Biggboss 9 Telugu: భరణి, దివ్య, తనూజకు గట్టిగానే ఇచ్చిపడేసిన నాగార్జున, మిమ్మల్ని బిగ్ బాస్ లో ఉంచడం వేస్ట్ అన్న ప్రేక్షకురాలు

Published : Oct 11, 2025, 11:52 AM IST

శనివారం నాగార్జున వచ్చే బిగ్ బాస్ ప్రోమో (Biggboss 9 Telugu) కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈసారి త్వరగానే ప్రోమోను విడుదల చేశారు. ఇందులో భరణి, దివ్య, తనూజలకు గట్టిగానే క్లాస్ పీకారు నాగార్జున. అలాగే ప్రేక్షకులు భరణికి గట్టిగానే ఇచ్చి పడేశారు. 

PREV
14
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో ఆసక్తికరంగా మొదలైంది. నాగార్జున మాస్ హీరో గెటప్ లో ఎంట్రీ ఇచ్చారు. వస్తూ వస్తూనే తనూజకు క్లాసు మొదలుపెట్టారు. బెడ్ టాస్క్ లో తనూజ ప్రవర్తించిన తీరు ఏ మాత్రం బాలేదని అన్నారు. సంజన ఇచ్చిన సలహాలు తీసుకొని ఉంటే బాగుండేదని సూచించారు. భరణి, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ తనను బెడ్ టాస్కు నుంచి తీయరని తనూజ భావించిందని నాగార్జున అన్నారు. దానికి తనుజ ఏమీ సమాధానం చెప్పలేకపోయింది.

24
దివ్యకు కూడా

తర్వాత దివ్య వంతు వచ్చింది. దివ్యకి కూడా నాగార్జున తనదైన శైలిలో ఇచ్చి పడేశారు. టాస్క్ లో దివ్య, తనూజ ఇద్దరూ ఉంటే భరణి ఎవరిని తీసేవారు అని ప్రశ్నించారు. నాగార్జున దానికి దివ్య తనని తీసేవారని చెప్పింది. ఎందుకలా ప్రశ్నిస్తే ‘తాను అర్థం చేసుకుంటాను కాబట్టి భరణి అలా చేసి ఉండేవారు’ అని చెప్పింది. వెంటనే నాగార్జున ‘తనూజ అర్థం చేసుకోదా’ అని ప్రశ్నించారు.

34
దిగజారిపోతున్నావ్ భరణి

ఆ తర్వాత భరణికి ఈసారి గట్టిగా షాక్ ఇచ్చేలా మాట్లాడారు. నాగార్జున ఒక వీడియోను వేసి పవన్‌.. రీతుకు సపోర్ట్ చేస్తాడని అతడిని తీసేశావని, కానీ నువ్వే బెడ్ పైనుంచి కింద పడ్డావు అని అన్నారు నాగార్జున. దానికి భరణి మాట్లాడుతూ తాను స్వార్ధంగానే ప్రవర్తించానని, తన మిస్టేక్ ఒప్పుకుంటున్నానని అన్నారు. దానికి ‘ఎంతో ఎదగాల్సిన నువ్వు మా దృష్టిలో కిందపడ్డావ్’ అన్నారు నాగార్జున. దానితో భరణి బాధపడుతూ కనిపించారు. వారం అంతా తప్పులు చేసి వీకెండ్ లో ఒప్పుకుంటే కుదరదని అన్నారు.

44
మిమ్మల్ని ఎందుకు ఉంచాలి హౌస్‌లో

భరణి గురించి ప్రేక్షకులు ఏమంటున్నారో కూడా చెప్పే ప్రయత్నం చేశారు నాగార్జున. యూకే నుంచి వచ్చిన ఒక ప్రేక్షకురాలు భరణితో ‘సార్ మీ గేమ్ కనిపిస్తలేదు.. బాండింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అసలు మిమ్మల్ని క బిగ్బాస్ హౌస్లో ఉంచాలనిపించడం లేదు’ అని అంది. దాంతో భరణి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. దీంతో ప్రోమో ముగిసింది. ఈ ప్రోమోను బట్టి చూస్తే శనివారం గట్టిగా క్లాస్ పడింది తనూజ, భరణి, దివ్యలకేనని అర్థమవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories