
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో శౌర్యతో హోంవర్క్ చేయిస్తూ ఉంటుంది కాంచన. శౌర్య నువ్వు చాలా మంచి అమ్మాయివి. ఎవ్వరు చెప్పకపోయినా చక్కగా హోంవర్క్ చేస్తావు అంటుంది కాంచన. అవును నానమ్మ. శౌర్య గుడ్ గర్ల్ అని చెప్పుకుంటుంది శౌర్య. ఇది గుడ్డు తిన్నప్పుడే గుడ్ గర్ల్. తర్వాత మాట వినదు రాక్షసి అంటుంది అనసూయ.
గుడ్ గర్ల్ అంటే నువ్వు అనుకునేది కాదులే అని వెటకారంగా అంటుంది శౌర్య. ఎన్ని వంకర్లు తిప్పుతావే మూతి అని శౌర్యను అంటుంది అనసూయ. నువ్వు కూడా తిప్పుతున్నావు కదా అంటుంది శౌర్య. ఏంటి శౌర్య నువ్వు పెద్దవాళ్లతో గొడవ పడతావు అంటుంది కాంచన. శౌర్య వేసే డ్రాయింగ్ చూసి.. ఆ బుక్ తీసుకొని కాంచనకు చూపించాలి అనుకుంటుంది అనసూయ. బుక్ లాక్కొని పరుగెడుతుంది శౌర్య. పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అనసూయ.
ఇంతలో దీప, కార్తీక్ వస్తారు. ఆ తర్వాత కావేరి వస్తుంది. దీప, కార్తీక్ లను టిఫిన్ చేయడానికి ఇంటికి రమ్మని పిలుస్తుంది. కాంచనను కూడా రమ్మని అడిగేలోపే వాళ్లు ఇద్దరూ వస్తారులే అని చెప్తుంది. రేపు నువ్వు కూడా మాతోపాటు రావచ్చు కదా అమ్మా అంటాడు కార్తీక్. మీ పెద్దమ్మ గుడ్డు పులుసు చేసింది తిందాం పదా అని వెళ్లిపోతుంది కాంచన. అత్తను ఏం అనకు అంటుంది దీప. నాకు తెలుసు దీప అని చిరాకుగా వెళ్లిపోతాడు కార్తీక్.
మరోవైపు ఆలస్యంగా ఇంటికి వస్తాడు కాశీ. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావు అంటాడు శ్రీధర్. బయట ఫ్రెండ్స్ కలిస్తే మాట్లాడి వస్తున్నాను అంటాడు కాశీ. సరే కానీ మీ బాస్ నీకు ఆఫీసు టైంలో ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతుంటేనే ఆ కాల్ నువ్వు కట్ చేస్తే అతను ఏం అర్థం చేసుకోవాలి అంటాడు శ్రీధర్. వేరే ఫోన్ వస్తే కట్ చేశాను అంటాడు కాశీ.
నేను మీ బాస్ ని. నాకంటే ముఖ్యమైన ఫోన్ ఏముంటుంది అంటాడు శ్రీధర్. పీఏ అనేది చిన్న పోస్ట్ మాత్రమే. అదే నా జీవితం కాదు అంటాడు కాశీ. దాంతో కోపంగా కాశీపై అరవడం స్టార్ట్ చేస్తుంది స్వప్న. నువ్వు నా గురించి, తన గురించి ఆలోచిస్తుంటే.. తనకు ఈ ఉద్యోగం చేయడం చిన్నతనంగా అనిపిస్తోంది నాన్న. ఈ ఉద్యోగం కూడా లేకుండా రోడ్లపై తిరగడం తనకు ఇష్టం అంటుంది స్వప్న.
ఇప్పుడు చెప్తున్న విను మా అన్నయ్య, మా నాన్న లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. నువ్వు ఒక అసమర్థుడివి అంటుంది స్వప్న. నా గురించి తెలిసే పెళ్లి చేసుకున్నావు కదా అని వాదిస్తూ ఉంటాడు కాశీ.
ఇంతలో కావేరి వస్తుంది. ఇంట్లో ఇలా అరవొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను. ఇంట్లో ఉండడం ఇష్టం లేకుంటే ఇద్దరూ కలిసి బయటకు వెళ్లిపోండి అంటుంది. వెళ్తాను కానీ మీ అల్లుడితో కాదు ఒక్కదాన్నే వెళ్తాను అంటుంది స్వప్న. మీ అమ్మ ఏదో పిచ్చిగా మాట్లాడితే నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి స్వప్న. లోపలికి వెళ్లండి అంటాడు శ్రీధర్. కాశీ, స్వప్న ఇద్దరూ లోపలికి వెళ్తారు.
నువ్వు వెళ్లిన పని ఏమైంది అని అడుగుతాడు శ్రీధర్. దీప, కార్తీక్ వస్తా అన్నారు. కాంచన అక్క మాత్రం రా అని పిలిచే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు అంటుంది కావేరి. కాంచన రాను అని చెప్పడం ఓకే కానీ.. నా కొడుకైనా తనని ఒప్పించాలి కదా అనుకుంటాడు శ్రీధర్.
ఓ పక్కన నిలబడి జ్యోత్స్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు కార్తీక్. ఏమైంది బావ అనుకుంటూ వస్తుంది దీప. అమ్మను ఎలాగైనా ఆ ఇంటికి తీసుకెళ్లాలి అంటాడు కార్తీక్. అత్తకు ఇష్టం లేదు కదా అంటుంది దీప. ఇష్టం లేదని వదిలేస్తే ఎలా? అప్పుడప్పుడు ఇలా కలుస్తుంటూనే కదా కుటుంబాలు కలిసేది అంటాడు కార్తీక్.
సరే నేను అడుగుతానులే అంటుంది దీప. ఇప్పుడే అడుగుదాం పదా అంటాడు కార్తీక్. అమ్మ రేపు ఉదయం మాతోపాటు నువ్వు, పెద్దమ్మ కూడా రావాలి. మేము టిఫిన్ చేసి తాత ఇంటికి వెళ్తాం. మీరు లంచ్ కూడా చేసి శౌర్య స్కూల్ నుంచి వచ్చే టైం వరకు ఇంటికి రండి అంటాడు కార్తీక్.
శౌర్య స్కూల్ అక్కడికి దగ్గరే కదా.. అటునుంచి అటు తీసుకొని వెళ్లి రాత్రి కూడా అక్కడే భోజనం చేయవచ్చు అంటుంది అనసూయ. సూపర్ పెద్దమ్మ డ్యూటీ అయ్యాక మేము కూడా అటే వస్తాము అంటాడు కార్తీక్. నేను రాను అంటుంది కాంచన. రిక్వెస్ట్ చేస్తుంది దీప. మీరు ఏం తినకుండా ఇక్కడే ఉంటే మీ అత్తకు ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదా అని మామయ్య గారు నన్ను తిడతారు అంటుంది దీప.
ఇంతలో శౌర్య వచ్చి తాత నిన్ను ఎందుకు తిడతాడమ్మ అంటుంది. తాత నిన్ను తిట్టొద్దు అంటే నానమ్మను తాత దగ్గరికి పంపవ్వు అంటుంది. నేను ఇక్కడ ఉంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటే లోపలికి వెళ్లి పడుకో అని కోపంగా అంటుంది కాంచన.
అది చిన్న పిల్ల. దాంతో అంత కోపంగా ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మా అంటాడు కార్తీక్. ఇవి శౌర్య మాట్లాడినట్లు లేదు. ఎవరో దాంతో అనిపించినట్లు ఉంది అంటుంది కాంచన. అత్తయ్య మీరు నా వైపు చూస్తున్నారు. నాపై నింద వేస్తున్నారా? నేను ఎప్పుడైనా మిమ్మల్ని పరాయి వాళ్లలా చూశానా? నేను ఎందుకు శౌర్యతో అలా అనిపిస్తాను. నేను తనతో ఏం చెప్పలేదు అని ఏడుస్తుంది దీప. మీరు ఇద్దరూ ఈ గొడవ ఇక్కడితో ఆపితే మంచిది అంటాడు కార్తీక్. అక్కడి నుంచి వెళ్లిపోతుంది కాంచన. దీపను కూడా వెళ్లి పడుకో అంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.