కథ చెప్పడానికి వెళ్తే.. స్టార్ డైరెక్టర్ ను గెట్ అవుట్ అన్న భానుమతి, కారణం తెలిస్తే షాక్ అవుతారు?

Published : Nov 11, 2025, 05:59 PM IST

భానుమతికి సినిమా కథ చెప్పడానికి వెళ్తే.. ఓ డైరెక్టర్ ను గెట్ అవుట్ అని తరిమేసిందట భానుమతి. ఆమెకు కోపం వచ్చేలా ఆ కథలో ఏముంది? భానుమతి కోపానికి బలైన దర్శకుడు ఎవరు? ఆసినిమా ఏంటి? అందులో భానుమతి నటించిందా లేదా? 

PREV
15
భానుమతి అంటే ఇండస్ట్రీలో భయం..

భానుమతి అంటే ఇండస్ట్రీలో అందరికి భయం ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటివారు కూడా ఆమెతో మాట్లాడటానికి వెనకడుకు వేస్తారు. ఇక ఆమెకు కథ చెప్పాలంటే.. దర్శకులకు చెమటలు పట్టేవి. అందులో ఏమైనా తేడా వస్తే.. ఆమె వాయిస్ లో ఛేంజ్ వచ్చేది. నెక్ట్స్ ఆమె ఎలా రియాక్ట్ అవుతుందా అని అందరు భయపడేవారు మేకర్స్. ఫిల్మ్ ఇండస్ట్రీపై భానుమతి కమాండింగ్ అలా ఉండేది. ఎందుకంటే ఎన్టీఆర్ ఏఎన్నాల కంటే ముందే ఆమె ఇండస్ట్రీలో ఉన్నారు. అంతే కాదు హీరోయిన్ గా, సింగర్ గా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, స్టూడియో అధినేతగా, పరిశ్రమలో ఆమెకు రాని పనిలేదు, చేయని పాత్ర లేదు, వేయని వేషం లేదు. 24 విభాగాలపై భానుమతికి పట్టు ఉండేది. అన్ని విషయాలలో ఆమె సక్సెస్ అయ్యి చూపించింది.

25
ఎన్టీఆర్ ఏఎన్నాల కంటే సీనియర్

సినీ పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ కావడంతో భానుమతి అంటే భయం అందరిలో ఉండేది. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు కూడా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు. ఈక్రమంలో ఓ దర్శకుడు భానుమతికి కథ చెప్పడానికి వెళ్లి.. ఆమెతో తిట్లు తిని వచ్చాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు కోడి రామకృష్ణ. భానుమతి హీరోయిన్ గా ఉన్నప్పుడు మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా స్టార్డమ్ ను అనుభవించింది. ఆమెకు క్యారెక్టర్ రోల్స్ ఇవ్వాలన్నా.. దర్శకులు చాలా జాగ్రత్తగా పాత్రలు రాసుకునేవారు. ఏమాత్రం తేడాగా ఉన్నా ఆమె ఒప్పుకునేవారు కాదు. చివరికి భానుమతితో భామ్మ పాత్ర చేయించానికి కూడా దర్శకులు ఒకటికి పదిసార్లు ఆలోచించిన రోజులు ఉన్నాయి.

35
డైరెక్టర్ ను గెట్ అవుట్ అన్న భానుమతి..

ఈక్రమంలో కోడి రామకృష్ణ మంగమ్మగారి మనవడు సినిమా కోసం భానుమతిని తీసుకోవాలని అనుకున్నారు. కథ అంతా సిద్దం చేసుకుని చెన్నైలో భానుమతి ఇంటికి వెళ్లారు. అయితే కథ, డైరెక్షన్, డైలాగ్స్ అన్నింటిపై పట్టు ఉన్న వ్యక్తి కావడంతో.. భానుమతికి ఇది నచ్చుతందా లేదా అని, ఒక వైపు కోడి రామకృష్ణకు భయంగానే ఉంది. కథ మొత్తం చెప్పిన తరువాత భానుమతి కోపంగా పైకి లేచి.. డైరెక్టర్ ను గెట్ అవుట్ అన్నారట. మీకు టీ, కాఫీలు ఇవ్వడం కూడా దండగా.. ఇక మీరు వెళ్లిపోండి అని కోపంగా రియాక్ట్ అయ్యారు భానుమతి. ఆమె అలా రియాక్ట్ కావడానికి ఓ కారణంఉంది. ఆసినిమా కథలో కొన్ని బూతు డైలాగ్స్ ఉన్నాయి. అవి ఆమెకు కోపం తెప్పించాయి.

45
మంగమ్మ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్

మంగమ్మగారి మనవడు సినిమాలో పల్లెటూరి జమిందారు మంగమ్మ పాత్ర ఆమెది. ప్రతీ సీన్ కు ఏదో ఒక నాటు సామెత చెప్పేలా భానుమతి పాత్రను రూపొందించారు కోడి రామకృష్ణ. సహజంగానే కొన్ని నాటు పదాలు వాడాల్సి వచ్చింది. దాంతో అవి నచ్చకపోవడంతో భానుమతి కోపంగా లేచి.. చెడా మడా తిట్టేశార. దాంతో కోడి రామకృష్ణ స్పందించి.. అమ్మా.. మీకు నచ్చకపోతే.. డైలాగ్స్ మార్చేద్దాం.. అని భానుమతితో అన్నారట. ఇక భానుమతి కూల్ అయ్యి.. సినిమాకు సైన్ చేశారు. ఇక షూటింగ్ టైమ్ కు ఆ డైలాగ్స్ మార్చకుండానే భానుమతికి ఇచ్చాడు. షూటింగ్ లో చుట్టు పెద్ద ఎత్తున జనాలు ఉన్నారు. అప్పుడు ఆమె చెప్పిన ఫస్ట్ డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో భానుమతి చాలా సంతోషించారు.

55
కోడి రామకృష్ణను అభినందించిన భానుమతి...

అప్పుడు రామకృష్ణను ఉద్దేశించి భానుమతి ఇలా అన్నారు... '' అబ్బాయి.. వాళ్లేంటి అంతలా చప్పట్లు కొడుతున్నారు.. ఈ డైలాగ్ అంత బాగా వచ్చిందా'' అని అడిగారు. అప్పుడు కోడి రామకృష్ణ స్పందిస్తూ..'' నేను మారుస్తా అన్న డైలాగ్ మార్చలేదమ్మా.. ఆ డైలాగే మీరు చెప్పారు.. అది వాళ్లకు నచ్చింది. మంచి రెస్పాన్స్ వచ్చింది'' అని అన్నారు కోడి. దాంతో భానుమతి అప్పుడు రియలైజ్ అయ్యారు. మంగమ్మగారి మనవడు సినిమాలో భానుమతి పాత్ర ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఆమె డైలాగ్స్ లో పదును.. ఆడియన్స్ ను అలరించింది. హుందాతనంతో కూడిన కామెడీ పాత్ర మంగమ్మ. ఈ క్యారెక్టర్ లో భానుమతిని తప్పించి ఇంకెవరీని ఊహించుకోలేరు ఆడియన్స్.

Read more Photos on
click me!

Recommended Stories