
కార్తీక దీపం 2 సోమవారం ఎపిసోడ్ లో వయసులో ఉన్నప్పుడు నాకు ఈ పోటీలు చాలా సరదాగా ఉండేవి. కానీ ఇప్పుడు ఓపిక లేదు అంటాడు శివన్నారాయణ కార్తీక్ తో. నాకు కత్తిలాంటి ప్లేయర్ కావాలి. అది నువ్వే అంటాడు. ఈ తాత నిన్న రెండు కోరికలు కోరుతాడు తీరుస్తావా అని అడుగుతాడు. చెప్పు తాత అంటాడు కార్తీక్. నా చేతిలో చేయివేసి మాటివ్వు అంటాడు శివన్నారాయణ. మాటిస్తాడు కార్తీక్. ఒకటి నేను కార్తీక్ మాతోనే ఉన్నాడన్న మాటను నిజం చేయాలి. రెండు మీ అత్తయ్య మామయ్యలను కలపాలి అని చెప్పి మాట తీసుకుంటాడు శివన్నారాయణ. చాలా పెద్ద బాధ్యతే పెట్టావు తాత అనుకుంటాడు కార్తీక్ మనసులో.
కార్తీక్, శివన్నారాయణ మాటలను చాటుగా వింటుంది జ్యోత్స్న. అది చూసిన దీప.. వారి మాటలను చాటుగా ఎందుకు వింటున్నావు అని అడుగుతుంది. చాటుగా వినాల్సిన అవసరం నాకు లేదు అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటో అంటుంది దీప. పని మనిషివి పనిమనిషిలా ఉండు అంటుంది జ్యో. అయితే మీతో కాస్త సపరేట్ గా మాట్లాడాలి అంటుంది దీప. చెప్పు అంటుంది జ్యో. ఇక్కడ కాదు.. వేరే చోట అంటుంది దీప.
కాశీని, దాసును తినడానికి పిలువు అంటాడు శ్రీధర్. మామయ్య బయటకు వెళ్లాడు. కాశీకి ఆకలిగా లేదట అని చెబుతుంది స్వప్న. మీరేమైనా చిన్నపిల్లలా.. రోజు ఈ గొడవలు ఏంటి? నేను పిలుస్తాను అల్లుడిని.. ఈ రోజు ఈ వాదనలకు ఏలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలి అంటాడు శ్రీధర్. ఇంతలో అక్కడికి వస్తాడు కాశి. నేను రేపటి వరకు టైం ఇస్తున్నాను.. వెతుక్కుంటే ఉద్యోగం వెతుక్కో.. లేదా మన బిజినెస్ లు చూస్కో అంటాడు శ్రీధర్. నేను, స్వప్న నీకు సాయంగా ఉంటామని చెబుతాడు.
మరోవైపు ఏదో మాట్లాడాలి అన్నావ్ కదా చెప్పు అంటుంది జ్యోత్న్స. ఇలా నిలబడి కాదు కూర్చొని మాట్లాడాలి అనుకుంటున్నా అంటుంది దీప. నా పక్కన కూర్చోవడానికి ఎంత ధైర్యం నీకు అంటుంది జ్యోత్స్న. కూర్చోవడానికి కుర్చి ఉంటే చాలు అంటుంది దీప. ఈ చేతకాని పనులన్నీ ఆపేయ్ జ్యోత్స్న అంటుంది దీప. నాకు సలహాలిచ్చే స్థాయి నీకు లేదు అంటుంది జ్యో. మనిషి ప్లేసును బట్టి వారికో విలువ ఉంటుంది. నువ్వు ఈ ఇంటి పనిమనిషివి. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు అంటుంది జ్యోత్స్న. నువ్వున్న ప్లేస్ నీదేనా అని ప్రశ్నిస్తుంది దీప. షాక్ అవుతుంది జ్యోత్స్న. నువ్వున్న స్థానం నీది కాదు అని ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతుంది దీప. వణికిపోతుంది జ్యోత్స్న. గట్టిగా మాట్లాడితే నీకు ఎక్కడా ప్లేస్ లేకుండా చేస్తాను అంటుంది జ్యో. ఫస్ట్ నీ ప్లేస్ ను నువ్వు కాపాడుకో అంటుంది దీప.
పారు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తుంది జ్యోత్న్న. నీ జీవితం ఏంటే ఇలా అయిపోయింది.. ఆఫీసులో పరువు పోయింది. మీ తాత దగ్గర పరువు పోయింది. ఆఖరికి దీప దగ్గర కూడా నీ పరువు పోయింది అని వెటాకారం చేస్తుంది పారు. బావ, దీపలకు నా పుట్టుక గురించి నిజం తెలిసినట్లు ఉంది గ్రానీ అంటుంది జ్యో. నిజం తెలిస్తే కార్తీక్ ఊరుకోడు అంటుంది పారు. నేను ఓడిపోతున్నాను సాయం చేయవచ్చు కదా అంటుంది జ్యో. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అంటుంది పారు. పెళ్లి గురించి మాట్లాడకు గ్రానీ అంటుంది జ్యోత్స్న. అయితే నువ్వు ఒక పని చేయి అంటుంది పారు.
ఇంటికి బయల్దేరిన దీప, కార్తీక్ లను మధ్యలో ఆపుతుంది జ్యోత్స్న. నీతో పర్సనల్ గా మాట్లాడాలి బావ అంటుంది. నేను మా బావను నీతోపాటు పంపివ్వను అంటుంది దీప. రా బావ అంటుంది జ్యోత్స్న. మా మరదలు పర్మిషన్ లేకుండా నేను రాను అంటాడు కార్తీక్. పంపివ్వు దీప అని రిక్వెస్టింగ్ గా అడుగుతుంది జ్యోత్స్న. అయినా నేను పంపించను అంటుంది దీప. కార్తీక్ దీపను ప్రేమగా రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత జ్యోతో కలిసి బయటకు వెళ్తాడు.
నాకు నీ సాయం కావాలి అని అడుగుతుంది జ్యోత్స్న. డ్రైవర్ ని నేను ఏం సాయం చేస్తాను అంటాడు కార్తీక్. సీఈఓ పోస్ట్ విషయంలో అంటుంది జ్యో. ఆ విషయంలో తాత, మామయ్య చేస్తారు.. నా మాట ఎవరు వింటారు అంటాడు కార్తీక్. అయినా ఇంట్లో అన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నీ సమస్య ముఖ్యమా అన్నట్లు మాట్లాడుతాడు. మా అమ్మ, నాన్న కలిస్తే.. నువ్వు నాకు సాయం చేస్తావా బావ అంటుంది జ్యోత్స్న. వెంటనే అక్కడి నుంచి ఇంటికి బయల్దేరుతుంది. వెనకాలే కార్తీక్ కూడా వస్తాడు.
మమ్మీ, డాడీ అని గట్టి గట్టిగా అరుచుకుంటూ లోపలికి వస్తుంది జ్యోత్స్న. ఏమైందని పారు అడిగితే కాసేపు ఆగు అంటుంది. ఇంతలో దశరథ, సుమిత్ర, శివన్నారాయణ వస్తారు. నాకు నచ్చడం లేదు మమ్మీ అంటుంది. ఏంటని సుమిత్ర అడుగుతుంది. సుమిత్రను దశరథ పక్కకు తీసుకెళ్లి.. మీరు ఇలా మాట్లాడుకోకుండా ఉండటం నాకు నచ్చడం లేదు మమ్మీ అని జ్యోత్న్స అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.