కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్: సుమిత్రా అంటూ ఉలిక్కిపడి లేచిన దశరథ- నాకు ఆ అర్హత లేదన్న సుమిత్ర

Published : Oct 20, 2025, 07:33 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 20వ తేదీ)లో కాంచన ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకుంటుంది సుమిత్ర. అడ్డుపడుతారు దీప, కాంచన. సుమిత్రా అని ఉలిక్కిపడి లేస్తాడు దశరథ. అత్తకు ఏం కాదని మరోసారి ధైర్యం చెబుతాడు కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

PREV
15
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సోమవారం ఎపిసోడ్ లో స్పృహలోకి వచ్చిన సుమిత్ర.. నేను ఎక్కడున్నాను? ఇక్కడికి నన్ను ఎవరు తీసుకొచ్చారు అని గదిలో నుంచి బయటకు వస్తుంది. ఇది కాంచన ఇల్లు. అంటే దీప నన్ను ఇక్కడికి తీసుకువచ్చి ఉంటుంది. నేను ఇక్కడున్నా అని ఇప్పటికే అందరితో చెప్పి ఉంటుంది. నేను వెంటనే ఇక్కడినుంచి వెళ్లిపోవాలి అనుకుంటుంది. వెళ్లబోతుండగా.. శౌర్య సుమిత్ర చేయి పట్టుకొని నువ్వు ఇక్కడే మాతో పాటే ఉండు అమ్మమ్మ అంటుంది. మళ్లీ వస్తానులే అని సుమిత్ర బయల్దేరుతుండగా దీప వస్తుంది. 

నేను ఎవ్వరకీ చెప్పలేదు

ఎక్కడికి వెళ్తున్నారు? మీ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? అని అడుగుతుంది దీప. ఎలా ఉన్నా నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటుంది సుమిత్ర. మీరు ఇంటికి వెళ్లాలి అంటుంది దీప. అది నాకు చావుతో సమానమని చెప్పాను కదా నీకు అంటుంది సుమిత్ర. అయితే ఇక్కడే ఉండండి అంటుంది దీప. మీరు ఆల్రెడీ వాళ్లకు నా గురించి చెప్పి ఉంటారు. వాళ్లు నాకోసం బయల్దేరి ఉంటారు. నేను వెెళ్లిపోవాలి అంటుంది సుమిత్ర. మేము ఎవ్వరికీ చెప్పలేదు అంటుంది దీప. నువ్వు అబద్దం చెబుతున్నావు అంటుంది సుమిత్ర. లేదమ్మా నేను నిజమే చెప్తున్నా.. నీ గురించి మేము ఎవ్వరికీ చెప్పలేదు అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన కాంచన కూడా మేము ఎవ్వరితో చెప్పలేదు. నీ అంతట నువ్వు చెప్పే వరకు మేము ఎవ్వరికీ చెప్పము అంటుంది కాంచన. అయినా అన్నయ్య, నాన్నల పరిస్థితి చూస్తే నువ్వు ఇలా మాట్లాడవు వదిన అంటుంది.

25
నా దారిన నన్ను వెళ్లనివ్వండి

నా దారిన నన్ను వెళ్లనివ్వచ్చు కదా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు దీప అంటుంది సుమిత్ర. మీ పరిస్థితి ఎలా ఉందో మీకు అర్థమవుతుందా అని బాధతో అంటుంది దీప. అర్థమవుతోంది. కళ్లు తిరుగుతున్నాయి. ఒంట్లో శక్తిలేదు. నీరసంగా ఉంది. నోట మాట రావడంలేదు. అయినా సరే నేను వెళ్లిపోవాలి అంటుంది. నా దారిన నన్ను వదిలేయండి అంటుంది. మీరు నన్ను అలాగే వదిలేశారా.. నేను ఎందుకు వదిలేయాలి. నా తలకు తగలాల్సిన దెబ్బ మీ తలకు తగిలింది. మీ తలకు తగలాల్సిన దెబ్బ నా తలకు తగిలింది. అప్పుడు నాకు ట్రీట్ మెంట్ చేయించారు. ఇంటికి తీసుకెళ్లారు. నా గాయం మానేవరకు నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా మీరు కోలుకునేవరకు ఇక్కడే ఉండండి. మేము ఈ విషయాన్ని ఎవ్వరితో చెప్పం అంటుంది దీప.

నీకు నాకు బంధం ఏంటి?

నా గురించి నువ్వు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నావు? నీకు బంధం ఏంటి అని మళ్లీ అడుగుతుంది సుమిత్ర. నేను నిన్న ఈ విషయాన్ని అడిగినప్పుడు నువ్వు నా అమ్మవి అని చెప్పావు. నువ్వు నా కూతురివా అని అడుగుతుంది. నేను నీ కూతురినే కానీ చెప్పుకునే పరిస్థితిలో లేను అని మనసులో అనుకుంటుంది దీప. ఒకప్పుడు మీరు నన్ను అమ్మలా ఆదరించారు. కూతురు స్థానాన్ని ఇచ్చారు అంటుంది దీప. నా మనసులో మీ స్థానం అలాగే ఉంది అంటుంది దీప. కానీ నాకు క్లారిటీ వచ్చింది. నేను ఎవ్వరికీ వద్దనే విషయం నాకు అర్థమైంది. నన్ను వెళ్లనివ్వండి అంటుంది సుమిత్ర. మా అన్నయ్య గురించి ఒక్కసారి ఆలోచించు వదినా అంటుంది కాంచన. నేను అంటే ఆయనకు ఇష్టం లేదని తెలిశాక కూడా నేను అక్కడికి ఎలా వెళ్లగలను. నాకు ఎవ్వరిమీద నమ్మకం లేదని మళ్లీ స్పృహ తప్పి పడిపోతుంది సుమిత్ర. దీప పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది.

35
ఉలిక్కిపడి లేచిన దశరథ

మరోవైపు సుమిత్ర అని ఉలిక్కిపడి లేస్తాడు దశరథ. అందరు అక్కడికి పరుగెత్తుకొని వస్తారు. సుమిత్ర గురించి బాధపడుతాడు దశరథ. కార్తీక్ సుమిత్ర గురించి ఏ విషయం తెలియలేదా అని అడుగుతాడు శివన్నారాయణ. ఏం తెలియనప్పుడు అత్తయ్యకు ఏం కాదని అంత ధైర్యంగా ఎలా చెప్పావు అని అడుగుతాడు. ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ కచ్చితంగా తెలుస్తుంది. అత్తయ్యకు ఏం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. నా మీద నమ్మకం ఉంచండి అంటాడు కార్తీక్. అంటే బావకు మమ్మీ గురించి ఏమైనా తెలిసిందా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఈ రోజు దీప డ్యూటీకి ఎందుకు రాలేదు? మా మమ్మీ కనిపించలేదన్న బాధతోనా.. లేక బాగానే పోయిందన్న ఆనందంతోనా.. అంటుంది జ్యోత్స్న. ఆ మాటకు దశరథ అడ్డుపడి నువ్వు అనుకునేంత తక్కువ స్థాయి మనిషి కాదు దీప అంటాడు. అనవసరంగా నువ్వు అందరినీ పొగడకు అంటుంది పారు. ఎవరి బాధకు ఎవరు కారణమో అందరికీ తెలుసులే అంటుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు శివన్నారాయణ. మరోసారి తాత, మామయ్యలకు ధైర్యం చెప్తాడు కార్తీక్.

45
చెప్పకుండా వెళ్లిపోతాను

మరోవైపు టిఫిన్ చేయి వదినా అని ప్లేటు తీసుకొస్తుంది కాంచన. ఈ టిఫిన్ దీప చేయలేదు. నేనే చేశాను అంటుంది కాంచన. ఇందాకటి నుంచి అడుగుతున్నాను మాట్లాడవేంటి వదిన అంటుంది కాంచన. తినబుద్ది కానప్పుడు ఎవరు చేస్తే ఏంటని అంటుంది సుమిత్ర. కోపం ఆకలి మీద చూపించకూడదని ఒకప్పుడు మీరే చెప్పారు కదా అంటుంది దీప. నాకు ఆకలి తెలియడం లేదు. ఎలా తినాలి అని అంటుంది సుమిత్ర. నువ్వు ఏం బాధపడకు వదినా.. నువ్వు ఇక్కడున్నట్లు మేము ఎవ్వరితో చెప్పము అంటుంది కాంచన. అలా అన్నారనే నేను ఇక్కడ ఉన్నాను అంటుంది సుమిత్ర. మీరు ఇలా బలవంతం చేస్తే చెప్పకుండా వెళ్లిపోతాను అంటుంది. 

55
అది చావుతో సమానం

ఎందుకు వదినా ఇంత మొండిగా ఉన్నావు. నేను అన్నయ్యను రమ్మంట కూర్చొని మాట్లాడుకోండి అంటుంది కాంచన. భార్యకు ఉన్నతమైన స్థానం భర్త మనసులో ఉంటుంది. అది ఉన్నంతసేపు మిగతావన్నీ వాటితర్వాతే అన్నట్లు అనిపిస్తుంది. నీతో మాట్లాడటం కలిసి ఉండటం కంటే ఆరోజు బుల్లెట్ తగిలినప్పుడు నేనే పోతే బాగుండేది అని మీ అన్నయ్య అన్నారు. ఆ ఒక్క మాట చాలు వదినా భార్య స్థానంలో ఇక నేను లేను అనడానికి. ఊపిరి ఆగిపోతేనే చనిపోయినట్లు కాదు. తను నమ్మిన మనిషి తనను వద్దు అనుకున్నా అది చావుతో సమానంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ రోజు బుల్లెట్ తగిలి నేను చచ్చిపోయినా బాగుండు అని అంటుంది సుమిత్ర.

ఆ అర్హత నేను కోల్పోయాను

వదినా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా.. నేను నాభర్తను దూరం పెట్టాను. ఎందుకంటే అంతకంటే మంచి పరిష్కారం నా దగ్గర లేదు. కానీ నీ పరిస్థితి వేరు. బంగారం లాంటి సంసారం. తండ్రిలా చూసుకునే మామగారు. ఇంతకు మించి ఓ ఆడదానికి ఏం కావాలి చెప్పు అంటుంది కాంచన. వీటిని పొందే అర్హతను నేను కోల్పోయాను వదినా అంటుంది సుమిత్ర. నా భర్తే నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ నన్ను బలవంతంగా భరిస్తున్నారంటే నేను ఎవ్వరికోసం ఉండాలి. నా భర్త నన్ను అంత మాట అన్నాక ఉదయంలేచి ఆయన నా ముఖం చూడగలడా.. లేదా నేను చూడగలనా.. నా భర్త నా వల్ల ఎంత బాధపడుతున్నారో చెప్పాక నేను అక్కడ ఎలా ఉండగలను. అందుకే వచ్చేశాను. దీప కంట పడకపోతే ఇంక ఎవ్వరి కంటా పడనంత దూరం వెళ్లిపోయేదాన్ని అంటుంది సుమిత్ర. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా.. టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకొని పడుకోండి. మేము మీరు చెప్పినట్లే వింటామని చెప్తున్నాం కదా.. మీరు ఇక్కడున్నట్లు ఎవ్వరికీ తెలియదు అని దీప అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories