Karthika Deepam 2 Today Episode: శివన్నారాయణ ఇంటికి దాసు-మరోసారి తప్పించిన జ్యో-CC కెమెరాలో రికార్డ్

Published : Jan 23, 2026, 08:19 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 23వ తేదీ)లో కాంచనను పుట్టింటికి తీసుకెళ్తాడు శ్రీధర్. వదినకు అమ్మవారి రక్షతాడు కడుతుంది కాంచన. నిజం చెప్పడానికి ఇంటికి వస్తాడు దాసు. మరోసారి తప్పిస్తుంది జ్యోత్స్న. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. 

PREV
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్‌ శుక్రవారం ఎపిసోడ్‌లో దేవుడి దగ్గర దీప వెలిగించి దండం పెట్టుకుంటూ ఉంటుంది కాంచన. తాళి కళ్లకు అద్దుకుంటుండగా శ్రీధర్ వస్తాడు. నువ్వు తాళి కళ్లకు అద్దుకుంటున్న మాత్రానా నన్ను అంగీకరిస్తావని నేనేమి అనుకోను కాంచన అంటాడు. ఆడదాన్ని మోసం చేస్తే.. తప్పు ఎలా సరిదిద్దుకోవాలో ఎక్కడా రాయలేదు కాంచన. ఈ జన్మకు ఇంతే. ఈ శిక్ష అనుభవించాల్సిందే అంటాడు శ్రీధర్. ఆడదాన్ని మోసం చేయడమంటే పాపం చేయడం అని ఎవ్వరు అనుకోలేదేమో అంటుంది కాంచన. 

28
వాళ్లను మరింత బాధపెట్టకు

నవ్వే కాలం గడిచిపోయింది. ఇప్పుడు కన్నీటి కాలం నడుస్తోంది అంటాడు శ్రీధర్. చమురు ఉన్నంత వరకే దీపం ఉంటుంది. చమురు కదలదు, దీపం కదలదు. కానీ వెలిగి మాత్రం ఎక్కడికైనా పయనిస్తుంది అని కాంచన అంటుండగా దీపం ఆరిపోతుంది. చూశారు కదా అంటుంది కాంచన. శ్రీధర్ మళ్లీ దీపం వెలిగించి.. కాంచన వైపు చూస్తాడు. మనిషి ఉన్నప్పుడు కలవకపోతే.. పోయాక జ్ఞాపకాలతో బతకాలి. నువ్వు మీ పుట్టింటికి రాను అన్నావంట కదా.. మీ అన్నయ్య నన్ను తీసుకురమ్మని నన్ను పంపిచాడు. త్వరగా రెడీ అవ్వు. రాను అని చెప్పి వాళ్లను మరింత బాధపెట్టకు అంటాడు శ్రీధర్.

38
నా కూతురు ఉంది కదా..

మరోవైపు సుమిత్ర మాటలను గుర్తుచేసుకొని మనసులో బాధపడుతుంది దీప. నీకు కార్తీక్ చెప్పాడో లేదో తనకి తాటిబెళ్లంతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం అని చెబుతుంది సుమిత్ర. అమ్మ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను కాదనకూడదు అంటుంది దీప. ఏంటో చెప్పమంటుంది సుమిత్ర. నేను కొన్ని రోజులపాటు ఈ ఇంట్లోనే మీతోపాటు ఉండి మీ మంచి చెడు చూసుకోవాలి అనుకుంటున్నా అంటుంది దీప. నన్ను చూసుకోడానికి నా కూతురు ఉంది కదా అంటుంది సుమిత్ర. దాని ఆలోచనల గురించి తెలిస్తే మీ దగ్గరకు కూడా రానివ్వరు అని మనసులో అనుకుంటుంది దీప.

ఇంతలో శౌర్య అక్కడికి వచ్చి.. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మమ్మ ఏమైనా అందా అని అడుగుతుంది. నేనేం అనలేదే అంటుంది సుమిత్ర. ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను కదా.. అందుకే కళ్లలో నీళ్లు వచ్చాయని చెప్తుంది దీప. సరే నాన్నమ్మ, తాత వచ్చారు. హాల్లో ఉన్నారు. మీతో చెప్పమన్నారు అని చెప్పి వెళ్లిపోతుంది శౌర్య. వదినా వచ్చిందా అనుకుంటూ సంతోషంగా వస్తుంది సుమిత్ర.

48
కన్నకూతురే కాపాడుతుంది

సుమిత్ర, కాంచన ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకుంటారు. దేవుడి దయవల్ల నీతో నాకు అన్నీ మంచి జ్ఞాపకాలే ఉన్నాయి వదినా.. కానీ ఇప్పుడు మంచి పరిస్థితులు లేవు అంటుంది కాంచన. నేను చనిపోతానని భయపడుతున్నావా వదినా అంటుంది సుమిత్ర. వదినా నువ్వు అలా మాట్లాడకు నీకు ఏం కాదు అని అమ్మ వారి రక్ష తాడు చేతికి కడుతుంది కాంచన. అందరికంటే పెద్ద బాధ్యత నీదేని జ్యోత్స్నతో అంటుంది కాంచన. కన్న కూతురే కాపాడుతుందని ఒత్తిపట్టి పలుకుతాడు కార్తీక్. 

వీడు ఎందుకే అన్నిసార్లు ఆ మాటను అంత గట్టిగా చెప్తున్నాడు అని జ్యోత్స్నతో అంటుంది పారు. నువ్వు కాసేపు ఆగు గ్రానీ అంటుంది జ్యోత్స్న. వదినను హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ చేయాలి అన్నయ్య అని అడుగుతుంది కాంచన. రిపోర్ట్స్ ఈపాటికే రావాలి కానీ ఎందుకు రాలేదో అంటాడు దశరథ. ఒకటికి రెండుసార్లు టెస్టులు చేశాకే చెప్తారు మామయ్య అంటాడు కార్తీక్. రిజల్ట్స్ మనం ఊహించిందే కదా.. కచ్చితంగా మ్యాచ్ అవుతుంది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ప్రిపేర్ అవండని డాక్టర్ చెబుతారు అంటాడు శ్రీధర్. జ్యోత్స్న ఇలా రా... ఇక్కడ కూర్చో అంటుంది కాంచన. 

58
షాక్ అయిన జ్యోత్స్న

ఇంతలో జ్యోత్స్నకు రౌడీలు కాల్ చేస్తారు. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి అనుకుంటూ పక్కకు వెళ్తుంది జ్యోత్స్న. ఏంటి అని అడగ్గానే.. నాన్నగారు తప్పించుకున్నారని చెబుతారు రౌడీలు. ఇంతలో గేట్ దగ్గర దాసు కనిపిస్తాడు. దాసును చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. 

68
దాసును తప్పించిన జ్యోత్స్న

ఆయన మా ఇంటికే వచ్చాడు రా.. త్వరగా రండి అని రౌడీలతో చెప్తుంది జ్యోత్స్న. నువ్వు నిజం చెప్పడానికే వచ్చావని నాకు తెలుసు. ఎవరు చూడకముందే నిన్ను ఆపాలి అనుకుంటుంది. దాసు పరుగెత్తుకొని వచ్చి ఇంటి ముందు స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసిన పారిజాతం దాసు అనుకుంటూ బయటకు వస్తుంది. వెనకాలే అందరూ వస్తారు. కానీ బయటకు వచ్చి చూసేసరికి దాసు కనిపించడు.

78
నా మీద ఒట్టు

దాసు మామయ్య ఎక్కడ పారు అంటాడు కార్తీక్. నేను నిజంగా చూశారా.. నా మీద ఒట్టు అంటుంది పారు. అంతా వెతుకుతారు. జ్యోత్స్న బాల్కనీలో ఉండి ఇదంతా చూస్తూ ఉంటుంది. కార్తీక్ ఒక్కసారిగా జ్యోత్స్న వైపు చూడగానే చూపు తిప్పుకొని.. ఫోన్ మాట్లాడుతున్నట్లు నటిస్తుంది. కార్తీక్ వెంటనే జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు. 

88
సీసీ టీవి ఫుటేజ్ చెక్ చెద్దాం..

దాసు మామయ్య కనిపించాడా అని అడుగుతాడు. నేను చూడలేదు అంటుంది జ్యోత్స్న. దాసు వచ్చాడని ఎవ్వరు చెప్పారు అంటుంది జ్యోత్స్న. నేను చూశానే అంటుంది పారు. నువ్వు చెప్తే నేను అస్సలు నమ్మను. నీకు కళ్లే సరిగ్గా కనిపించవు అన్నట్లు మాట్లాడుతుంది జ్యోత్స్న. దాసు మామయ్య రావడం నువ్వే కాదు ఇంకొకరు కూడా చూశారని చెప్తాడు కార్తీక్. ఎవరు అని అడిగితే సీసీ కెమెరా అంటాడు.

సీసీ కెమెరా అయితే నిజమే చెప్తుంది. పద పారు.. మనం సీసీ టీవి పుటేజ్ చెక్ చేద్దాం అంటాడు కార్తీక్. నువ్వు సూపర్ కార్తీక్ అంటుంది పారిజాతం. సీసీ కెమెరాలో దాసును రౌడీలు తీసుకెళ్లింది రికార్డై ఉంటుంది. ఎంక్వైరీ చేస్తే చేయించింది నేనే అని తెలిసిపోతుంది అని భయపడుతుంది జ్యోత్స్న. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories