Gunde Ninda Gudi Gantalu: వామ్మో రోహిణీ మామూలు ఆడది కాదు, నిమిషంలో ప్లేట్ తిప్పేసింది, మరోసారి బకరా అయిన మనోజ్

Published : Jan 23, 2026, 08:58 AM IST

 Gunde Ninda Gudi Gantalu: రోహిణీకి పెళ్లికి ముందే బిడ్డ ఉన్న విషయం ఇంటిల్లిపాదికీ తెలిసిపోయింది. సత్యం వెళ్లి ప్రభావతిని అడుగుతాడు. మరి, విషయం తెలుసుకున్న తర్వాత మనోజ్ పరిస్థితి ఏంటో నేటి ఎపిసోడ్ లో చూద్దాం... 

PREV
15
Gunde Ninda Gudi Gantalu

నిజం తెలుసుకున్న బాలు ఆ విషయాన్ని వాళ్ల నాన్నతో చెబుతాడు. ఇక.. తాను తెలుసుకున్న విషయం నిజమో కాదో తెలుసుకోవడానికి సత్యం వెళ్లి ప్రభావతిని నిలదీస్తాడు. బాలు తాగేసి ఏదో వాగేశాడు అని ప్రభావతి కొట్టిపారేస్తుంది. కానీ.. ఈ విషయంలో ఎంతో కొంత నిజం ఉందని అనిపిస్తుందని సత్యం అంటాడు. ‘ కోడలు నీళ్లు పోసుకుంటే సంతోషమే కానీ... రెండోసారి గర్భం దాల్చాలని అనుకోవడమే ఏదోలా ఉంది.. నిజం చెప్పు ప్రభా.. ఈ విషయం నీకు ముందే తెలుసు కదా’ అని అడుగుతాడు. ‘ ఏమండీ నాకా?’ అని ప్రభావతి అంటే..‘ రోహిణీ అంటే నీకు ప్రత్యేకమైన అభిమానం కదా.. అందుకే తనకు సంబంధించిన విషయాలు దాస్తున్నావ్ కదా’ అని సత్యం అంటాడు. ‘ నేను ఇష్టపడి... ఇంటికి తెచ్చుకున్న కోడలు అయినంత మాత్రాన ఇలాంటి విషయంలో కూడా తనను సమర్థించే శక్తి నాకు లేదు... వాళ్లకు పెళ్లై సంవత్సరమే అవుతుంది.. ఈలోగా రెండోసారి గర్భం అనేది అబద్ధం. వాళ్లిద్దరి మధ్య జరిగింది నాకు ఎలా తెలుస్తుంది ’ అని ప్రభావతి అంటుంది.‘ మనోజ్ ధైర్యం చేసి ఏ విషయం అయినా నీకే చెబుతాడు.. కాబట్టి చెప్పు ప్రభా.. నిజంగా నిజం అయితే.. నువ్వు నా దగ్గర దాస్తున్నావంటే..నువ్వు మరో తప్పు చేస్తున్నట్లే’ అని సత్యం మరోసారి గట్టిగా అడుగుతాడు. ‘ సత్య ప్రమాణం అండి.. నాకు నిజంగా ఏమీ తెలీదు.. డబ్బుల విషయం దాచాను.. ఇలాంటి విషయాలు దాచలేను.. ఇప్పటికే గుండె దడదడా అంటుంది.. మీరు ఇంకా నన్ను భయపెట్టకండి’ ని ప్రభావతి అంటుంది.‘ మరి, ఈ విషయం బయటకు ఎలా పొక్కింది?’ అని సత్యం అంటే.. ‘ నేను ఇప్పుడే రోహిణీని అడిగేస్తాను’ అని అంటుంది. సత్యం ఆపుతున్నా ఆగకుండా.. వెళ్లి..మనోజ్, రోహిణీ ల డోర్ కొడుతుంది.

25
రోహిణీని నిలదీసిన ప్రభావతి..

మనోజ్ వచ్చి డోర్ తీస్తాడు.. నీ పెళ్లాన్ని పిలవరా అని అంటుంది. రోహిణీ వచ్చి.. ఏమైంది అంటే.. కిందే తేల్చుకుందాం అని లాక్కెళుతుంది.‘ వామ్మో.. నా గురించి ఏం నిజం తెలిసిందో’ అని రోహిణీ మనసులోనే కంగారు పడుతుంటే.. ‘ మీనాతో మాట్లాడినట్లు మా అమ్మ నీతో మాట్లాడితే నేను ఊరుకుంటానా? మనం ఏ తప్పు చేయలేదు కదా’ అని రోహిణీని కిందకు తీసుకువెళ్తాడు మనోజ్. ఈ లోగా.. ఇంట్లో అందరూ కూడా హాల్లో సమావేశం అవుతారు.

‘ఏమైంది అత్తయ్య?’ అని రోహిణీ అడిగితే.. ‘ ఓరి దేవుడో.. అటు తిరిగి.. ఇటు తిరిగి విషయం నా వైపు వచ్చేలా ఉందే’ అని మీనా భయపడుతుంది. ‘ఎవరు నువ్వు?’ అని ప్రభావతి రోహిణీని అడుగుతుంది. ‘ నిద్రలో నుంచి ఇప్పుడే లేచి వచ్చావా?’ అని మనోజ్ అంటే.. కొడుకును లాగి అవతలపడేస్తుంది. ‘ నా గతం బయటపడిపోయింది.. ఇక ఈ రోజే నాకు చివరి రోజు. నా కాపురం కూలిపోయినట్లే’ అని లోలోపల రోహిణీ భయపడుతుంది. కానీ, బయటకు మాత్రం నార్మల్ గానే ఉంటుంది. ‘ చెప్పు.. నీ జీవితంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయి? ఎన్ని దాచావ్? ఎంత మందిని ఇలా మోసం చేయాలని అనుకున్నావ్? నువ్వు ఎప్పుడు బిడ్డని కన్నావ్? ’ అని అడుగుతుంది. ‘ రోహిణీ ఇంత వరకు కన్సీవ్ అవ్వలేదు’ అని మనోజ్ అంటే.. అతన్ని తిడుతుంది. తర్వాత ‘ చెప్పు..నువ్వు ఎప్పుడు బిడ్డన్ కన్నావ్? ఎప్పుడు కడుపు వచ్చింది? ఎవరితో.. అని ఆగిపోతుంది.. తర్వాతా మాట్లాడు.. నిన్ను ఏరి కోరి కోడలిగా తెచ్చుకున్నాను? అందరి కంటే ఎక్కువ నీకే విలువ ఇచ్చాను. నీ తల్లి ఏది? నీ తండ్రి ఏడి? ఎప్పుడు ఎందుకు కనిపించడం లేదు? నీ బిడ్డ గురించి వాళ్లకి కూడా తెలిసిందా? నాలాగే నిలదీసి బయటకు గెంటేశారా? అందుకే ఎవ్వరికీ ముఖం చూపించలేకపోతున్నావా? నీ బతుకే ఒక రహస్యాల పుట్టలా ఉంది.. చెప్పు.. మాట్లాడు’ అని చాలా దారుణంగా ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నలకు రోహిణీ ఏడుస్తుంది తప్ప సమాధానం చెప్పదు.

‘ ఇన్ని రోజులు ప్రభావతిని ఒక కోణంలోనే చూశావ్.. ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను.. ఇంతకు ముందు నువ్వు బిడ్డను కన్నావా?’ అని మళ్లీ అడుగుతుంది. ‘ అందరి ముందు ఇలా అడుగుతున్నారు ఏంటి?’ అని రోహిణీ అంటే.. ‘ ఇది అందరి ముందు తేల్చుకోవాల్సిన విషయమే.. కాసేపు ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు.. నువ్వు హాస్పిటల్ కి వెళ్లావా లేదా?’ అని అడుగుతుంది. దానికి రోహిణీ వెళ్లాను అని సమాధానం చెబుతుంది. ‘ వెళ్లావా? అంటే రెండోసారి బిడ్డను కనడానికి వెళ్లావు అంటున్నారు.. అది నిజమేనా?’ అని అడుగుతుంది. ‘ఇలాంటివన్నీ అందరి ముందు కాదు.. కోడలిని విడిగా అడగాలి’ అని సత్యం అన్నా.. ప్రభావతి వినిపించుకోదు.‘ నా వంశంలో చిన్న మచ్చ కూడా ఉండటానికి వీళ్లేదు.. చెప్పు రోహిణీ ఏం జరిగిందో చెప్పు.. వీడితో జరిగింది మొదటి పెళ్లేనా? పెళ్లికి ముందే నువ్వు తల్లివి అయ్యావా? ఆ బిడ్డను, ఆ నిజాన్ని , ఆ పాపాన్ని దాచి నా ఇంట్లో అడుగుపెట్టావా?’ అని అడుగుతుంది. ఆ మాటలకు రోహిణీ ఏడుస్తూ.. ఓ చోట కూర్చొంటుంది. ‘ ఏం చెప్పి తప్పించుకోవాలి? ఎలా నన్ను నేను కాపాడుకోవాలి? నా కాపురాన్ని ఎలా నిలపెట్టుకోవాలి?’ అని లోలోపలే ఆలోచించుకుంటూ ఉంటుంది.

35
సమాధానం చెప్పమన్న మనోజ్..

‘ ఏడుస్తున్నావ్ ఏంటి రోహిణీ..తిరగబడి సమాధానం చెప్పలేదు ఏంటి? అంటే నువ్వు నిజంగానే హాస్పిటల్ కి వెళ్లావా? మొదటి బిడ్డ ఏంటి? రెండో బిడ్డ ఏంటి?’ అని మనోజ్ అడుగుతాడు. ‘ దేవుడా.. మనోజ్ కూడా క్షమించేలా లేడు.. ఇంత దూరం వచ్చాక ఏం చెప్పి తప్పించుకోవాలి? చింటూ గురించి చెప్పాలా? నా మొదటి పెళ్లి గురించి చెప్పాలా? వీళ్లను మోసం చేసిన విషయం గురించి చెప్పాలా? ఇవి చెబితే.. అత్తయ్య నన్ను చంపేసేలా ఉంది’ అని మనసులో అనుకుంటుంది. సమాధానం చెప్పమని.. మనోజ్ కూడా రెట్టించి అడగడంతో.. ‘ అంతా నా తలరాత ’ అని రోహిణీ తల బాదుకుంటుంది. అయితే.. గతం గురించి చెప్పమని ప్రభావతి రెట్టించి అడుగుతుంది. ‘ ఏం చెప్పాలి అనుకుంటున్నావ్.. నువ్వు ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేదు కదా’ అని మనోజ్ అంటే.... ‘ అయ్యాను..’ అని రోహిణీ అరుస్తుంది. ఆ మాటకు ఇంట్లో అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు.

‘ పెళ్లికి ముందే అయ్యావా? నాకు జవాబు కావాలి? నీ కడుపు కారణం.. నీ మొదటి బిడ్డకు తండ్రి ఎవరు?’ అని ప్రభావతి అడగడంతో.. ‘ ఇక చాలు ఆపండి..’ అని రోహిణీ అరుస్తుంది.

45
కట్టు కథ అల్లేసి చెప్పిన రోహిణీ..

‘మీకు నిజమే కావాలి కదా.. చెబుతాను..వినే గుండె ధైర్యం ఉంటే.. విని తట్టుకునే శక్తి ఉంటే తప్పకుండా నిజం చెబుతాను.. ఇక నిజం దాచలేను. నాలో నేను నలిగిపోయి కుంగిపోయాను.. మీరు అడిగే ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెబుతాను. అది విన్న తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు పర్వాలేదు.. నాకు ఇంతకు ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది. పెళ్లి అయ్యాకే వచ్చింది.. మనోజ్ వల్లే నేను గర్భం దాల్చాను’ అని రోహిణీ చెబుతుంది. ‘ నువ్వు కన్సీవ్ అయ్యావా? ఎప్పుడు? నాకే తెలియకుండా ఇది ఎప్పుడు జరిగింది?’ అని మనోజ్ అంటే.. ‘ కొన్ని నెలల ముందు’ అని రోహిణీ అంటుంది. ‘మనవళ్ల కోసం ఎదురుచూస్తున్న మా అందరికీ ఎందుకు చెప్పలేదు?’ అని ప్రభావతి ప్రశ్నిస్తుంది. ‘ ఆ ప్రెగ్నెన్సీ నిలవలేదు.. కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోయింది.. హాస్పిటల్ కి వెళ్లి కన్ఫామ్ చేసుకొని స్వీట్లు తీసుకొని వచ్చిచెబుతాం అనుకున్నాను.. ఇంతలోనే మా నాన్న జైల్లో ఉన్నాడని తెలిసింది.. ఎంతైనా ఆయన నా కన్న తండ్రి.. మీ ముందు ప్రతిరోజూ ఏడుస్తూ ఉంటే.. చిరాకు పడతారని నాలో నేను ఏడ్చాను.. ఆ ఒత్తిడి, బాధలో నాకు అబార్షన్ అయిపోయింది.’ అని రోహిణీ అంటుంది.. ‘ నాతో ఎందుకు చెప్పలేదు’ అని మనోజ్, ప్రభావతి అడిగితే.. ‘ నాకు తెలిస్తేనే కదా మీకు చెప్పుకోవడానికి’ అని అంటుంది.

‘ నీకు అబార్షన్ అయిన విషయం నీకే తెలియదా?’ అని ప్రభావతి అడిగితే.. ‘ ఒక రోజు నేను కడుపు నొప్పితో హాస్పిటల్ కి వెళ్లాను.. ఆ రోజంతా నాకు ఏదోలా ఉంది.. ఆ రోజే నాకు అబార్షన్ అయ్యింది.. అప్పుడే తెలిసింది.. నా అనుమానం నిజమని, నేను నెల తప్పింది.. నిజమని.. కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చినట్లే పోయిందని మీ అందరికీ చెప్పి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నా బాధలన్నీ నాలోనే దాచుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది.. నేను నిప్పు. మనోజ్ కి తప్ప నా జీవితంలో ఏ మగాడికీ స్థానం లేదు.. మనోజ్ నా ప్రాణం. నాకు నా పుట్టింటి తరపున ఎవరన్నా ఇష్టం లేదు.. అందుకే నా బాధలన్నీ నాలోనే దాచుకున్నాను.ఎవ్వరికీ చెప్పలేదు’ అని ఏడుస్తుంది.

55
మీనా ని దారుణంగా తిట్టిన ప్రభావతి, రోహిణీ..

అంతే.. ప్రభావతి మనసు కరిగిపోతుంది. మీ మామయ్యగారు ఈ విషయం చెప్పగానే నమ్మలేకపోయాను అందుకే నిలదీశాను అని అంటుంది. ఇక ఇంట్లో అందరూ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు.‘ అసలు రోహిణీ పర్సనల్ విషయం నీకు ఎలా తెలిసింది నాన్న?’ అని మనోజ్ అడుగుతాడు. బాలు చెప్పాడు అనే విషయం మనోజ్ కి అర్థమౌతుంది. ఆలోగా.. సత్యం బాలు చెప్పాడు అనే విషయాన్ని బయట పెడతాడు. ఇక బాలు తనకు ఆ విషయాన్ని రవి చప్పాడు అని బయట పెడతాడు. రవి తనకు శ్రుతి చెప్పిందని.. శ్రుతి.. తనకు ఈ విషయం మీనా చెప్పిందని చెబుతుంది. అటు తిరిగి.. ఇటు తిరిగి... మళ్లీ మీనా దగ్గరకు వచ్చి ఆగుతుంది.ఇక ప్రభావతి, రోహిణీ ఇద్దరూ కలిసి మీనాని దారుణంగా తిడతారు. ఏకంగా కొట్టడానికి చేతులు ఎత్తుతుంది. బాలు ఆపుతాడు. సత్యం వచ్చి.. ప్రభావతిని ఆపుతాడు. ఇక.. మీనాని ఇంటి కోడలుగా తీసుకువచ్చారు అని.. సత్యంని కూడా ప్రభావతి తిడుతుంది.

కమింగప్ లో బాలు, మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణీ కట్టు కథ అల్లి చెప్పిందని బాలు పసిగడతాడు. అదే విషయం మీనాతో చెబుతాడు. వాళ్ల మాటలను చాటుగా రోహిణీ వింటుంది.

Read more Photos on
click me!

Recommended Stories