బుల్లితెర భారీ రియాలిటీ షో ‘బిగ్ బాస్. ఈ షో అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈక్రమంలో బిగ్ బాస్ పై ఓ మాజీ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో రెండు సార్లు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ఆ నటి ఏమంటుందంటే?
ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరాహోరీగా సాగుతోంది. చదరంగం కాదు రణరంగం అని నాగార్జున అన్నట్టుగానే, నిద్రలేచిన దగ్గర నుంచి ఏదో ఒక ఇష్యూలో గోడవలు పెట్టుకుంటూనే ఉన్నారు కంటెస్టెంట్స్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తరువాత బిగ్ బాస్ తెలుగు మరింత రసవత్తరంగా మారింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ సీజన్ ఆరో వారంలోకి ప్రవేశించింది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ షోపై మాజీ కంటెస్టెంట్ హరితేజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నారు?
24
బిగ్ బాస్ పై హరితేజ సంచలన కామెంట్స్
బిగ్ బాస్ లో రెండు సార్లు పార్టిస్పెట్ చేసింది హరితేజ. ఇక రీసెంట్ గా హరితేజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్‌లో ఎదుర్కొన్న అనుభవాలను షేర్ చేసుకున్నారు. బిగ్ బాస్ లోకి మరోసారి వెళ్లాలని అనుకోవడంలేదంటూ హరితేజ్ అన్నారు. ‘‘బిగ్ బాస్ మొదటి సీజన్ హైదరాబాద్‌లో కాకుండా ముంబై సమీపంలోని లోనావాలాలో జరిగింది. అడవిలో ఏర్పాటు చేసిన ఆ సెట్‌లో భయంగా ఉండేవారం, కానీ అక్కడ బాగా ఎంజాయ్ చేశాం, రాత్రివేళ పులుల శబ్దాలు వినిపించేవి. పాములు కూడా హౌస్‌లోకి వచ్చేవి. అయినా నేను అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు బిగ్ బాస్ షో చూడడం మానేశాను. రెండు సార్లు పాల్గొన్న తర్వాత ఇకపై ఆ రియాలిటీ షోపై ఆసక్తి తగ్గిపోయింది. చిరాగ్గా కూడా అనిపిస్తోంది,’’ అని హరితేజ అన్నట్టు తెలుస్తోంది.
34
రెండు సార్లు బిగ్ బాస్ లోకి హరితేజ
లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పాల్గొంది హరితేజ. ఆ సీజన్ లో పాల్గొనడం వల్ల తాను డిప్రెషన్‌లోకి వెళ్లిన విషయాన్ని వెల్లడించింది. హరితేజ్ మాట్లాడుతూ.. ‘‘బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత నా ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. చాలా మంది నాపై ద్వేషాన్ని చూపించారు. దాని వల్ల నేను ఆత్మన్యూనతా భావానికి లోనయ్యాను. మానసికంగా చాలా ప్రభావితయ్యాను. ఆ దశ నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే ఇక మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలన్న ఆలోచన నాకు లేదు,’’ అని హరితేజ స్పష్టం చేసింది.
హరితేజ మొదటి సీజన్‌లో మొదటి సారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సినిమాలు, సీరియల్స్, యాంకరింగ్ అంటూ ఫుల్ బిజీఅయిపోయింది హరితేజ. దాదాపు ఏడేళ్ళ తరువాత రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా మళ్లీ హౌస్‌లోకి ప్రవేశించింది. విజేతగా నిలవకపోయినా, తన ప్రదర్శనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.