Karthika Deepam 2 Today Episode: తప్పించుకున్న జ్యో- సుమిత్ర చావుకు ప్లాన్- దీపకు కూడా ఆపద రానుందా?

Published : Jan 24, 2026, 08:20 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 24వ తేదీ)లో పనిచేయని సీసీ కెమెరా. తప్పించుకున్న జ్యో. దీప, కాంచనలను బాధపెట్టిన పారు, జ్యో. సీరియస్ అయిన శివన్నారాయణ. సుమిత్ర చావుకు ప్లాన్ చేసిన జ్యో. అనుమానించిన దీప. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

PREV
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్‌ శనివారం ఎపిసోడ్‌లో బాల్కనీ నుంచి ఫాస్ట్ గా కిందకు వస్తాడు కార్తీక్. అత్త ల్యాప్ టాప్ ఎక్కడుందని సుమిత్రను అడుగుతాడు. పక్కనే ఉందని చెప్పగానే తీసుకొని సీసీ టీవి ఫుటేజ్ చూస్తాడు. కెమెరా 2లో ఏం కనిపించదు. నేను చెప్పాను కదా అక్కడ ఎవరు లేరని అంటుంది జ్యోత్స్న. కాస్త ఆగండి పెద్దమేడం.. మనం చూడాల్సింది కెమెరా 1 అంటాడు కార్తీక్.

దొరికిపోతానని వణికిపోతుంది జ్యోత్స్న. ఇంతలో దశరథ వచ్చి ఇంటి ముందు కెమెరా పనిచేయట్లేదు అంటాడు. నెల క్రితం ఆ కెమెరాను పాడు చేసింది నేనే. నువ్వు రిపేర్ చేయించావు అనుకున్నాను. తెలియక కంగారుపడ్డాను. నా ముందు జాగ్రత్తే నన్ను కాపాడింది. తప్పించుకున్నాను అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నా అనుమానం అంతా నీ మీదే.. తప్పించుకున్నానని సంతోషపడకు అని మనసులో అనుకుంటాడు కార్తీక్.

28
ఒక నిజం తెలిసేది

సీసీ కెమెరా పని చేస్తే ఒక నిజం తెలిసేది అంటుంది పారు. అవును పారు అంటాడు కార్తీక్ . గ్రానీ ఎవరినో చూసి ఎవరో అనుకుందని జ్యో అక్కడినుంచి వెళ్లిపోతుంది. నేను ఎవరిని చూశానో నీకు తెలుసా అనుకుంటూ జ్యో వెనకాలే వెళ్తుంది పారు. దీప వంటలు కంప్లీట్ చేయ్. అందరం కలిసి భోజనం చేద్దాం అంటుంది కాంచన. 

38
పారును ఏమార్చిన జ్యో

నేను దాసును నిజంగా చూశానే అంటుంది పారు. అందరిలో నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి.. సమస్యను ఇంకా పెద్దది చేస్తున్నావు. నేను ఈ ఇంటి వారసురాలిని కాదు అని బయటపడుతుందని నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు. దాసు లేడు. ఎవరూ లేరు. ఇక్కడికి ఎవరు రాలేదు. ముందు నీ కళ్లజోడు మార్చు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్యోత్స్న. అయితే నిజంగానే నేను దాసును చూడలేదా అని మనసులో అనుకుంటుంది పారు.

48
విషం చిమ్మని పారు, జ్యో

అందరు కలిసి భోజనం చేస్తుంటారు. మీ అన్నయ్య మాట నిలబెట్టుకున్నాడు అని కాంచనతో అంటాడు శివన్నారాయణ. ఏ మాట నాన్న అని అడుగుతుంది కాంచన. ఈ రోజు మన ఇంట్లో పండగే అన్నాడు. అదే చేసి చూపించాడు అని సంతోషపడతాడు శివన్నారాయణ. అందరు భోజనం చేస్తుంటే దీప వడ్డిస్తూ ఉంటుంది. దీపను కూడా భోజనం చేయమంటాడు దశరథ. తండ్రి లాంటి వ్యక్తి అడుగుతున్నాడు తిను దీప అంటాడు కార్తీక్. 

తండ్రి, తల్లి అని చెప్పాల్సిన అవసరం లేదు అని స్టార్ట్ చేస్తుంది జ్యోత్స్న. దీపను ఎందుకు నువ్వు వేరుగా చూస్తావు అని అడుగుతుంది కాంచన. కొందరి బుద్ధులు, చేష్ఠలే వాళ్లను వేరుగా చూసేలా చేస్తాయి అంటుంది జ్యోత్స్న. అందరం సంతోషంగా భోజనం చేస్తుంటే ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటాడు శ్రీధర్. నువ్వు ఊరుకో అల్లుడు అడ్డదారిలో ఈ ఫ్యామిలీలో చేరావు. కాంచనకు నువ్వంటే ఇష్టం లేకపోయిన తన చుట్టూనే తిరుగుతున్నావు. ఫ్యామిలీతో రావాలంటే.. నిజానికి నువ్వు రావాల్సింది కావేరి, స్వప్నలతో అంటుంది పారిజాతం.

58
సీరియస్ అయిన శివన్నారాయణ

పారుపై సీరియస్ అవుతాడు శివన్నారాయణ. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. అందరం సంతోషంగా తింటుంటే ఆ అన్నంలో విషం కలుపుతున్నావా అంటాడు. నోరు మూసుకుంటుంది పారు. అత్తయ్యను ఏమి అనకండి మామయ్య. నా గురించి మీరంతా ఆలోచిస్తున్నారు. నా కోసం ఇదంతా చేస్తున్నారు. మీలో మీరు మాటలు అనుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు నా కూతురు పెళ్లి చూడాలని కోరిక. కానీ అంతవరకు బ్రతుకుతానో లేదో అని ఎమోషనల్ అవుతుంది సుమిత్ర.

68
షాక్ అయిన దీప, కార్తీక్

నేను నిన్ను కాపాడుకుంటాను మమ్మీ అంటుంది జ్యోత్స్న. నీ కూతురు ఉండగా నీకు ఏం కాదు. నీ కూతురు ప్రాణం అడ్డుపెట్టి నీ ప్రాణం కాపాడుకుంటుంది,  ఏం దీప నిజమే కదా అంటుంది జ్యోత్స్న. నువ్వు నా పెళ్లి చేస్తావ్. నా పిల్లలతో ఆడుకుంటావ్. నీ మనుమళ్లకు అన్నం తినిపిస్తావ్ అని చెప్తుంది జ్యోత్స్న. ఆ మాటలకు దీప, కార్తీక్ లతో పాటు పారు కూడా షాక్ అవుతుంది. నా ప్లాన్ వేరే ఉంది. ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

78
సుమిత్ర చావుకు ప్లాన్

మరోవైపు దీప, కార్తీక్ లు మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న ఏదో చేయబోతుంది బావ. చాలా పెద్ద ప్లాన్ వేసింది అంటుంది దీప. రిపోర్ట్స్ రాకుండా అడ్డుకుంటుందా, డాక్టర్ ని కొనేసిందా అని అడుగుతుంది దీప. ఆ డాక్టర్ అలాంటి వ్యక్తి కాదు అంటాడు కార్తీక్. జ్యోత్స్న ఏం ప్లాన్ వేసినా నిజం బయటపటక తప్పదు అంటాడు. సేమ్ టైంలో జ్యోత్స్న పారు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.

ఏం ప్లాన్ వేశావే అని అడుగుతుంది పారు. చెప్పను గ్రానీ అంటుంది జ్యోత్స్న. నాకు కూడా చెప్పకుంటే ఎలాగే అంటుంది పారు. ఏం చేయను సైలెంట్ గా పక్కకు తప్పుకుంటాను అంటుంది జ్యోత్స్న. నేను ఆఫీసులో ఫ్రాడ్ చేసి పక్కన పెట్టిన డబ్బు వేరే అకౌంట్‌లో సేఫ్‌గా ఉంది. నేను ఇంట్లోంచి పోయానంటే నాకోసం వెతుకుతారు. దీపే వారసురాలు అని చెప్పడానికి దాసు రాడు. అమ్మను బతికించడానికి నేను రాను. అమ్మ చచ్చిపోతుంది. ఆ తర్వాత ఎలా రావాలో, వచ్చి ఈ ఇంటిని ఎలా ఏలాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

88
నిజం కచ్చితంగా బయటపడుతుంది

దాసుకు ఫుడ్ పెడుతూ ఉంటారు రౌడీలు. మేము మంచోళ్లం కాదు. ఇంకోసారి పారిపోయే ప్రయత్నం చేయకు అంటారు. మీరు నన్ను ఏం చేయలేరు అంటాడు దాసు. మా మేడం చెప్తే నిన్ను చంపేయడానికి కూడా మేము సిద్ధం అంటారు రౌడీలు. అప్పుడే జ్యోత్స్న వాళ్లకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేయమంటుంది. నీకు ఫుడ్ పెట్టేది నువ్వు బ్రతకడానికి.. ఇక్కడికి వచ్చి నిజం చెప్పడానికి కాదు అంటుంది జ్యోత్స్న. 

ఒక్కటి గుర్తు పెట్టుకో జ్యోత్స్న... నేను నిజం చెప్పనంత మాత్రాన.. నిజం బయటపడదు అనుకోకు. నీ అంతట నువ్వే వారసురాలు ఎవరో చెప్పి తప్పుకుంటే మంచిది, చేసిన తప్పు సరిదిద్దుకో జ్యోత్స్న అంటాడు దాసు. నిజమే.. మీ అమ్మ చేసిన తప్పును నేను సరిదిద్దుతాను. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు అంటుంది జ్యోత్స్న. అంటే దీపను ఏమైనా చేస్తుందా అని మనసులో అనుకొని.. దీపను ఏం చేయకు జ్యోత్స్న అంటాడు దాసు. కోపంగా ఫోన్ కట్ చేసి.. తలెత్తి చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories