
కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో గుడికి వెళ్లడానికి రెడీ అవుతుంటారు కావేరి, స్వప్న. శ్రీధర్ వచ్చి రెడీనా అని అడిగి.. పదండి వెళ్తాం అంటాడు. ముందు మీరు వెళ్లండి. వెనకాల మేము వస్తాము అంటుంది కావేరి. అదేంటీ అని అడుగుతాడు శ్రీధర్. ముగ్గురు కలిసి ఒకేసారి వెళ్లకూడదు అంటుంది కావేరి. ఎందుకు అంటాడు శ్రీధర్. చెప్పిన మీకు అర్థం కాదు అంటుంది కావేరి. నువ్వు చెప్పింది అర్థం చేసుకునే స్థాయిలో నేను లేనా అంటాడు శ్రీధర్. అయ్యో మీకు చెప్పే స్థాయిలో నేనే లేను. ఎందుకు అలా చెప్తారో నాకు తెలియదు. పెద్దవాళ్లు చెప్తారు. పాటిస్తే ఏం పోయింది అంటుంది కావేరి. సరే అని బయటకు వెళ్తారు.
శ్రీధర్ డ్రైవింగ్ సీట్లో కూర్చోకుండా పక్కన సీట్లో కూర్చొంటాడు. మా ఇద్దరికీ డ్రైవింగ్ రాదు కదా నాన్న. నువ్వు అక్కడ కూర్చున్నావేంటి అని అడుగుతుంది స్వప్న. అందుకే కొత్త డ్రైవర్ ని పెట్టాను. మీరు బయటకు వెళ్లాలన్నా ఇకపై తనే తీసుకెళ్తాడు అని కాశీని పిలుస్తాడు శ్రీధర్. షాక్ అవుతారు స్వప్న, కావేరి. అల్లుడు గారు డ్రైవర్ ఏంటి అని అడుగుతుంది కావేరి. తప్పేముంది, జీతం ఇస్తాను అని చెప్పాను ఒప్పుకున్నాడు అంటాడు శ్రీధర్. స్వప్న కోపంగా కారు దిగి నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు నాన్న. నువ్వు నీ కూతురిని, అల్లుడిని కలపాలని కోరుకుంటున్నావు, అది ఎప్పటికీ జరగదు. కాశీని డ్రైవర్ గా పెట్టుకోవడమే మీ నిర్ణయం అయితే.. ఈ ఇంట్లో ఇదే నా ఆఖరి రోజు అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న.
మరోవైపు డాక్టర్ కి థాంక్యూ చెప్తారు దీప, కార్తీక్. ఏదో ఆవేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు కానీ.. నిజంగానే మీరు మీ బిడ్డను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతుంది డాక్టర్. ఉన్నాను డాక్టర్. మా అమ్మ కోసం నా బిడ్డనే కాదు.. నా ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధమే అంటుంది దీప. ఎందుకు దీప, వాళ్లు నీకు ఏం ఇచ్చారు. నువ్వు వాళ్ల దగ్గర పెరగలేదు, వాళ్ల ప్రేమ నీకు దక్కలేదు. నువ్వు ఎందుకు ఇంత త్యాగం చేస్తున్నావు అంటుంది డాక్టర్. నాకు జన్మనిచ్చారు అది చాలు డాక్టర్. నేను నా తల్లి రుణం తీర్చుకోవడానికి అంటుంది దీప. నువ్వు ఎంత మంచిదానివి దీప. నీలాంటి కూతురిని నేను ఎక్కడా చూడలేదు. నీ కోసం నేను ఈ సహాయం తప్పకుండా చేస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది డాక్టర్.
మరోవైపు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటారు జ్యోత్స్న, పారు. నేనే నా చేతులారా నా మనుమరాలిని దూరం చేసుకున్నాన అని బాధపడుతుంది పారిజాతం. అరేయ్ సైదులు నిన్ను చంపాను అని నాకు ఎక్కడో కాస్త బాధ ఉండేది. కానీ నిన్ను చంపడంలో తప్పే లేదురా.. నువ్వు నా మనుమరాలినే దూరం చేస్తావా.. అమ్మ కళ్యాణి నన్ను క్షమించు అంటుంది పారు.
గ్రానీ డాక్టర్ చెప్పింది నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతుంది జ్యోత్స్న. నమ్మకపోవడానికి ఏముంది. నువ్వు నిజంగా సుమిత్ర, దశరథల కూతురివే. నేనే వెర్రిదాన్ని. నా మనుమరాలు అనుకోని ఏవేవో చేశాను నీకోసం అంటుంది పారు. గ్రానీ అది కాదు అంటుంది జ్యోత్స్న. నాకు ఏం చెప్పకు, నువ్వు నన్ను గ్రానీ అని పిలవకు అంటుంది పారు. నా వేలితో నా కన్నే పొడుచుకున్నాను అని బాధ పడుతుంది పారు.
పారు మాటలు విని ఆలోచనల్లో పడుతుంది జ్యోత్స్న. శాంపిల్స్ మ్యాచ్ కావడం ఏంటి? డాక్టర్ అబద్ధం చెప్పిందా? బావకు నిజాలు అన్నీ తెలిసి, డాక్టర్ తో నాటకం ఆడిస్తున్నాడా? అయినా బావకు నిజాలు తెలిస్తే డైరెక్ట్ గా చెప్పేస్తాడు. ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి? బావ, దీప ఏదో దాస్తున్నారు. నా వెనకాల ఏదో జరుగుతోంది తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
మరోవైపు కార్తీక్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావు బావ అంటుంది దీప. పిల్లల్ని మార్చింది ఎవరు అని అడుగుతాడు కార్తీక్. పారిజాతం గారు అంటుంది దీప. మరి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయంటే పారుకి ఎలా ఉంటుంది అని అడుగుతాడు కార్తీక్. షాక్ అవుతుంది అంటుంది దీప. పారుకే అలా ఉంటే మన పెద్దమేడం జ్యోత్స్న ఏం ఆలోచిస్తూ ఉంటుంది. మామయ్య కూడా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అంటే నమ్మడు అని అంటాడు కార్తీక్. మామయ్యకు కూతురిపై డౌట్ ఉంది. కానీ భార్య చనిపోతుందన్న భయంలో కూతురిని వదిలేశాడు. లేకపోతే ఎప్పుడో నిలదీసి అడుగు అంటాడు కార్తీక్. నిలదీసి అడుగుతాడు కానీ.. కూతురు కాదని మాత్రం అనుకోడు కదా అంటుంది దీప. కార్తీక్ దీప కడుపువైపు కన్నీళ్లు పెట్టుకుంటాడు కార్తీక్. ఈ ప్రాణాన్ని నా తల్లిలో చూసుకుందాం బావ అని కార్తీక్ కన్నీళ్లు తుడుస్తుంది దీప.
ఇంతలో దీప.. స్వీట్స్ తీసుకొని రా అని పిలుస్తుంది సుమిత్ర. తీసుకెళ్లిన స్వీట్స్ దీపకు తినిపిస్తుంది సుమిత్ర. మీకు ఏం కాదు అని ఇప్పటికైనా నమ్ముతారా అంటుంది దీప. నా కూతురు నా ఉండగా నాకు ఏం కాదు అని జ్యోత్స్న వైపు చూస్తుంది సుమిత్ర. డాక్టర్ ఏదో చెప్పింది కానీ.. జ్యోత్స్న ముఖంలో కొంచెం కూడా సంతోషం లేదు. భయమే ఉంది. శాంపిల్స్ నిజంగానే మ్యాచ్ అయ్యాయా? అని మనసులో అనుకుంటాడు దశరథ.
ఏంటి పారిజాతం అలా ఉన్నావు అని అడుగుతాడు శివన్నారాయణ. సుమిత్ర ఆరోగ్యం బాగుండాలని 10 శుక్రవారాలు పూజ చేస్తానని మొక్కుకున్నాను. ఎప్పటినుంచి మొదలుపెట్టాలా అని ఆలోచిస్తున్నాను అంటుంది పారిజాతం. రెండోసారి శాంపిల్స్ మ్యాచ్ కావాలని మొక్కుకున్నావా పారు అంటాడు కార్తీక్. అవునురా అంటుంది పారు. రెండోసారి కూడా మ్యాచ్ కావని నీకెలా తెలుసు పారు అంటాడు కార్తీక్. షాక్ అవుతుంది పారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.