టాలీవుడ్ లో రీసెంట్ గా నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఎంత హాట్ టాపిక్ గా మారాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్లు దుస్తులు సరిగా వేసుకోవాలని, కుర్రవాళ్లను రెచ్చగొట్టకూడదని ఆయన అన్నారు. నిండుగా చీర కట్టుకుంటే ఎలాంటి ఇబ్బందిపడరు అని శివాజీ అన్నారు. రాజా సాబ్ మూవీ ఈవెంట్ తర్వాత.. హీరోయిన్ నిధి అగర్వాల్ ని పబ్లిక్ ఇబ్బంది పెట్టిన సందర్భంలో శివాజీ ఈ కామెంట్స్ చేశారు. ఆయన వాడిన కొన్ని పదాలు చాలా మంది స్త్రీల మనోభావాలను దెబ్బ తీశాయి. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది మహిళలు.. ఈ విషయంపై స్పందించారు. ముఖ్యంగా చిన్మయి, అనసూయ చాలా తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో... డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.