కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 5వ తేదీ)లో మా బావ ఎక్కుడుంటే నేను అక్కడే ఉంటానన్న దీప. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదన్న జ్యో. దీపను అపార్థం చేసుకున్న కాంచన. అత్త, కోడలి మధ్య దూరం పెంచుతున్న పారు మాటలు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో నువ్వు రేపటి నుంచి మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు దీప అంటాడు దశరథ. నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అంటుంది సుమిత్ర. నీకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇస్తాము. అప్పుడప్పుడు మేము వస్తుంటాం. నువ్వు చక్కగా రెస్ట్ తీసుకో అని చెప్తుంది సుమిత్ర.
కావాలంటే నీ పనులు చూసుకోవడానికి పని మనిషిని పెడతాను. నీ ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను అంటాడు శివన్నారాయణ. పనిమనిషికి ఇంకో పనిమనిషట అని నవ్వుకుంటారు పారు, జ్యోత్స్న. దీపను మన ఇంటికి వచ్చేలా చేయి గ్రానీ అంటుంది జ్యోత్స్న. ఛీ కొడతారు అంటుంది పారు. దీప మన ఇంటికి రాకపోతే తన కడుపులో బిడ్డను నేను ఎలా లేకుండా చేయగలను అంటుంది జ్యోత్స్న. నీ నిర్ణయం ఏంటో చెప్పు దీప అంటారు అంతా. సైలెంట్ గా ఉంటుంది దీప.
25
కాశీతో ఆడుకున్న శ్రీధర్
మరోవైపు కాశీతో ఆడుకుంటాడు శ్రీధర్. ఇప్పటికిప్పుడు నా దగ్గర నీకు ఇవ్వగలిగిన ఒకే ఒక జాబ్ ఇది. జాగ్రత్తగా చేసుకుంటే మంచిది అంటాడు శ్రీధర్. ఓకే మామయ్య గారు అంటాడు కాశీ. ఆఫీసులో కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని కచ్చితంగా పాటించాలి. ఆఫీసులో మామయ్య అని పిలువొద్దు అంటాడు శ్రీధర్. ఓకే సార్ అంటాడు కాశీ. నీకు ఇష్టం లేకపోతే జాబ్ వదిలెయ్ కానీ అయిష్టంగా ఇక్కడ ఉండకు అంటాడు శ్రీధర్. స్వప్నను గుర్తుచేసుకొని.. నాకు ఈ జాబ్ చేయడం ఇష్టమే సార్. సంతోషంగా చేస్తాను అంటాడు కాశీ.
35
అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయను
నువ్వు గంటల తరబడి ఆలోచించాల్సిన అవసరం ఏముంది దీప. ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో నీకు ఇంతమంచి బంధువులు, బంధాలు దొరికాయి. నీ ఆరోగ్యం కోసం ఇంతమంది ఆలోచిస్తున్నారు. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పు అంటుంది అనసూయ. నేను మా బావ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అంటుంది దీప. నువ్వు చాలా తెలివైనదానివి దీప. నీతో పాటు బావను కూడా ఇంట్లోనే కూర్చొమంటున్నావా? అంటుంది జ్యోత్స్న. ఎట్టిపరిస్థితుల్లో నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయను అంటుంది.
అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మా బావ మీ ఇంటికి వస్తాడు. తనతో పాటు నేను వస్తాను అంటుంది దీప. అంతా షాక్ అవుతారు. ఈ 9 నెలలు నేనే వేరే డ్రైవర్ ని పెట్టుకుంటాను. నువ్వు కూడా రావాల్సిన అవసరం లేదు కార్తీక్ అంటాడు శివన్నారాయణ. దానికి నేను ఒప్పుకోను అంటుంది జ్యోత్స్న.
నా నిర్ణయం మారదు అని చెప్పి వెళ్లిపోతుంది దీప. అందరూ మొండివాళ్లే. అందరి నిర్ణయం గౌరవించాలి కదా అంటాడు శివన్నారాయణ. నీకు నీ కోడలి కడుపులో ఉన్న బిడ్డపై చాలా ఆశలు ఉన్నాయి. కానీ తనకే లేవనుకుంటా అని కాంచనతో అంటుంది పారు. నేను అన్న మాటలు మనసులో పెట్టుకోకు అంటూనే మరోసారి గుర్తుచేసి వెళ్లిపోతుంది పారు.
55
దీపను తప్పుపట్టిన కాంచన
కాసేపటి తర్వాత భోజనం చేద్దాం రండి అత్తయ్య గారు అనుకుంటూ కాంచన దగ్గరకు వస్తుంది దీప. నన్ను ప్రశాంతంగా భోజనం చేసే పరిస్థితిలో ఉంచావా? నువ్వు అని సీరియస్ అవుతుంది కాంచన. దీపను ఏం అనకమ్మా అంటాడు కార్తీక్. నిన్ను అనాలి. నువ్వు చెప్తే దీప వినదా? భర్తగా తనపై నీకు హక్కు లేదా? అంటుంది కాంచన.
దీప ఏదో మాట్లాడబోతుండగా.. నువ్వు ఇంత అహంకారివని నేను అనుకోలేదు అంటుంది కాంచన. నువ్వు ఒక స్వార్థపరురాలివి. నీకు ఆల్రెడి ఒక బిడ్డ ఉంది కాబట్టి.. నా కొడుకు వారసత్వం ఏమైనా ఏం లేదులే అని ఆలోచిస్తున్నావు. నీ స్వార్థం కోసం ఆ ఇంటికి వెళ్లాలి అనుకుంటున్నావు. నువ్వు బాగుంటే చాలని అనుకుంటున్నావు అంటుంది కాంచన. అనసూయ కూడా కాంచనకే సపోర్ట్ చేస్తుంది.
జ్యోత్స్న, మా పిన్ని కళ్లు మంచివి కావు. జ్యోత్స్నకు భర్త కావాల్సిన వ్యక్తి నీ భర్త అయ్యాడని వాళ్లు కోపంగా ఉన్నారని అంటుంది కాంచన. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.