Karthika Deepam 2 Today Episode: నిజం తెలుసుకున్న కార్తీక్- జ్యో, కాశీలను జైలుకు పంపిస్తాడా?

Published : Dec 27, 2025, 08:21 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 27వ తేదీ)లో కల్తీ ఫుడ్ కేసులో శ్రీధర్ ని ఎవరు ఇరికించారో తెలుసుకున్న కార్తీక్. పారు ముందు నిజం ఒప్పుకున్న జ్యో. దోషులను అందరిముందు నిలబెడతానన్న కార్తీక్. వణికిపోయిన కాశీ, జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

PREV
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో నాన్న అరెస్టుకు, కాశీకి సంబంధం ఉన్నట్లు నాకు అనిపిస్తోంది అన్నయ్య అంటుంది స్పప్న. నువ్వెలా చెప్పగలవు స్వప్న అంటాడు కార్తీక్. తనకు వేరే కంపెనీలో జీఎం పోస్ట్ ఇచ్చారట. జాయినింగ్ బోనస్ కింద 5 లక్షల రూపాయలు ఇచ్చారట. జాయిన్ అయిన వెంటనే మరో 5 లక్షలు ఇస్తారట.. అని జరిగిన విషయాలు అన్నవదినలతో చెప్తుంది స్వప్న.

నాకు ఎందుకో కాశీ తప్పు చేస్తున్నట్లు అనిపిస్తోంది అన్నయ్య. నాన్న అరెస్ట్ వెనుక ఎవరు ఉన్నారో.. కాశీకి తెలుసు అని చెప్తుంది స్వప్న. సరే అవన్నీ మనం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ మనం ఇంటికి వెళ్దాం పదా అని తీసుకొని వెళ్తాడు కార్తీక్. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే కాశీకి, మామయ్య అరెస్టుకు ఏదో సంబంధం ఉందని మనసులో అనుకుంటుంది దీప.

27
వణికిపోయిన కాశీ

ఈ టైంలో స్వప్న ఎక్కడికి వెళ్లి ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాడు కాశీ. ఇంతలో కార్తీక్, స్వప్న ఇంట్లోకి వస్తారు. నాకు చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా స్వప్న. ఒంటరిగా ఎందుకు వెళ్లావ్ అని అడుగుతాడు కాశీ. నీకు కొత్త జాబ్ వచ్చిందట కదా.. అది చెప్పడానికే వచ్చింది. కాంగ్రాట్స్ కాశీ అంటాడు కార్తీక్. జాబ్ ఏ కంపెనీలో అని అడుగుతాడు. రెండు రోజుల తర్వాత చెప్తాను అంటాడు కాశీ.

నీకు జాబ్ వచ్చిన విషయం మా నాన్నకు తెలుసా అని అడుగుతాడు కార్తీక్. తెలియదు, మామయ్య జైల్లో ఉన్నాడు కదా అంటాడు కాశీ. నువ్వు ఆఫీసుకు వెళ్లేటప్పుడు సెండాఫ్ ఇవ్వడానికి వస్తాడులే కాశీ అంటాడు కార్తీక్. షాక్ అవుతాడు కాశీ. తనని ఈ కేసులో ఎవరు ఇరికించారో తెలిసిపోయింది అంటాడు కార్తీక్. ఎవరు కార్తీక్ అంటూ వాళ్ల దగ్గరికి వస్తుంది కావేరి. త్వరలోనే అంతా బయటపడుతుంది అంటాడు కార్తీక్. తప్పు చేసింది ఎవరైనా వదిలిపెట్టొద్దు అన్నయ్య అంటుంది స్వప్న. లోలోపల టెన్షన్ పడుతూ ఉంటాడు కాశీ. శ్రీధర్ అరెస్ట్ విషయంలో కాశీ హస్తం ఉందని కన్ఫర్మ్ చేసుకుంటాడు కార్తీక్.

37
మూడో వ్యక్తి ఎవరు?

కార్తీక్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది దీప. నువ్వు ఇంకా పడుకోలేదా అంటాడు కార్తీక్. స్వప్న మాటలు విన్న తర్వాత మామయ్య గారిని బయటకు తీసుకురావడానికి దారి దొరికినట్లు అనిపిస్తోంది అంటుంది దీప. కాశీకి తప్పులో భాగం ఉంది ఓకే కానీ.. మా నాన్న సీఈఓగా తప్పిస్తే ఎవరికి లాభం అంటాడు కార్తీక్. 

ఇంకెవరికి జ్యోత్స్నకు అంటుంది దీప. మరి కాశీకి జాబ్ ఇచ్చింది ఎవరు అంటాడు కార్తీక్. ఆలోచనల్లో పడుతుంది దీప. జ్యో, కాశీలతో పాటు మూడో వ్యక్తి ఎవరో ఉన్నారు. వాళ్లెవరో తెలుసుకోవాలి అంటాడు కార్తీక్. మా నాన్నను ఆ పరిస్థితిలో నిలబెట్టినవాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలి. కచ్చితంగా చెప్తాను అంటాడు కార్తీక్.

47
నిజం ఒప్పుకున్న జ్యోత్స్న

జ్యో దగ్గరికి వచ్చి నేను ఒకటి అడుగుతా నిజం చెప్పవే అంటుంది పారు. కార్తీక్ గాడు అంత గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే.. శ్రీధర్ అరెస్టుకు నీకు ఏదో సంబంధం ఉందని నా అనుమానం అంటుంది పారు. అవును నేనే ఇదంతా చేయించాను అంటుంది జ్యోత్స్న. కంగారు పడుతుంది పారు.

నువ్వేంటే రోజురోజుకు ఇంత క్రూరంగా మారిపోతున్నావు అంటుంది పారు. నన్ను అందరిముందు దోషిలా నిలబెట్టాలనుకున్న వ్యక్తిని నేననేందుకు వదిలిపెడతాను అంటుంది జ్యోత్స్న. ఈ తప్పులన్నీ కాశీతో చేయించావా? వాడి జీవితం నాశనం చేశావా? అని జ్యోపై ఫైర్ అవుతుంది పారు. ఇప్పుడే ఈ నిజాలన్నీ అందరితో చెప్తాను అంటుంది.

57
అన్నీ నా స్వార్థం కోసమే..

కాశీ నా తమ్ముడు వాడికి ఎలాంటి లైఫ్ ఇచ్చానో వాడి మాటల్లోనే విను అని కాశీకి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. కాశీ సంతోషంగా మాట్లాడటంతో.. పారు కాస్త శాంతిస్తుంది. ఒకవేళ నిజాలు బయటపడినా ఏ కేసు మా మీదకు రాకుండా సెట్ చేశాను. నేను తప్పు చేశాను అనడానికి ఉన్న ఆధారాలు కూడా నా అండర్ లోనే సేఫ్ గా ఉన్నాయని పారుతో చెప్తుంది జ్యోత్స్న. సంతోషంగా వెళ్లిపోతుంది పారు. నేను కాశీని నా అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నాను గ్రానీ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

67
కచ్చితంగా బుద్ధి చెప్తాను

మరుసటి రోజు ఉదయం బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు పారు, జ్యో. స్టేషన్ కి వెళ్లి మీ అల్లుడి గారిని చూసి రావాల్సింది.. అక్కడ ఎలాంటి మర్యాదలు జరుగుతున్నాయో అని అంటుంది జ్యోత్స్న. కార్తీక్ గాడు అక్కడే పడిగాపులు కాస్తున్నాడేమో అంటుంది పారు. స్టేషన్ దగ్గరే పడిగాపులు కాయడానికి మా నాన్న మర్డర్ చేయలేదు. చేయని తప్పుకు జైలుకు వెళ్లాడు అంటాడు కార్తీక్.  

షాక్ అవుతారు పారు, జ్యో. మా నాన్న ఏ తప్పు చేయలేదు. చేసినవాళ్లు దొరికారు. త్వరలోనే మా నాన్న బయటకు వస్తాడు. తప్పు చేసిన వాళ్లు లోపలికి వెళ్తారు అంటాడు కార్తీక్. జ్యోకు చెమటలు పడతాయి. కాశీ ఏమైనా నిజం చెప్పాడా అని మనసులో అనుకుంటుంది. వారి రియాక్షన్స్ చూసిన కార్తీక్.. తప్పు చేసింది జ్యోత్స్ననే అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆల్రెడీ పోలీసులకు చెప్పాను. మా నాన్నను ఈ కేసులో ఇరికించిన వాళ్లకు కచ్చితంగా బుద్ధి చెప్తా అని అక్కడినుంచి వెళ్లిపోతాడు కార్తీక్. 

77
కంగారుగా పరుగెత్తిన జ్యో

ఏదో జరుగుతోంది గ్రానీ. బావ ఒక్కడే వచ్చాడు దీప రాలేదా అంటుంది జ్యోత్స్న. అది ఇందాకా ఊడుస్తూ నీ గది వైపు వెళ్లడం చూశాను అంటుంది పారు. కంగారుగా గదివైపు పరుగెడుతుంది జ్యోత్స్న. కొంగులో దాచుకున్న ఫోన్ తీసి.. జ్యో గదిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది దీప. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories