Gunde Ninda Gudi Gantalu: బాలు ఫ్రెండ్ రాజేష్ కి అనుకోని కష్టం వస్తుంది. ఆ కష్టం తీర్చడానికి గది కట్టుకోవడానికి దాచుకున్న డబ్బు ఇద్దామని బాలు అంటే.. మీనా ఒప్పుకోదు. ప్రభావతి చిచ్చు పెడుతుంది. నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో మీకోసం...
బాలు ట్రిప్ కి వెళ్లడానికి వెళతాడు. అక్కడ రాజేష్ బాగా తాగేసి పడిపోయి ఉంటాడు. రాజేష్ ని లేపడానికి బాలు ప్రయత్నిస్తాడు. అయితే.. రాజేష్ తాగిన మత్తులో ఏదేదో మాట్లాడతాడు. డబ్బు లేకపోతే బతకడం వేస్ట్ అన్నట్లుగా మాట్లాడతాడు. అయితే.. బాలు నీళ్లు కొట్టి మరీ..రాజేష్ ని లేపుతాడు.అయినా మత్తు వదలకపోతే.. లాగి పెట్టి ఒక్కటి పీకుతాడు. ఎందుకు తాగావ్ అని అడిగితే.. కాసేపు ఏదేదో మాట్లాడి తర్వాత.. విషయానికి వస్తాడు. ‘ మా పెదనాన్న షష్ఠిపూర్తి చాలా గ్రాండ్ గా చేశారు.. ఇప్పుడు మా నాన్న షష్ఠి పూర్తి వచ్చింది.. గ్రాండ్ గా చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు.. మన లాంటి డ్రైవర్లకు ఆశ పుట్టినంత ఈజీగా డబ్బు పుట్టదు.. చాలా మందిని అడిగినా.. ఎవరూ ఇవ్వలేదు.. చిన్నప్పటి నుంచి మా నాన్న చాలా కష్టపడి పెంచాడు.. ఆయనకు గుర్తిండేలా ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను.. కానీ చేయలేకపోతున్నాను. నగలు కూడా బ్యాంకులోనే ఉన్నాయి..’ అని రాజేష్ తన బాధ మొత్తం చెబుతాడు. అది విన్న బాలు గుండె కరిగిపోతుంది. దీంతో.. ఫంక్షన్ కి డబ్బులు తాను ఇస్తాను అని చెబుతాడు. ఫంక్షన్ సరిగా జరిగేలా చూసే బాధ్యత తనదే అంటూ బాలు మాట ఇస్తాడు.
24
మనోజ్ దగ్గరకు బకాసురుడు..
రోహిణీ, మనోజ్ షోరూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. షోరూమ్ కి బాడీ గార్డు సరిగా దొరకడం లేదు అని మనోజ్ ఫీలౌతూ ఉంటే.. రోహిణీ సలహాలు ఇస్తుంది. సరిగ్గా అదే సమయానికి ఒక వ్యక్తి జాబ్ కోసం వస్తాడు. అతను మనోజ్ కి బాగా నచ్చుతాడు. జీతం పదివేలు ఇస్తాను అని మనోజ్ అంటే... తనకు జీతం మ్యాటర్ కాదని..ఫుడ్ పెడితే చాలు అంటాడు. అయితే.. అతను చెప్పిన మెనూ విని.. మనోజ్, రోహిణీలు నోరు వెళ్లపెడతారు. బకాసురుడు తినే లిస్ట్ చెబుతడు. ఇతనికి ఫుడ్ పెట్టడం కష్టమేమో అని మనోజ్ అంటే.. తిండి పెడితే గొడ్డులా పని చేస్తాడు.. ఇతనే కరెక్ట్ అని రోహిణీ ఒప్పిస్తుంది.
34
బాలుతో మీనా గొడవ..
ఇక.. ఇంట్లో మీనా పని చేసుకుంటూ ఉంటే.. బాలు వచ్చి పిలుస్తాడు.ఏంటి అని మీనా అడిగితే..రాజేష్ కి వచ్చిన కష్టం మొత్తం వివరిస్తాడు. లక్ష ఖర్చు పెట్టి షష్ఠి పూర్తి చేయడం అవసరమా అని మీనా అంటే.. నేను ఇస్తాను అని చెప్పాను బాలు చెబుతాడు. రూమ్ కట్టుకోవడానికి దాచిన డబ్బు ఇద్దాం అని బాలు అంటే.. మీనా ఒప్పుకోదు. ఒప్పించడానికి చాలా ప్రయత్నిస్తుంది. అయితే.. వీళ్ల మాటలు దూరం నుంచి ప్రభావతి వింటుంది. నా స్నేహితుడి కష్టం నేను తీర్చాలని అనుకుంటున్నాను అని బాలు అంటే...దీనినే అపాత్రదానం అంటారని.. చేయవద్దని.. మంచి మాటలతో ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. మీనా ఎంత చెప్పాలని ప్రయత్నించినా బాలు వినడు. వీళ్లిద్దరూ వాదించుకోవడం చూసి.. ప్రభావతి మురిసిపోతుంది. కావాలని.. బాలుని ఈ విషయంలో మరింత రెచ్చ గొట్టాలని అనుకుంటుంది.
బాలు బయటకు వెళ్తుంటే.. ఆపి మరీ మీనా మీద ఎక్కిస్తుంది.‘ నీ పెళ్లాం నీకు ఎంత విలువ ఇచ్చింది? ఎంత మర్యాద ఇచ్చింది?’ అని వెటకారంగా మాట్లాడుతుంది. బయట పులిలా తిరుగుతావ్.. ఇంట్లో సింహంలా తిరుగుతావ్.. పెళ్లాం ముందు చవట దద్దమ్మలా అయిపోతావ్.. మొన్న నీకు ఇష్టం లేకుండా..తమ్ముడు పుట్టిన రోజుకి వెళ్లింది.. ఈ రోజు నీ డబ్బులు నీకే ఇవ్వడం లేదు.. అని చాలా మాటలతో రెచ్చ గొడుతుంది. కానీ.. బాలు ఆ మాటలను పెద్దగా పట్టించుకోకుండా.. మా సమస్య మేం చూసుకుంటాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మీనా దిగులుగా ఉండి పూలు కడుతూ ఉంటుంది.విషయం ఏంటి? అని అని ఆమె ఫ్రెండ్స్ అడిగితే...బాలుతో జరిగిన గొడవ విషయం చెబుతుంది.వాళ్లంతా మీనాకే సపోర్ట్ గా నిలపడతారు. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్.. డబ్బు ఇవ్వవద్దు అని చెబుతారు. ఇక.. బాలు.. రాజేష్ కి డబ్బు ఎలా ఇవ్వాలి అనే విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగప్ లో.. బాలు తన అన్నతమ్ముడితో... మీనా రోహిణీ, శ్రుతి.. ఈ డబ్బుల విషయం గురించే మాట్లాడుతూ ఉంటారు.