Deepthi Manne: కాబోయే వాడిని పరిచయం చేసిన ‘ రాధమ్మ కూతురు’

Published : Oct 15, 2025, 06:11 PM IST

Deepthi Manne: రాధమ్మ కూతురు ఫేమ్ నటి దీప్తి మన్నే త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. తనకు కాబోయే వాడిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. కాబోయే భర్తతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది.

PREV
15
కాబోయే భర్తను పరిచయం చేసిన దీప్తి..

రాధమ్మ కూతరు, జగధాత్రి సీరియల్స్ తో గుర్తింపు పొందిన నటి దీప్తి మన్నె. తన అందం, నటనతో అందరి మనసులు గెలుచుకున్న ఈ బ్యూటీ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం కాబోయే వాడి ఫేస్ కనిపించకుండా ఫోటోలు పెట్టిన ఆమె, రీసెంట్ గా అతని ఫేస్ రివీల్ చేసింది. తన కాబోయే భర్త పేరు రోహన్ అని ఆమె ప్రకటించారు.

25
జీ టీవీ సాక్షిగా..

తెలుగు, కన్నడ సీరియల్స్ లో గుర్తింపు పొందిన దీప్తి ప్రస్తుతం జగధాత్రి అనే సీరియల్ లో నటిస్తున్నారు. జీ టీవీ కుటుంబం సాక్షిగా కూడా ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. దీంతో... జీ టీవీలో పని చేసే ఇతర సీరియల్ నటులంతా కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక స్పెషల్ బహుమతి ఇచ్చి మరీ.. ఆమె వివాహ జీవితం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

35
సోషల్ మీడియాలో...

తాజాగా దీప్తి తన కాబోయే భర్త రాహుల్ తో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ‘ ప్రియమైన రోహన్ , నేను ఎదురుచూస్తున్న వ్యక్తివి నువ్వు. ఆ దేవుడు ఇచ్చిన బహుమతి నువ్వు. నన్ను నీ భాగస్వామిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

45
దీప్తికి తెలుగులో, కన్నడలో చాలా మంది అభిమానులు ఉన్నారు.

దీప్తి మన్నే కన్నడలో పద్మావతి అనే సీరియల్ తో ఎక్కువ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు సీరియల్ జగధాత్రిలో నటిస్తున్నారు. ఎక్కువ గుర్తింపు రాధమ్మ కూతురు సీరియల్ తో నే వచ్చింది. ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. కాబోయే జంట ఫోటో చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

55
కెరీర్ ఎలా మొదలైందంటే...

దీప్తి... బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి డిగ్రీ పూర్తి చేసింది. నటన మీద ఉన్న ఆసక్తితో ఆడిషన్‌లో పాల్గొని తమిళ చిత్రం అవాన్‌లో అరంగేట్రం చేసింది. తరువాత ఆమె కన్నడ చిత్రం 'నమ్మూర్ హైక్లు', తెలుగు చిత్రం 'ఇక్ సే లవ్' , తమిళ చిత్రం 'దేవదాస్ బ్రదర్స్'లలో నటించింది. ఆ తర్వాత దీప్తి టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించి, మొదట పద్మావతి సీరియల్‌లో నటించి, ఆపై తెలుగులో బిజీగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories