైపు దీప, కార్తీక్ లు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం అనుకున్నది ఏంటి? జ్యోత్స్న మాట్లాడింది ఏంటి? అంటే జ్యోత్స్నకు ఈ కేసుకు సంబంధం లేదా అంటుంది దీప. లేదని చెప్పలేము. ఈ ఫోన్ తన గదిలో ఉందనే విషయం జ్యోత్స్నకు ముందే తెలిసింది. అందుకే మనకు కావాల్సిన మాటలే మాట్లాడింది అంటాడు కార్తీక్.
జ్యోత్స్న కాశీకి ఫోన్ చేస్తుందని అనుకున్నాను. కానీ వైరా జ్యోత్స్నకు ఫోన్ చేశాడు. ఏ కారణం లేకుండా వైరా తనకు ఫోన్ చేయడు. ఏదో ఉంది. కచ్చితంగా కనిపెడతాను. నేను ఒకరిని కలవడానికి బయటకు వెళ్లాలి. నువ్వు జాగ్రత్తగా ఉండూ అని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్.
కాశీని బయట కలుస్తాడు కార్తీక్. ఏదైనా మాట్లాడాలి అంటే ఇంటికే రావచ్చు కదా బావ అంటాడు కాశీ. మీరు చాలా పెద్దవాళ్లు కదా.. జాయినింగ్ బోనస్ కింద 5 లక్షల రూపాయలు తీసుకున్నారంటే మీరు ఎంత పెద్దవాళ్లో అర్థమవుతోంది అంటాడు కార్తీక్. ఇంతకీ 5 లక్షలు ఇచ్చింది ఎవరూ అని అడుగుతాడు కార్తీక్. సైలెంట్ గా ఉంటాడు కాశీ.
అవి ఇచ్చింది వైరా కదా అంటాడు కార్తీక్. వైరా ఎవరు అని అడుగుతాడు కాశీ. వైరా ఎవరో తెలియదా అని కాశీ చెంప పగలగొడతాడు కార్తీక్. వైరా మా తాతకు శత్రువు. వాడి దగ్గరికి వెళ్లమని జ్యోత్స్న చెప్పిందా నీకు అని అడుగుతాడు కార్తీక్. అవును అంటాడు కాశీ. అందరూ కలిసి మా నాన్నను కావాలనే ఇరికించారు కదా... ఎందుకురా నీకు మా నాన్న అంటే అంత కోపం.. పదా ఆ వైరా దగ్గరికే వెళ్దాం.. అక్కడే తేల్చుకుందాం అంటూ కాశీని చొక్కా పట్టి లాక్కొని వెళ్తాడు కార్తీక్.
మరోవైపు సుమిత్ర గురించి ఆలోచిస్తూ బాధ పడుతుంటాడు దశరథ. దగ్గరికి వెళ్లి అమ్మగారి రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి అని అడుగుతుంది దీప. నేనే మర్చిపోయిన విషయాన్ని నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నావు. ఈ విషయం నీకు కార్తీక్ చెప్పాడా అని అడుగుతాడు దశరథ. లేదు మీరు బావతో చెప్పేటప్పుడు విన్నాను అంటుంది దీప. ఈ టైంలో నువ్వు ఇలాంటి టెన్షన్ లు పెట్టుకోవద్దు. నచ్చింది తిని జాగ్రత్తగా ఉండూ అని చెప్తాడు దశరథ. ఇంటి పనిమనిషి గురించే ఇంతలా ఆలోచించే మీరు.. ఇల్లాలి ఆరోగ్యం గురించి మర్చిపోయారు అంటే నేను ఎలా నమ్ముతాను అంటుంది దీప.
మీరు టెన్షన్ పడకండి. అమ్మకు ఏం కాదు నాన్న అని దశరథ చేయి పట్టుకుంటుంది దీప. ఎమోషనల్ అవుతాడు దశరథ. దీపలో జ్యోత్స్నను చూసుకొని మరింత బాధపడుతాడు. ఎందుకు చిన్నయ్య గారు బాధపడుతున్నారు అంటుంది దీప. పిల్లలు తల్లిదండ్రుల పక్కన నిలబడి ఇలా ధైర్యం చెప్తే చాలు. వాళ్లు ఎలాంటి పరిస్థితినైనా ఈజీగా దాటేస్తారు. నిన్ను చూస్తే.. నువ్వే నా కూతురు ఎందుకు కాలేదు అని బాధగా అనిపిస్తుంది అంటాడు దశరథ. నేనే మీ కూతురిని నాన్న కానీ.. చెప్పుకోలేను అని మనసులో బాధపడుతుంది దీప. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.