Gunde Ninda Gudi Gantalu:లక్ష గెలిచిన బాలు, మీనా. చూసి తట్టుకోలేకపోయిన ప్రభావతి, రోహిణీకి కొత్త చిక్కులు

Published : Dec 29, 2025, 10:14 AM IST

 Gunde Ninda Gudi Gantalu: రవి వాళ్ల రెస్టారెంట్ లో కపుల్ కాంటెస్ట్ ఇంకా జరుగుతూనే ఉంది. వాళ్లు పెట్టిన అన్ని పోటీల్లో బాలు, మీనా సూపర్ గా ఆడుతూ వస్తున్నారు. మరి నేటి ఎపిసోడ్ లో విజేత ఎవరో టీవీలో కంటే ముందుగా తెలుసుకుందాం. 

PREV
15
గుండె నిండా గుడి గంటలు..

బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో భాగంగా కొన్ని బ్లాక్స్ ఇచ్చి..వాటితో మీ డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని చెబుతారు. కానీ, భార్యభర్తలు నోరు తెరిచి ఏమీ మాట్లాడకుండా దానిని కట్టాలని జడ్జ్ లు చెబుతారు. దీంతో.. మనోజ్, రోహిణీ.. శ్రుతి, రవిలు దీనిలో ఫెయిల్ అవుతారు. బాలు, మీనా మాత్రం.. ఏమీ మాట్లాడకుండా ఇద్దరూ కలిసి ఒక గదిని కడతారు. ఈ లోగా టైమ్ అయిపోతుంది. సింగిల్ రూమ్ మాత్రమే ఎందుకు కట్టారు అని జడ్జ్ లు అడిగితే... ‘ ఇది మా ఇద్దరి కల సార్. వాళ్లకు లాగా మేము డబ్బున్న వాళ్లం కాదు సర్.. మా ఇంట్లో మాకు ఒక బెడ్రూమ్ కూడా లేదు. అందుకే మా కంటూ మేము చిన్న గది కట్టుకోవాలని అనుకుంటున్నాం.కానీ, మా ఆర్థిక పరిస్థితి వల్ల కుదరడం లేదు. అందుకే.. మేం సంపాదించే దాంట్లో కొంచెం కొంచెం దాచిపెడుతున్నాం. అది కట్టగలిగితే మాకంటూ ఓ చిన్న ప్రపంచం ఉంటుంది. అందుకే ఈ గది కట్టాం’ అని బాలు,మీనా కలిసి సమాధానం చెబుతారు. వాళ్ల మాటలకు జడ్జ్ లు బాగా ఇంప్రెస్ అయిపోతారు.

25
రోహిణీ దగ్గర రహస్యాలు ఉన్నాయా?

విజేతలను ప్రకటించడానికి ముందు ఫైనల్స్ కి చేరిన జంటల గురించి కొన్ని విషయాలు మాట్లాడతామని జడ్జ్ లు చెబుతారు. ముందుగా మనోజ్, రోహిణీల గురించి చెప్పడం మొదలుపెడతారు. ‘చూడండి సర్.. మీరు సమాధానాలు బాగానే చెప్పారు. కానీ, ఆ సమాధానాలు చాలా పాలిష్డ్ గా ఉన్నట్లు అనిపించాయి. మీరు కేవలం ప్రైజ్ మనీ కోసమే ఇలాంటి సమాధానాలు చెప్పారు అనిపించింది’ అని జడ్జ్ అంటే.. ‘ మేం కరెక్ట్ గానే ఉన్నాం.. మీ ప్రశ్నలే సరిగా లేవు’ అంటూ మనోజ్ రివర్స్ అయిపోతాడు. దీంతో జడ్జ్ లు షాక్ అవుతారు. తర్వాత మనోజ్ కి షాకిస్తారు.బ్రేక్ లో వీరు మాట్లాడుకున్న మాటలను వీడియో తీసి దానిని ప్లే చేస్తారు. అది చూసి అందరూ నవ్వేస్తారు.మనోజ్ బుద్ధి బయటపడిందని బాలు సంతోషిస్తే.. అలా చేయకూడదని మీనా చెబుతుంది.

తర్వాత జడ్జ్ ల్లో ఒకరు మహిళా న్యాయమూర్తి కావడంతో ఆమె తన అనుభవాన్ని పంచుకుంటారు. ‘ నేను ఒక ఫ్యామిలీ కోర్టులో జడ్జి ని. ప్రతిరోజూ విడాకుల కోసం వచ్చే చాలా మందిని చూస్తూనే ఉంటాం. భార్యభర్తల మధ్య చిన్న పాటి గొడవలు అయినా రావాలి. ఏ గొడవ జరగకపోతే వారి మధ్య రహస్యాలు ఉన్నాయి అనిపిస్తుంది’ అని ఆమె చెప్పారు. ‘ భార్యభర్తలు గొడవ పడట్లేదంటే వారు ఒకరినొకరు మోసం చేసుకున్నట్లే’ అని మరో జడ్జి చెబుతారు. ఇక.. రవి, శ్రుతి గురించి మాట్లాడుతూ.. ‘ ఇక్కడ రవి, శ్రుతి గొడవ పడటం నేను చూశాను. వీళ్లిద్దరూ ఇంకా టామ్ అండ్ జెర్రీల్లా గొడవ పడుతూనే ఉన్నారు. వీరు ఇంకా భార్యభర్తలు అవ్వలేదనిపిస్తోంది. బహుషా వారిద్దరి మధ్య ఇంకా ప్రేమికులు అనే ఫీలింగ్ ఉంది. కానీ, వీళ్లు కచ్చితంగా మంచి దంపతులు అవుతారు’ అని చెబుతారు. ఆ మాటలకు శ్రుతి చాలా ఆనందం పడుతుంది. వారి తీర్పును ఈ జంట అంగీకరిస్తారు. కానీ, డబ్బులు గెలవలేదని మనోజ్ ఫీల్ అవుతుంటే.. పరువు పోయిందని రోహిణీ ఫీలౌతుంది.

35
ఆనందంలో బాలు, మీనా..

ఇక.. జడ్జ్ లు బాలు, మీనా గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. ‘ మీరు ఇద్దరూ ఆదర్శ దంపతుల్లా అనిపిస్తున్నారు. మీ మాటల్లో నిజాయితీ ఉంది. మీరు చేసే పనిలో స్పష్టత ఉంది. మీరు వేసే ప్రతి అడుగులోనూ అండర్ స్టాండింగ్ ఉంది. ఒక రౌండ్ లో నేను ఈ పని చేయలేకపోతున్నాను అని మీనా అంటే.. బాలు తన శక్తిని తనకు గుర్తు చేశాడు. ప్రతి స్త్రీ తన శక్తి సామర్థ్యాలను ప్రోత్సహించే వ్యక్తిని ఇష్టపడుతుంది. మీనా, మొదటిసారి బాలుని చూసినప్పుడు రౌడీలా కనిపించాడని, తనకు తాగుడు అలవాటు ఉందని.. నిజాయితీగా అన్ని నిజాలు చెప్పారు. ఒక భార్య గా తన జీవితంలోకి వచ్చిన వ్యక్తిని తనకు అనుకూలంగా మార్చుకోవడమే గొప్పతనం. మీనా కోరుకున్న మార్పు.. బాలులో కనపడుతుంది. వీరిద్దరూ జీవితాంతం ఆదర్శంగా ఉండాలి’ అని చెప్పి... బాలు,మీనాలను విజేతలుగా ప్రకటిస్తారు. అది వినగానే.. మనోజ్, రోహిణీ ముఖం మాడిపోతుంది. రవి, శ్రుతి చాలా ఆనందిస్తారు. ఇక.. బాలు, మీనా లను స్టేజీ మీదకు పిలిచి.. సన్మానించి.. ప్రైజ్ మనీ ఉన్న చెక్ అందిస్తారు.

‘ ఇది కేవలం మా ఇద్దరి విజయం మాత్రమే కాదు.. మా కుటుంబ విజయం. మా కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చి.. పోటీల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేమంతా సరదాగా ఆడుతూ, పాడుతూ ఎంతో సమయాన్ని ఇక్కడ గడిపాం. ఈ డబ్బుకంటే అది నాకు ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది’ అని బాలు గర్వంగా చెబుతాడు.

ఇక ఓడిపోయిన దిగులుతో మనోజ్, రోహిణీలు ఇంటికి చేరుకుంటారు.గురూజీ చెప్పిన కలర్ చొక్కా వేసుకొని ఉంటే గెలిచేవాళ్లం అని మనోజ్ ఫీలౌతూ ఉంటాడు. ఇక.. వీరు రాగానే.... ప్రభావతి ఎదురొచ్చి హారతి ఇస్తాను అంటుంది. ఎందుకు అని అడిగితే... కచ్చితంగా మీరే గెలిచి ఉంటారు అని అంటుంది. అయితే.. తాము గెలవలేదని ఓడిపోయాం అని చెబుతారు. తర్వాత రవి, శ్రుతి ఇంటికి వస్తారు. వాళ్లు గెలిచారేమో అని ప్రభావతి అనుకుంటుంది. కానీ.. వాళ్లు కూడా తాము గెలవలేదని.. బాలు, మీనా గెలిచారు అని చెబుతారు. ఆ మాటలకు ప్రభావతి షాక్ అవుతుంది. ఇంతలో మీనా వాళ్ల అమ్మ, చెల్లి వస్తారు. వీళ్లు ఎందుకు వచ్చారు..? అని ప్రభావతి తక్కువ చేసి మాట్లాడుతుంది. కానీ.. ఆలోగా.. బాలు, మీనా ఊరేగింపుతో ఇంటికి వస్తారు.బాలు.. ఇంటి ముందు ఆనందంతో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. వారితో పాటు రవి,శ్రుతి, మీనా చెల్లెలు కూడా చేరి ఆనందంగా డ్యాన్స్ వేస్తారు.

45
బాలు విజయాన్ని తట్టుకోలేకపోయిన ప్రభావతి

ఇక మీనా వాళ్ల అమ్మ దండలు తెచ్చి... బాలు, మీనాలకు ఇస్తుంది. వాళ్లు..ఆ దండలు మార్చుకుంటారు. మనోజ్, రోహిణీ, ప్రభావతి తప్ప అందరూ సంతోషిస్తారు. ‘ అరేయ్... మనోజ్ ఇదెలా జరిగిందిరా? ఒకటి నువ్వు అయినా గెలవాలి లేదంటే రవిగాడు అయినా గెలవాలి. వీళ్లు గెలవడం ఏంట్రా?’ అని ప్రభావతి అంటుంది. వెంటనే మీనా చెల్లెలు.. ‘ అక్కా.. మీరిద్దరు మంచి జోడి అని మన బస్తీకి మాత్రమే తెలుసు. కానీ.. ఇప్పుడు టీవీలో వస్తుంది కదా అందరికీ తెలిసిపోతుంది’ అని అంటుంది. కానీ..ప్రభావతి బుద్ధి మాత్రం మారదు. ‘ వీళ్లను టీవీలో కూడా చూపిస్తారా’ అని అంటుంది. కానీ.. ‘ బావా మిమ్మల్ని సోషల్ మీడియాలో కూడా చూపిస్తున్నారు. బెస్ట్ కపుల్ అని పొగుడుతున్నారు ’ అని మీనా చెల్లెలు చెబుతుంది. సత్యం కూడా తన కొడుకు, కోడలిని మెచ్చకుంటాడు. తర్వాత వాళ్లకు హారతి ఇవ్వమని ప్రభావతితో చెబుతాడు.కానీ, ప్రభావతికి ఇష్టం ఉండదు. సత్యం బలవంత పెట్టడంతో.. తప్పక హారతి ఇస్తుంది. ఇక,బాలు, మీనా లోపలికి వెళ్లిపోతారు.కామాక్షి.. ఇంటికి వెళ్తూ వెళ్తూ.. ప్రభావతి పై పంచులు వేస్తుంది.

55
చెక్ చూసి మురిసిపోయిన బాలు, మీనా

ఇక...ప్రభావతి, మనోజ్, రోహిణీ ఇంట్లో కాఫీ తాగుతూ ఉంటారు. షుగర్ తగ్గిందని మనోజ్ అంటే... ప్రభావతి మాత్రం మీనా మీద ఉన్న కుళ్లు మొత్తం బయటపెడుతుంది. ‘ బాగా పొగరు పెరిగింది. లక్ష వచ్చిందని ఇంట్లో వాళ్ల మీద లెక్క లేకుండాపోయింది’ అని అంటుంది. రోహిణీ మాత్రం... మనోజ్ తెలివి తేటలను తిడుతుంది. ప్రభావతి కూడా పనిలో పనిగా మనోజ్ ని తిడుతుంది. తర్వాత.. వీళ్లు గెలవనందుకు కాదు కానీ.. బాలు, మీనా గెలిచారని ప్రభావతి తెగ ఫీలౌతూ ఉంటుంది. అది చూసిన బాలు.. కావాలని వీళ్లపై సెటైర్లు వేస్తాడు. తర్వాత చెక్ ని చూసి మురిసిపోతారు. అక్కడ కూర్చొని... మనోజ్ కి పంచులు వేస్తూ ఉంటాడు. ఆ డైలాగులు చాలా ఫన్నీగా ఉంటాయి. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగప్ లో రోహిణీ గతం తాలుకా విషయాలు బయటకు వచ్చేలా ఉన్నాయి. రోహిణీ.. బాలు దగ్గర సీక్రెట్ ఉంచిందని ప్రభావతి కూడా ప్రశ్నిస్తుంది. ఆ వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..

Read more Photos on
click me!

Recommended Stories