Illu Illalu Pillalu Today డిసెంబర్ 06 ఎపిసోడ్ : రామరాజు గ్రీన్ సిగ్నల్.. వల్లికి ఉద్యోగం తిప్పలు, ఇరికించిన నర్మద, ప్రేమ

Published : Dec 06, 2025, 09:28 AM IST

Illu Illalu Pillalu Today డిసెంబర్ 06 ఎపిసోడ్ : వల్లి ప్రతి విషయంలో తమను ఇబ్బంది పెడుతోందని.. తనని కూడా ఉద్యోగానికి పంపితే మారుతుందని ఆలోచించి.. అత్త, మామల ముందు వల్లిని ఇరికించాలని ప్రేమ, నర్మద అనుకుంటారు. మరి, టీవీలో కంటే ముందుగా మీకోసం.. 

PREV
16
ఇల్లు, ఇల్లాలు, పిల్లలు

Illu Illalu Pillalu Today డిసెంబర్ 06 ఎపిసోడ్ : రామ రాజు కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. నెమ్మదిగా ప్రేమ.. వల్లిని కదిలిస్తుంది. ‘అక్కా నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదవావు కదా, మరి ఉద్యోగం చేయాలని లేదా?’ అని అడుగుతుంది. దానికి వల్లి... ఈ కుటుంబం కోసం ఉద్యోగం చేయాలనే కోరికను చంపుకుంటున్నానని... తాను లేకుండా అత్తయ్యగారికి ఈ పనులన్నీ చేయడం కష్టం అని చెబుతుంది. వెంటనే... ప్రేమ, నర్మదలు వేదవతిని రెచ్చగొడతారు. ఇదంతా నిన్న ఎపిసోడ్ లో జరగగా.. ఈ రోజు ఎసిపోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

‘ అంటే అత్తయ్య గారు ఇంటి పనులు చేసుకోలేరు కాబట్టి.. నువ్వు ఇంట్లో ఉంటున్నావ్...లేకపోతే నువ్వు కూడా ఉద్యోగం చేసేదానివే అన్నమాట’ అని నర్మద అంటుంది. ‘ అన్నమాటేంటి? ఉన్నమాటే... కేవలం అత్తయ్యగారికి సాయంగా ఉండటం కోసమే, ఉద్యోగం చేయాలనే నా కోరికను త్యాగం చేసేశాను. లేకుంటే నీకన్నా పెద్ద ఉద్యోగం చేసేదాన్ని తెలుసా?’ అంటూ వల్లి సమాధానం ఇస్తుంది.

‘ వెళ్లమ్మా..! రేపటి నుంచి నువ్వు కూడా ఉద్యోగానికి వెళ్లు’ అని వేదవతి అనగానే వల్లి షాక్ అవుతుంది. ప్రేమ, నర్మద సంతోషపడతారు. ‘ ఎగ్ వచ్చి కోడిని ఎక్కిరించినట్లు.. నువ్వు లేకపోతే నేను ఇంటి పనులు చేసుకోలేను అని ఎంత బాగా అంటున్నావో.. నువ్వు లేకపోతే ఇంట్లో పనులు చేసుకోవడం రాకుండానే ఐదుగురు పిల్లలను పెంచి పెద్దవాళ్లను చేశానా?’ అని వేదవతి అడుగుతుంది. నా ఉద్దేశం అది కాదండి అత్తయ్యగారు అని వల్లి ఏదో చెప్పాలని ప్రయత్నించినా వినకుండా వేదవతి మాట్లాడుతూనే ఉంటుంది. ‘ తాను కూయకపోతే తెల్లవారదు అనుకుంది అంట ఓ కోడి. నువ్వు లేకపోతే నేను పనులు చేసుకోకపోవడం కూడా ఇలానే ఉంది.అందుకని, నువ్వు ఉద్యోగానికి వెళ్లు.. నేను ఇంటి పనులు చేసుకోగలను అని చూపిస్తాను’అని వేదవతి అంటుంది.

26
వల్లికి షాక్...

వెంటనే ప్రేమ.. ‘ అత్తయ్య ఒకే అన్నారు కదా అక్క.. ఎంచక్కా నువ్వు జాబ్ చేసేయ్’ అంటుంది. ‘ నువ్వు లేకపోయినా బ్రహ్మాండంగా ఇంటి పనులు చేసుకోగలను అని అత్తయ్య గారు అంటున్నారు.. అందుకని.. నువ్వు జాబ్ చేయాలనే నీ కళను చంపుకోనక్కర్లేదు. మంచి జాబ్ వెతుక్కోని వెళ్లు’ అని నర్మద చెబుతుంది. దానికి వల్లి బిత్తరపోతుంది.

‘ ఏంటి వెళ్లేది? నువ్వు ఆఫీస్ కి, ప్రేమ కాలేజీకి వెళ్తారు? నేను కూడా ఆఫీస్ కి వెళ్తే ఇంటి పనులన్నీ ఎవరు చూసుకుంటారంట?’ అని వల్లి అడిగితే... ‘ నేను చూసుకుంటానంట’ అని బదులిస్తుంది. ఈ మాటలకు వల్లి కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతుంది. ఇలా ఇరికించారు ఏంటి? అని లోలోపలే ఏడుస్తుంది.

ఈలోగా.. రామరాజు పెద్ద కొడుకు( వల్లి భర్త) మాట్లాడటం మొదలుపెడతాడు. ‘ నేను కూడా నీకు ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్నాను. ఎంఏ చదివి ఖాళీగా ఉండటం ఎందుకు? చదువుకు తగ్గ మంచి ఉద్యోగం చేయ’మని సలహా ఇస్తాడు. ధీరజ్ కూడా వాళ్ల అన్నకు వంత పాడతాడు. ఈ జనరేషన్ లో అందరు అమ్మాయిలు జాబ్ చేసి.. తమ కళలను నిజం చేసుకుంటున్నారని.. నువ్వు కూడా జాబ్ చేసి కళ నిజం చేసుకోమని ధీరజ్ చెప్పగా.. సాగర్ కూడా ఉద్యోగం చేస్తేనే చదువుకు విలువ అని అంటాడు. అందరూ ఇలా సలహాలు ఇస్తుంటే.. వల్లి బడే ఇబ్బంది భలే కామేడీగా ఉంటుంది.

36
రామరాజు గ్రీన్ సిగ్నల్..

‘ ఇంటి కోడలు ఉద్యోగం చేయడం మామయ్యగారికి నచ్చదు కాబట్టి.. మామయ్యగారి వైపు నుంచి నరుక్కుంటూ వచ్చి.. ఇంకోసారి జాబ్ అనే మాట వీళ్ల నోటి వెంట రాకుండా చేయాలి ’ అని వల్లి ప్లాన్ వేస్తుంది. ‘ సభ్యులు ఎంత మంది తీర్మానం వేసినా, ఆమోదం వేయాల్సింది జడ్జిలాంటి మామయ్యగారు. ఇంటి కోడలు ఉద్యోగం చేస్తానంటే మామయ్యగారు అస్సలు ఊరుకోరు, ఒప్పుకోరు. మామయ్యగారిని ఒక్క మాట చెప్పమనండి.. వల్లి నువ్వు ఉద్యోగానికి వెళ్లమని, తెల్లారేసరికి ఉద్యోగానికి వెళ్లకపోతే అప్పుడు అడగండి’ అని వల్లి తెలివిగా మాట్లాడుతుంది. దానికి ఇంట్లో అందరూ షాక్ అయ్యి.. రామరాజు ఏమని సమాధానం చెబుతాడా అని చూస్తారు.

ఈ లోగా వల్లి‘ మామయ్యగారు దేవుడు లాంటి మీ మాటే నాకు వేద వాక్కు. మీరు చెప్పండి.. నన్ను జాబ్ కి వెళ్లమంటారా? చెప్పండి.. మీరు చెబితే ఒక్క క్షణం కూడా ఆలోచించుకుండా వెళ్లిపోతాను’ అని అడుగుతుంది. వెంటనే రామరాజు ‘ వెళ్లమ్మా’ అని చెప్పడంతో అందరూ ఆనందపడతారు. వల్లి మాత్రం షాక్ అవుతుంది.

‘నీకు ఉద్యోగం చేయాలనే ఇష్టం ఉన్నప్పుడు నేను ఎందుకు కాదంటానమ్మా?’ అని రామరాజు చెబుతాడు. ‘ ఆ రోజు ప్రేమ ట్యూషన్ చెబితే, ఇంటి కోడలు ఉద్యోగం చేయకూడదు అన్నారు కదా’ అని వల్లి అడిగితే.... ‘ చదువుకుంటూ ఉద్యోగం చేయద్దని చెప్పాను. ప్రేమను వద్దు అనడానికి కారణాలు ఉన్నాయి కానీ, నీ ఇష్టప్రకారం, నీకు నచ్చిన పని చేసుకోమ్మా’అని రామరాజు చెప్పడంతో వల్లికి దిమ్మతిరిగిపోతుంది.

‘ అక్కా.. నువ్వు జాబ్ చేయడానికి మామయ్య గారు ఆమోద ముద్ర వేశారు. రేపు ఒకసారి నీ సర్టిఫికేట్ తీసుకొని రా.. మంచి ఉద్యోగానికి అప్లై చేద్దాం’ అని ప్రేమ చెబుతుంది. సరే అని వల్లి మెలికలు తిరుగుతుంది. తన పరిస్థితి ఇలా అయ్యిందేంటి రా దేవుడా అని వల్లి బాధపడుతుంది.

46
బాధలో నర్మద..

సీన్ కట్ చేస్తే... నర్మద నిద్రపోతూ ఉంటుంది. ఉరుముల శబ్దానికి ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది. చూస్తే పక్కన సాగర్ ఉండడు. ఈ సమయంలో సాగర్ ఎక్కడికి వెళ్లాడు అని వెతుకుతూ ఉంటుంది. సాగర్.. బయట వర్షంలో తడుస్తూ కూర్చొని కనపడతాడు. తనకు ప్రభుత్వ ఉద్యోగం రాదు అని ఫీలౌతూ ఉంటాడు. నర్మద సాగర్ ని అలా చూసి షాకౌతుంది. వెంటనే.. సాగర్ దగ్గరకు వెళ్లి... వర్షం పడుతుందని బలవంతంగా లోపలికి తీసుకొని వస్తుంది. సాగర్ తల తుడిచి ఏమైందని అడగుతుంది. సాగర్ మాత్రం ఏమీ చెప్పడు. కానీ నర్మద వదిలిపెట్టకుండా.. ఏమైందో చెప్పమని బలవంత పెడుతుంది. తర్వాత.. తన గురించి బాధపడొద్దని.. తాను సంతోషంగా ఉన్నానని నర్మద నచ్చచెప్పాలని చూస్తుంది. కానీ.. సాగర్ మాత్రం.. నీకు ఇచ్చిన మాట తప్పానని.. తాను అసమర్థపు భర్త అంటూ తెగ ఫీలౌపోతాడు. దీంతో.. నర్మద చాలా మోటివేట్ చేస్తుంది.

56
భాగ్యం మరో ప్లాన్..

మరుసటి రోజు వల్లి... తన పుట్టింటికి వెళ్తుంది.. ఒక పెద్ద ఐస్ గడ్డపై తల్లి, దండ్రులను నిలపెట్టి.. శిక్షిస్తుంది. వాళ్లు.. దాని మీద నిలబడలేక తిప్పలు పడుతూ ఉంటారు. ‘ మీరు నాకు చేసిందానికి.. అపరిచితుడు మూవీలోని శిక్షలు అన్నీ వేయాలి.. టైమ్ లేక వీటితో ఆపుతున్నాను’ అని వల్లి చెబుతుంది. ‘ నా తెలివితేటలు అన్నీ వాడి..గొప్పింటి కోడలిని చేశాను.. అలాంటి నాకు ఇలాంటి శిక్ష వేస్తావా’ అని భాగ్యం అడిగితే... తన బాధ మొత్తం వల్లి బయటపడుతుంది. తన చదువు గురించి బయటపడేలా ఉందని.. ఒక్క పూట కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని చెబుతుంది. ప్రేమ, నర్మద ఇద్దరూ కలిసి తనను ఉద్యోగానికి వెళ్లమని చెబుతున్నారని.. మామయ్యగారు ఒకే చెప్పారు అని చెబుతుంది. ఈ ప్లాన్ ని ఎలా తిప్పి కొట్టాలా అని భాగ్యం ఆలోచిస్తుంది. తాను ఈ సమస్యను పోగొడతాను అని చెబుతుంది.

66
ప్రేమకు ధీరజ్ బహుమతి...

మరోవైపు ప్రేమ కోసం ధీరజ్ ఓ బహుమతి తెస్తాడు. ప్రేమ చదువుకుంటూ ఉంటే... వచ్చి ఆ బహుమతి ఇస్తాడు. వెంటనే ఇవ్వకుండా కాసేపు మాటలదో వేధిస్తాడు. కోపంతో ప్రేమ.. కొడుతుంది. తర్వాత గిఫ్ట్ ఇస్తాడు. ఏంటా అని చూస్తే... అందులో పోలీస్ డ్రెస్ ఉంటుంది. ధీరజ్ కోసం.. ప్రేమ ఆ డ్రెస్ వేసుకుంటుంది.. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories