కాంతార చాప్టర్ 1 దూకుడు ఇంకా తగ్గలేదు.. ఓటీటీలో దుమ్మురేపిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే

Published : Nov 11, 2025, 06:41 PM IST

OTT top 5 Indian movies and web series : ఓటీటీలో సినిమాలు చూసేవారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దాంతో ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పోటీ పడుతున్నాయి. ఈ వారం ఓటీటీలో దుమ్మురేపిన సినిమాలు, వెబ్ సిరీస్ లలో టాప్ 5 ఏవో తెలుసా? 

PREV
16
ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణ

థియేటర్లకు మించి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అద్భుతమైన కంటెంట్ ను అందిస్తున్నాయి. భాషా సరిహద్దులు దాటి పాన్-ఇండియా స్థాయికి చేరడానికి సినిమాలకు ఓటీటీ స్ట్రీమింగ్ సహాయపడుతుంది. పాన్-ఇండియా చిత్రాలకు ఇప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. నవంబర్ 3 నుంచి 9 వరకు ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన ఇండియాన్ సినిమాల లిస్ట్ ను ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది.

26
ఓటీటీలో నెంబర్ వన్ గా కాంతార చాప్టర్ 1

ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన కాంతార చాప్టర్ 1, ఈ వారంలో ఓటీటీలోనూ ఎక్కువ వ్యూస్ ను సాధించి, నెంబర్ 1 గా నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోన్న కాంతార1, ఓటీటీలో 41 లక్షల వ్యూస్ ను సాధించింది. . ఇంకా కాంతార హిందీ వెర్షన్ ఓటీటీలో విడుదల కాలేదు. అక్టోబర్ 31న దక్షిణ భారత భాషల వెర్షన్లు మాత్రమే విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కాంతార ఇప్పటి వరకు 827.75 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించింది.

36
కాంతార చాప్టర్ 1 క్లోజింగ్ కలెక్షన్స్

ఓవర్ సిస్ నుంచి మాత్రమే కాంతార ఛాప్టర్ 1 సిసినిమా సుమారుగా 110.4 కోట్లు వసూలు చేసింది. కాంతార హిందీ వెర్షన్ 204 కోట్లు వసూలు చేయడం బాలీవుడ్ సూపర్ స్టార్లనే ఆశ్చర్యపరిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈసినిమా.. 2022 లో వచ్చి 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్ గా రూపొందింది. ఇక 'కాంతార: ఎ లెజెండ్ - చాప్టర్ 1 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది.

46
ఓటీటీలో దూసుకుపోతున్న సినిమాలు

హిందీ, మరాఠీ, బెంగాలీతో సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అయిన 'లోకా', కాంతార కంటే కొద్ది తేడాతో వెనుకబడి రెండో స్థానం సంపాదించింది. గత వారం ఓటీటీ ప్యూస్ విషయంలో లో భారతీయ చిత్రాల్లో 'లోకా' రెండో స్థానంలో నిలిచింది. ఈసినిమాకు 40 లక్షల ఫ్యూస్ లభించాయి. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించింది. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది.

56
ధనుష్ కంటే బెటర్ గా తేజ్ సజ్జా..

ఓటీటీలో మూడో స్థానాన్ని 'మిరాయ్' దక్కించుకుంది. ఈ చిత్రానికి ఓటీటీలో 31 లక్షల మంది వీక్షకులు ఉన్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈసినిమా జియో హాస్ట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. నాలుగో స్థానంలో ధనుష్ హీరోగా నటించిన 'ఇడ్లీ కడై' ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఈసినిమా 24 లక్షల ఫ్యూస్ ను సాధించింది. 'ఇడ్లీ కడై' చిత్రానికి ధనుష్ హీరగా నటిస్తు కథ, దర్శకత్వం వహించారు. ఇక ఆతరువాత 'బాఘీ 4' ఐదో స్థానంలో నిలిచింది, అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా 20 లక్షల మంది వీక్షకులను ఈసినిమా పొందింది.

66
వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే..

అమెజాన్ ప్రైమ్‌లోని 'ఫస్ట్ కాపీ' అనే వెబ్ సిరీస్ రెండో సీజన్ 28 లక్షల ప్యూస్ తో మొదటి స్థానంలో ఉంది. సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతున్న 'మహారాణి' వెబ్ సిరీస్ 4వ సీజన్ 26 లక్షల ప్యూస్ తో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న 'మహాభారత్: ఏక్ ధర్మయుధ్' వెబ్ సిరీస్‌కు జియో సినిమాలో 17 లక్షల ప్యూస్ వచ్చాయి. 'ది విచర్' వెబ్ సిరీస్ నాలుగో సీజన్ 14 లక్షల ప్యూస్ తో నాలుగో స్థానంలో ఉంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. 'థోడే దూర్ థోడే పాస్' అనే హిందీ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ 13 లక్షల ప్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories