జూనియర్ ఎన్టీఆర్ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన సినిమా ఏదో తెలుసా?

Published : Oct 19, 2025, 02:20 PM IST

NTR breaks guest sentiment  : ఎన్టీఆర్ ఏదైనా సినిమా ఫంక్షన్ కు వెళ్తే.. ఆ సినిమా ప్లాప్ అవుతుందా? తారక్ పై ఉన్న ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన సినిమా ఏదో తెలుసా? 

PREV
15
ఇండస్ట్రీలో ఎన్నో సెంటిమెంట్లు

ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు కామన్. ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది. స్టార్స్ కు పర్సనల్ గా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. కానీ బయట నుంచి ఎవరో ఒకరు అంటగట్టేవి కూడా కొన్ని ఉంటాయి. ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో దూసుకుపోయేవారికి కూడా ఏదో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ను ప్రచారం చేస్తుంటారు కొంత మంది ఆడియన్స్. ఇండస్ట్రీలో ఈ కల్చర్ ఒక భాగంగా మారిపోయింది. రాజమౌళి లాంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడికి కూడా సెంటిమెంట్ అంటగట్టారు. రాజమౌళితో సినిమా చేస్తే.. ఎంత పెద్ద హీరో అయినా నెక్ట్స్ ప్లాప్ పడాల్సిందే అనేది ఇండస్ట్రీలో టాక్. అయితే రీసెంట్ గా దేవర సినిమాతో ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈక్రమంలో ఎన్టీఆర్ పై కూడా ఓ బ్యాడ్ సెంటిమెంట్ టాలీవుడ్ లో గట్టిగా ప్రచారంలో ఉంది.

25
ఎన్టీఆర్ ను వెంటాడిన బ్యాడ్ సెంటిమెంట్

ఎన్టీఆర్ ఏదైనా సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్తే.. ఆ సినిమా ఖచ్చితంగా ప్లాప్ అవుతుంది అని ఓ రూమర్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అయ్యింది. దీనికి సెంటిమెంట్ రంగు పూసి బాగా ప్రాచారం కూడా చేశారు. ఈసెంటిమెంట్ కు "గెస్ట్ సెంటిమెంట్" అని పేరు కూడా పెట్టారు. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను వెంటాడుతున్న సెంటిమెంట్ పై చర్చ గట్టిగా నడుస్తోంది. ఎన్టీఆర్ గెస్ట్‌గా హాజరైన కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడం ఈ సెంటిమెంట్ గురించి మాట్లాడుకునేలా చేసింది. మొదటగా విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన "దాస్ కా ధమ్కీ" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.

35
కళ్యాణ్ రామ్ సినిమా కూడా..

ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా గెస్ట్‌గా వెళ్లారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా , డిజాస్టర్ గా నిలిచింది. వరుసగా రెండు సినిమాలు ఎన్టీఆర్ గెస్ట్‌గా వెళ్లిన తర్వాత ఫ్లాప్ అవడం వలన ఈ సెంటిమెంట్ పై ఇండస్ట్రీలో చర్చ గట్టిగా నడిచింది.

45
తారక్ ను బ్యాడ్ సెంటిమెంట్ నుంచి కాపాడిన కాంతార1

ఇక తాజాగా ఈ గెస్ట్ సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించిన "కాంతార: చాప్టర్ 1" ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ను సాధించింది. కేవలం 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఎన్టీఆర్ గెస్ట్ సెంటిమెంట్ బ్రేక్ అయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

55
ఎన్టీఆర్ సినిమాలు

ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక మీదట తమ అభిమాన హీరోను ఇలానేఏదైనా అంటే ఊరుకునేది లేదు అని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇక తారక్ సినిమాల లైనప్ చూస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన వార్ 2 యావరేజ్ గా నడిచింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు తారక్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈమూవీ తరువాత ఎన్టీఆర్ వెంటనే దేవర పార్ట్ 2 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories