Bigg boss 9 Telugu Promo: బుర్రకు పదును పెట్టేలా కెప్టెన్సీ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్, భరణికి ఊహించని షాక్ ఇచ్చిన కళ్యాణ్

Published : Oct 10, 2025, 05:10 PM IST

బిగ్ బాస్ (Bigg Boss) తెలుగు సీజన్ 9 కొత్త ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఈసారి మెదుడకు పదును పెట్టేలా టాస్క్ రూపొందించారు. ఇందులో భరణికి కళ్యాణ్ ఊహించని షాక్ ఇచ్చాడు. 

PREV
15
కెప్టెన్సీ టాస్క్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఆసక్తికరంగానే సాగుతోంది. కొత్త కెప్టెన్ ఎవరో తేల్చేందుకు కొత్తగా కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందుకోసం ఫిజికల్ టాస్క్ కాకుండా బుర్రకు పదును పెట్టే మెంటల్ టాస్క్ ను ఇచ్చాడు. ఇందులో కళ్యాణ్ పడాల తన బుర్రను బాగానే వాడి విజేతగా నిలిచినట్టు తెలుస్తోంది.

25
నెత్తిపై బల్బును పెట్టి

ఈ ప్రోమోను బట్టి సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్లు అంతా కెప్టెన్సీ రేస్ లో ఉన్నారు. వారిని గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి వారి నెత్తిపై ఒక బల్బును ఉంచారు. అలాగే వారి కళ్ళకు గంతలను కట్టారు. బజర్ మోగినప్పుడు సంచాలకులు ఒకరిని ఎంచుకొని వారి భుజంపై టచ్ చేస్తారు. అప్పుడు వారు తమ కళ్లకున్న గంతలు తీసేస్తారు. ఆ తర్వాత మిగిలిన సభ్యుల్లో ఎవరో ఒకరిని ఎంచుకొని వారి లైట్ ని ఆఫ్ చేస్తారు.

35
సంజన సంచాలక్

అలా లైట్‌ను ఆఫ్ చేశాక తిరిగి తమ కుర్చీలో వచ్చి కూర్చొని కళ్ళకు గంతలు కట్టుకుంటారు. ఆ తర్వాత ఎవరి లైట్ ఆఫ్ అయ్యిందో వారు... తమ లైట్ ని ఆఫ్ చేసింది ఎవరో కనిపెట్టి చెప్పాలి. వారు సరిగ్గా గెస్ చేస్తే ఆటలో ఉంటారు. ఇక లైట్ ని ఆఫ్ చేసిన వ్యక్తి ఎలిమినేట్ అవుతారు. ఈ టాస్కుకు సంజనను సంచాలక్ గా పెట్టారు బిగ్ బాస్. మొదటగా రాముని టచ్ చేసింది సంజన. రాము.. దివ్య లైట్ ఆఫ్ చేశాడు. దివ్య.. రాముపేరును సరిగ్గానే గెస్ చేసి చెప్పింది. దీంతో మొదట్లోనే రాము కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నాడు.

45
భరణి అవుట్

ఆ తర్వాత సంజన భరణిని టచ్ చేసింది. భరణి.. కళ్యాణ్ లైట్ ఆఫ్ చేశాడు. కళ్యాణ్ భరణి పేరును కరెక్ట్ గానే గెస్ చేశాడు. దీంతో భరణి ఆట నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కళ్యాణ్ చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేసి భరణిని ఎలిమినేట్ చేశాడు. ఎందుకంటే ఉన్నవారిలో తనూజ, దివ్యని... భరణి తీయాలనుకోడు. ఇక ఇమ్మాన్యూయల్ తో పోలిస్తే భరణికి తనను ఎలిమినేట్ చేయడమే ఇష్టం. కాబట్టి అలా ఆలోచించి భరణి పేరును కరెక్ట్ గా గెస్ చేశాడు కళ్యాణ్. దీంతో భరణికి ఒక్కసారిగా షాక్ తగిలింది.

55
కళ్యాణ్ కొత్త కెప్టెన్?

సంజన తనూజకు ఛాన్స్ ఇచ్చింది. తనూజ.. దివ్య లైట్ ఆఫ్ చేసింది. కానీ దివ్య.. తనూజ పేరును సరిగ్గా గెస్ చేయలేకపోయింది. ఈ ఆట మొత్తం అయ్యేసరికి కళ్యాణ్ కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఐదవ వారం కళ్యాణ్ కెప్టెన్ గా నిలిచి ఆ వారం ఇమ్యూనిటీని పొందాడు.

Read more Photos on
click me!

Recommended Stories