బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న రియాల్టీ షోలో బిగ్ బాస్. గత 9 సంవత్సరాలుగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం సీజన్ 9 నడుస్తోంది. ఈ సీజన్ కూడా మరో రెండు వారాల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు ఉన్నారు. వారిలో ఈ వీక్ ఇద్దరు ఎలిమేట్ అవుతారని, మిగిలిన ఐదుగురు టాప్-5 కి వెళ్తారని తెలుస్తోంది.
అయితే... ఈ వీకెండ్ లో ఒకేసారి ఇద్దరిని ఎలిమినేట్ చేయకుండా.. మిడ్ వీక్ లోనే ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. టికెట్ టూ ఫినేల్ లో గెలిచి ఇప్పటికే కళ్యాణ్ ఫైనల్స్ కి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ‘ఇది ఫెయిర్ కాదు’ అనే థీమ్ లో టీమ్ కి కొన్ని గేమ్స్ పెట్టి ఆడిస్తున్నారు. ఈ గేమ్ లో గెలిచిన వారు సెకండ్ ఫైనలిస్ట్ గా సెలక్ట్ అవుతారు. ప్రస్తుతం లీడర్ బోర్డ్ లో చివరలో ఉన్న సుమన్ ఇప్పటికే ఈ రేసు నుంచి అవుట్ అయ్యాడు. మిగిలిన వాళ్లు పోటీ పడుతున్నారు.