Karthika Deepam 2 Today Episode: జ్యోను కన్న కూతురివి కాదన్న కార్తీక్- పడిపడి నవ్విన సుమిత్ర

Published : Jan 20, 2026, 08:18 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 20వ తేదీ)లో రిపోర్ట్స్ వస్తే దొరికిపోతామని టెన్షన్ పడుతుంది పారు. జ్యోను కన్న కూతురువి కాదు అంటాడు కార్తీక్. దాసు గురించి ఆరా తీస్తాడు కార్తీక్. పడిపడి నవ్వుతుంది సుమిత్ర. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

PREV
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో జ్యో, పారు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజం బయటపడుతుందేమోనని నాకు భయంగా ఉందే అంటుంది పారు. నువ్వేమో శాంపిల్స్ ఇచ్చి వచ్చావు. రేపో, ఎల్లుండో రిపోర్ట్స్ వస్తాయి. నీ శాంపిల్స్, సుమిత్ర శాంపిల్ తో మ్యాచ్ కావడం లేదని డాక్టర్ చెప్తుంది. ఎందుకు మ్యాచ్ కాలేదనే అనుమానం అందరిలో మొదలవుతుంది. అప్పుడు డాక్టర్ నెమ్మదిగా జ్యోత్స్న, సుమిత్ర కూతురు కాదని చెప్తుంది. అయ్యో.. మనకు గట్టిగానే మూడిందే అని జ్యోత్స్నతో చెప్తూ వణికిపోతుంది పారిజాతం. తథాస్తు అంటూ వాళ్ల దగ్గరికి వస్తాడు కార్తీక్.

28
జ్యోత్స్న కన్న కూతురు కాదు..

ఎందుకురా తథాస్తు అన్నావు అని అడుగుతుంది పారు. మనకు గట్టిగానే మూడిందన్నారు కదా.. అందుకే అంటాడు కార్తీక్. నేను ఎందుకు అలా అన్నానో నీకు తెలుసా? అని అడుగుతుంది పారు. చేసిన తప్పులు బయటపడతాయని భయపడుతున్నారు అంటాడు కార్తీక్. మేమేం తప్పు చేశాము. అసలే జ్యోత్స్నకు హాస్పిటల్ అంటే భయం. ఈ రోజు శాంపిల్స్ ఇవ్వడానికే జ్యోత్స్న భయపడిపోయింది. రేపు సర్జరీ చేసేటప్పుడు ఇంకెంత భయపడుతుంది అంటుంది పారు. భయపడకు పారు. బోన్ మ్యారో ఇవ్వాల్సింది పెద్ద మేడం గారు కాదు.. కన్న కూతురు అని షాక్ ఇస్తాడు కార్తీక్.

38
పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను

ఏం మాట్లాడుతున్నావురా జ్యోత్స్న కన్న కూతురు కాకపోవడమేంటి అంటుంది పారు. మరి ఎవరైనా కన్నతల్లిని కాపాడుకునే అవకాశం వస్తే అదృష్టంగా ఫీల్ అవుతారు. కానీ పెద్ద మేడం ఎందుకు తప్పించుకోవాలని చూస్తోంది అంటాడు కార్తీక్. అలాంటిది ఏం లేదులేరా అంటుంది పారు. సరే దాసు మామయ్యకు ఏమైంది అని అడుగుతాడు కార్తీక్. నిన్న కూడా అలాగే అడిగావు. వాడు ఇక్కడికి రాలేదురా అంటుంది పారు. దాసుకు సంబంధించిన తాయత్తు తీసి చూపిస్తాడు కార్తీక్. 

ఇది దాసుదేరా.. నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుంది పారు. బయట గార్డెన్ లో దొరికింది అంటాడు కార్తీక్. రాత్రి నుంచి ఆ మనిషి ఇంటికి వెళ్లలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటాడు కార్తీక్. దాసు బాబాయి సంగతి తెలిసిందే కదా.. ఫోన్ సైలెంట్లో పెట్టి బ్యాగులో పెట్టి ఉంటాడు అని కవర్ చేస్తుంది జ్యోత్స్న. ఇంకొక రోజు చూసి పోలీసు కంప్లెయింట్ ఇస్తాను అంటాడు కార్తీక్. ఆ మాటకు షాక్ అవుతుంది జ్యోత్స్న. మామయ్య ఎక్కడున్నా తెలుసుకుంటాను అంటాడు కార్తీక్. నువ్వు తెలుసుకోలేవు బావ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

48
నిజం చెప్పేద్దామన్న దీప

గురువు గారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది దీప. గురువు గారు చెప్పిన కొన్ని మాటలు సంతోషాన్నిచ్చినా.. బిడ్డ జాగ్రత్త అని చెప్పడం భయంగా ఉంది బావ అంటుంది దీప. జ్యోత్స్న అంత ధైర్యంగా శాంపిల్స్ ఎలా ఇచ్చిందని కార్తీక్ ను అడుగుతుంది. తను ఎక్కుడ ఇచ్చింది. తప్పించుకోవడానికి వంద ప్రయత్నాలు చేసింది. నేనే తాత పేరు చెప్పి భయపెట్టా. వేరే దారిలేక టెస్టులు చేయించుకుంది అంటాడు కార్తీక్. ఆ రిపోర్ట్స్ రాకముందే జ్యోత్స్న, అమ్మను ఏమైనా చేస్తే ఎలా? మనం వెళ్లి అమ్మతో నిజం చెప్పేద్దాం అంటుంది దీప. అత్తకు జ్యోత్స్న అంటే విపరీతమైన ప్రేమ. ఈ పరిస్థితిలో అత్తకు నిజం చెప్పలేము అంటాడు కార్తీక్.

58
ఎమోషనల్ అయిన సుమిత్ర, దీప

అంతలో సుమిత్ర అక్కడకు వచ్చి నా దగ్గర ఇంకా ఏ నిజం దాచారని అడుగుతుంది. నీ గురించి తెలిసి మా అమ్మ బాధపడుతోంది. ఆ విషయం నీతో చెప్పొద్దని దీపతో చెప్తున్నాను అని కవర్ చేస్తాడు కార్తీక్. నిజమే.. తను నా గురించి చాలా బాధపడుతుంది. తను నా ఆడపడుచే కాదు.. నాకు మంచి స్నేహితురాలు అంటుంది సుమిత్ర. మీ అందరిని విడిచి వెళ్తున్నట్లు పిచ్చి పిచ్చిగా అనిపిస్తోంది అని బాధపడుతుంది.

నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం. నేను దాన్ని ప్రేమించినట్లు అది నన్ను ప్రేమించదని నాకు తెలుసు. అయినా సరే.. నేను దాన్ని ప్రేమిస్తూనే ఉంటాను అంటుంది సుమిత్ర. జ్యోత్స్నకు నీ లాంటి మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయాలి. అది సంతోషంగా ఉండడం నేను చూడాలి. అప్పటివరకు బతికి ఉంటానా? అని బాధపడుతుంది సుమిత్ర. నీ కన్న కూతురు తన ప్రాణాలు అడ్డుపెట్టి అయినా సరే నీ ప్రాణాలు కాపాడుకుంటుందని ఎమోషనల్ అవుతుంది దీప.

68
కంటతడి పెట్టుకున్న శివన్నారాయణ

మరోవైపు సుమిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు శివన్నారాయణ. దశరథ తండ్రి దగ్గరకు వచ్చి మాట్లాడుతాడు. సుమిత్రకు ఏం కాదు నాన్న మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తాడు దశరథ. మన దగ్గర పరిష్కారం ఉన్నా.. ఆ సమస్య పరిష్కారం కంటే పెద్దది. నా భయం, ధైర్యం కంటే పెద్దది. సుమిత్ర ముఖంలో నవ్వు లేదు. ధైర్యం అంతకంటే లేదు. ఏం చేయాలో ఏం ఆలోచించాలో అర్థం కావడం లేదని కంటతడి పెట్టుకుంటాడు శివన్నారాయణ. తాత ఏడ్చేది చూస్తాడు కార్తీక్.

78
అత్తను నవ్వించాలి

ఇంట్లో అందరూ పైకి ధైర్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం భయం అలాగే ఉందని దీపతో చెప్తాడు కార్తీక్. మరి ఏం చేద్దాం అంటుంది దీప. అత్తను నవ్వించాలి. అప్పుడే అందరి మనసు తేలికగా ఉంటుందని.. సుమిత్రకు ఒక ఫోటో షేర్ చేస్తాడు. అది చూసి సుమిత్ర పడిపడి నవ్వుతుంది. 

88
నిజం చెప్పొద్దు అత్త..

సుమిత్ర నవ్వడం చూసి అంతా షాక్ అవుతారు. ఏమైందని అడిగితే వారికి కూడా ఆ ఫోటో చూపిస్తుంది. అంతా నవ్వుతూ ఉంటారు. దీపకు కూడా ఆ ఫోటో చూపిస్తారు. ఇందులో నవ్వడానికి ఏముంది? రెండు జడలతో ఉన్న చిన్న పాప ఫోటో ఉంది అంటుంది దీప. నీకు ఈ ఫోటో గురించి తెలియదా.. ఆ ఫొటో మీ బావదే అంటుంది సుమిత్ర. దాని వెనుక పెద్ద స్టోరీ ఉందని నవ్వుతుంది సుమిత్ర. చెప్పండి అమ్మగారు అంటుంది దీప. వద్దు అత్త నిజం చెప్పొద్దు అంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories