Karthika Deepam 2 Latest Episode: మీకు మరో బిడ్డ ఉండాలని దీపను కోరిన అనసూయ- జ్యోను ఇరికించిన పారు

Published : Oct 15, 2025, 07:30 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 15వ తేదీ)లో కార్తీక్ బాబుకు సొంత బిడ్డ ఉండాలన్న అనసూయ. మీ కోరిక కచ్చితంగా నెరవేరుతుందన్న దీప. సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్లడం జ్యోత్స్న చూసిందని నోరు జారిన పారు. జ్యోపై మండిపడ్డ దశరథ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

PREV
17
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్

కార్తీకదీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో ఏంటి పెద్ద నానమ్మ నాకోసం ఏం తేలేదా అంటుంది శౌర్య. ఇదిగో ఈ బిస్కెట్ ప్యాకెట్ నీకోసమే తీసుకో అంటుంది అనసూయ. ఇంతలో స్కూల్ బస్ వచ్చినట్లు సౌండ్ వినిపించగానే శౌర్య వెళ్లిపోతుంది. మాకు కూడా డ్యూటీకి టైం అయింది వెళ్లొస్తాం అని అనసూయ, కాంచనలకు చెప్తాడు కార్తీక్. పద దీప అంటూ బయటకు వెళ్తాడు. నీకోసం కూడా ఒకటి తీసుకొచ్చాను దీప అంటుంది అనసూయ. ఏంటని అడిగితే ఒక పాప బొమ్మ తీసి చేతిలో పెడుతుంది.

నీకు, కార్తీక్ లకు కూడా ఒక పాప ఉండాలి. శౌర్యకు ఆడుకోవడానికి తమ్ముడో, చెల్లో ఉండాలి అని చెబుతుంది. అందుకు దీప మీ కోరిక కచ్చితంగా నెరవేరుతుందని చెప్పి ఆ బొమ్మను కాంచన చేతికి ఇచ్చి బయటకు వెళ్తుంది. దీప ఆ మాట చెప్పడంతో అనసూయ, కాంచనలతో పాటు వారి మాటలు చాటుగా వింటున్నకార్తీక్ కూడా సంతోషిస్తాడు.

27
సిగ్గు పడిన దీప

నవ్వుకుంటూ బయటకు వెళ్లిన దీపను చూసి.. ఏంటి మరదలా సిగ్గు పడుతున్నావు అంటాడు కార్తీక్. ఏం లేదని చెప్తుంది దీప. పెద్దమ్మ ఇచ్చిన బొమ్మను మా అమ్మకు ఇచ్చినట్లు ఉన్నావు కదా అంటాడు కార్తీక్. అంతా విన్నావా అంటుంది దీప. వాళ్ల ఆనందాన్ని చూశాను కూడా అంటాడు కార్తీక్. మన వాళ్ల ఆశలు, కోరికలు మనమే తీర్చాలి కదా అంటుంది దీప. ఇప్పుడు నాకు సిగ్గేస్తుంది అంటాడు కార్తీక్. సిగ్గు పడింది చాలు కానీ అమ్మ, నాన్నలను ఎలా కలపాలో సలహా ఇవ్వు అంటుంది దీప. తాత సాయంతో ఎలాగో అలా మీ అమ్మనాన్నలను కలుపుదాం అని చెప్తాడు కార్తీక్. 

37
కాశీకి ఉద్యోగం

కాశీ ఎటు వెళ్లాడు అని స్వప్నను అడుగుతాడు శ్రీధర్. ఉదయాన్నే ఎటో వెళ్లాడు అని చెబుతుంది స్వప్న. భర్త ఎటువెళ్లాడో తెలుసుకోలేవా? వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగవా అంటాడు శ్రీధర్. నేనేదో కావాలని కాశీతో గొడవ పడినట్లు అంటావేంటి డాడీ అంటుంది స్వప్న. సరే నేనే కనుక్కుంటాలే అంటాడు శ్రీధర్. అంతలో అక్కడికి వస్తాడు కాశీ. నిన్ను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్లినట్లు అనిపిస్తోంది. నీకు సాయంత్రం వరకు టైం ఉందిలే అంటాడు శ్రీధర్. కాశీ తన చేతిలోని కవర్ శ్రీధర్ కి ఇస్తాడు. దాన్ని ఓపెన్ చేసిన శ్రీధర్ కాశీకి జాబ్ వచ్చిందని చెబుతాడు. దానికి అంతా సంతోషిస్తారు. కాశీని పొగుడుతారు. కానీ నాకు జాబ్ రాగానే మీ పలకరింపు మారిపోయింది అన్నట్లుగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కాశీ. 

47
కార్తీక్ పై మండిపడ్డ పారు

ఎంత పని చేశావు దశరథ. నువ్వన్న మాటలకు సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అంటుంది పారు. ఇంతలో అక్కడికి చేరుకుంటారు దీప, కార్తీక్. ఏమైంది అని అడుగుతారు. మీ వల్లే ఇదంతా. నిన్న తిరిగి వచ్చి మరీ గొడవ పెట్టావు కదా.. సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అంటుంది పారు. రాత్రి గదిలో పడుకుంది. తెల్లవారిన బయటకు రాకపోయేసరికి అనుమానం వచ్చి గదిలోకి వెళ్లిచూస్తే సుమిత్ర లేదు అని చెబుతుంది. ఫోన్ చెద్దామనుకుంటే ఆవిడ మొబైల్ ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్లిపోయిందో.. ఎక్కడ వెతకాలో తెలియదు అంటుంది పారు.

వెతకడానికంటే ముందు మనం ఒక పనిచేయాలి తాత అంటుంది జ్యోత్స్న. ఏంటది అని అడుగుతాడు శివన్నారాయణ. మమ్మీ కనిపించడంలేదని పోలీస్ కంప్లెయింట్ ఇద్దాం అంటుంది. బుద్దుందా నీకు అంటాడు శివన్నారాయణ. ఇంతకంటే మంచి ఆలోచన రాలేదా నీకు అంటాడు దశరథ. పోలీస్ కంప్లెయింట్ ఇస్తే వారు ఏమైందని అడుగుతారు. అప్పుడు గొడవ గురించి చెప్పాలి. కారణం ఎవరు అంటారు అప్పుడు నీ పేరు చెప్పాలి అంటాడు దశరథ. శివన్నారాయణ కోడలు కనిపించడం లేదు అంటే మన పరువు మిగులుతుందా అంటాడు శివన్నారాయణ. అవేవి తనకు అవసరం లేదు అంటాడు కార్తీక్.

57
పారుపై అరిచిన దీప

నాకు భయంగా ఉందండి అంటుంది పారు. అంత బాధతో బయటకు వెళ్లిన సుమిత్ర ఏ నుయ్యో, గొయ్యో చూసుకొని ఉంటుందని అంటుంది. అందుకు దీపతో పాటు అందరూ పారిజాతం మీద అరుస్తారు. అంత పెద్ద గొడవ జరిగాక సుమిత్ర అమ్మ బాధపడుతుందని మీకు తెలియదా? ఓదారుస్తూ తన దగ్గరే ఉండాలని మీకు తెలియదా అని పారును అంటుంది దీప. తనకు అలాంటివి ఏం తెలియదులే అమ్మ అంటాడు శివన్నారాయణ. బావ మనం సుమిత్ర అమ్మను వెతకడానికి వెళ్దాం అంటుంది దీప.

67
నోరుజారిన పారు

చూశావే జ్యోత్న్న. ఇప్పుడు అందరూ మనల్నే అంటున్నారు. నువ్వు రాత్రే మీ అమ్మ వెళ్లకుండా ఆపుంటే ఈ గొడవంతా జరిగేదా అని నోరు జారుతుంది. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు. అంటే అత్త వెళ్లడం నీకు తెలుసా అని పారును అడుగుతాడు కార్తీక్. ఈ గ్రానీ నన్ను ఇరికించేలా ఉందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. రాత్రి ఎవరో బయటకు వెెళ్లినట్లు ఉందని జ్యోత్న్స చెప్పింది. నేనైతే చూడలేదు. ఉదయం సుమిత్ర ఇంట్లో లేదని తెలిశాకే వెళ్లింది సుమిత్ర అని అర్థమైంది అంటుంది పారు. ఆ మాటకు కోపంతో చేయి పైకెత్తుతాడు శివన్నారాయణ.

మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం నువ్వు చూశావా అని జ్యోను అడుగుతాడు దశరథ. తను అనుకోలేదని చెబుతుంది జ్యో. నీకు ఆ మాత్రం కనిపించలేదా అంటుంది దీప. తల్లి నీడను కూడా బిడ్డ గుర్తించగలదు. నువ్వు ఆ మాత్రం పోల్చుకోలేవా అంటుంది దీప. సుమిత్ర కనపడక మేము బాధపడుతుంటే.. నువ్వు వెళ్లిపోతుంటే చూస్తు ఊరుకున్నావా అని కోపంగా అంటాడు దశరథ. తర్వాత సుమిత్రను వెతకడానికి దశరథ, కార్తీక్ లు వెళ్తారు. 

77
హాస్పిటల్ కి వెళ్దాం అన్న శ్రీధర్

మరోవైపు కాంచనా దగ్గరకు వస్తాడు శ్రీధర్. రెడీ అవ్వు హాస్పిటల్ కి వెళ్తాం. నువ్వు జనరల్ చెకప్ చేయించుకొని చాలా రోజులు అవుతోంది అంటాడు. బాగానే ఉన్నాను కదా అంటుంది కాంచన. ఈలోపు శ్రీధర్ కి కార్తీక్ ఫోన్ చేస్తాడు. సుమిత్ర అత్త మీ ఇంటికి వచ్చినా, చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించినా ఫోన్ చేయమని చెప్తాడు తండ్రికి. ఏమైందని అడిగితే తర్వాత చెప్తాను అంటాడు. నేను మామయ్య అత్తకోసం వెతుకుతున్నామని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఏమైందండి అని శ్రీధర్ ని అడుగుతుంది కాంచన. సుమిత్ర కనిపించడం లేదటా అని శ్రీధర్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories