
మీనా నగలను మనోజ్ అమ్మేసుకుంటాడు. ఆ నగలకు సంబంధించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాలు పట్టుపడతాడు. దీంతో.. వాటిని ఎలాగైనా ఇచ్చేస్తాను అని రోహిణి కూడా చెబుతుంది. కల్పన డబ్బులు తెచ్చి అయినా బాలుకి ఇవ్వాలని అనుకుంటూ ఉంటుంది. ఇక.. నేటి ఎపిసోడ్ లో బాలు, మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా సరదాగా బాలుని ఆట పట్టిస్తుంది. బ్యాగ్రౌండ్ లో రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుంది.
సీన్ కట్ చేస్తే.. సత్యం హాల్లో కూర్చొని పుస్తకం చదువుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే రోహిణి, మనోజ్ లు అడుగుపెడతారు. లోపలికి రాగానే మనోజ్.. ‘నాన్న అమ్మ ఏది ?’ అని అడుగుతాడు. మా అమ్మ ఊళ్లో ఉంది అని సత్యం చెబితే.. మా అమ్మ నాన్న అని మనోజ్ అంటాడు... దానికి సత్యం.. గోదాట్లో కొట్టుకుపోయింది అని కోపంగా సమాధానం చెబుతాడు. మనోజ్ షాక్ అవుతాడు. ‘ నన్ను అడుగుతావేంటి? ఎక్కడికి వెళ్లిందో, ఏం చేస్తుందో.. నీకే బాగా తెలుసు.. తోడు దొంగలు కదా’ అని సత్యం సెటైర్ వేస్తాడు. తర్వాత మళ్లీ నగలు దొంగతనం చేసినందుకు తిడతాడు.
అయితే.. రోహిణీ జోక్యం చేసుకొని... ‘ మనోజ్.. మామయ్య అత్తయ్యతో మాట్లాడటం లేదు కదా.. నువ్వు వెళ్లి అత్తయ్యను తీసుకొని రా’ అని చెప్పి పంపిస్తుంది. వెళ్తున్న మనోజ్ ని సత్యం ఆపుతాడు.. ‘ ఇప్పుడు అది ఇక్కడికి ఎందుకు అమ్మా?’ అని కోడలిని అడుగుతాడు.. కొంచెం మాట్లాడే పని ఉంది అని రోహిణి చెప్పడంతో.. అయితే మీరు మాట్లాడుకోండి.. నేను వెళ్లిపోతాను అని సత్యం వెళ్లబోతాడు.. కానీ... మీరు కూడా ఉండాలని సత్యం ని ఆపుతుంది. ఈ లోగా మీనా అటువైపు వస్తే.. బాలుని పిలవమని అడుగుతుంది. మీనా పిలుస్తుంది. బాలు వస్తాడు. ఆ తర్వాత మనోజ్ , పద్మావతి కూడా వస్తారు.
‘ ఏంటి మీనా?’ అని బాలు అడిగితే... రోహిణి పిలవమంది అని మీనా చెబుతుంది. అప్పుడే వచ్చిన పద్మావతి కూడా.. ఎందుకు పిలిచారు అని అడుగుతుంది. దానికి మనోజ్..‘ నా కంఠంలో ప్రాణం ఉండగా.. నీ మీద ఈగ కూడా వాలనివ్వను అమ్మా’ అంటాడు. ‘ ఈగలు ఎందుకు వాలతాయి రా? అమ్మ బెల్లమా?’ అని అడగడం చాలా ఫన్నీగా ఉంటుంది. అయితే... ‘ అమ్మ మీద చిన్న మాట కూడా పడనివ్వను అని అంటున్నాను’ అని మనోజ్ చెబుతాడు.
‘అసలు అమ్మ మాటలు పడేదే నీవల్ల కదరా నగలు మింగినోడా’ అని బాలు అనడంతో.. రోహిణీ కి కోపం వస్తుంది. ‘నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు బాలు.. ఇంట్లో మనోజ్ ఒక్కడే తప్పు చేయలేదు’ అని అంటుంది. దానికి బాలు‘ అవును పార్లరమ్మా.. నువ్వు కూడా తప్పు చేశావ్ కదా మార్చిపోయాను’ అని సెటైర్ వేస్తాడు. ఈ లోగా మనోజ్ ‘ అసలు నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను?’ అని అడుగుతాడు. ‘ ఏం చేశావా? తప్పే చేశావ్... 40 లక్షలు మింగేశావ్....’ ఇంకా ఏదో చెప్పబోతుంటే రోహిణి ఆపేస్తుంది. పద్మావతిని పిలిచి కూర్చోమని చెబుతుంది. ఆమె అలా కూర్చోవడం తనకు నచ్చదని సత్యం చెప్పడం కొసమెరుపు.
తర్వాత రోహిణి తన బ్యాగు నుంచి డబ్బులు తీసి ఇస్తుంది. ‘ మామయ్య... మనోజ్ .. మీనా నగలు అమ్ముకున్నాడని బాలు ప్రతి క్షణం అవమానిస్తున్నాడు కదా అందుకే..డబ్బులు తీసుకొచ్చాను’ అని రోహిణి చెబుతుంది. ‘చూసుకోరా.. మాట అంటే మాటే’ అని మనోజ్ ఫోజు కొడతాడు. ‘ నువ్వు తెచ్చావా? పార్లరమ్మ తెచ్చిందా?’ అని బాలు అడిగితే.. రోహిణీ తెచ్చిందని మనోజ్ చెబుతాడు. ‘ మరి నువ్వెందుకు బిల్డప్ ఇస్తావ్... బిత్తిరోడా’ అని బాలు తిడతాడు.
‘ అసలు ఇంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావమ్మా?’ అని పద్మావతి అడుగుతుంది. ‘ వామ్మో.. అమ్మ నగలు అమ్మేశాడో, పార్లరమ్మ నగలు అమ్మేశాడో చూసుకోండి’ అని బాలు అంటాడు. ‘ ఇవి మా నాన్న నాకు పంపించారు అత్తయ్య’ అని రోహిణి సమాధానం ఇస్తుంది. ‘ మీ నాన్న జైల్లో ఉన్నాడు కదమ్మా..?’ అని సత్యం అడిగితే.. ‘ జైల్లో కూడా బ్యాంక్ ఉంటుందేమో’ అని బాలు వెటకారంగా మాట్లాడతాడు. ‘ మా మామగారు.. మలేషియా మామతో పంపించారు’ అని మనోజ్ కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఏదో చేశారు అని బాలు డౌట్ పడితే... మనకెందుకు అని మీన ఆపేస్తుంది.
‘ మీ నాన్నను డబ్బులు అడిగావా? అంటే... ఈ నగల విషయం ఈ గొడవలు అన్నీ మీ నాన్నతో చెప్పావా?’ అని పద్మావతి అడుగుతుంది. ‘ లేదు అత్తయ్య... మన కుటుంబ విషయాలు చెప్పలేదు..’ అని రోహిణి అంటే.. ‘ అసలే ఆయన జైల్లో కూర్చొని చిప్పకూడు తింటున్నాడు.. ఆయనకు ఈ విషయాలు ఎందుకులే’ అని బాలు సెటైర్ వేస్తాడు.
‘ ఈ డబ్బు కోసమే కదా నన్ను అన్ని మాటలు అన్నావ్... తీసుకో’ అని బాలుతో మనోజ్ అంటాడు. తండ్రి సత్యం కి మనోజ్ డబ్బులు ఇవ్వబోతుంటే... ‘ నాకు ఇస్తావేంటి? నగలు అమ్ముకుంది నావి కాదుకదా, ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వు’ అని అంటాడు. ‘ పొద్దున్నే మాట ఇచ్చాం... సాయంత్రానికి డబ్బులు ఇస్తున్నాం..’ అని మనోజ్ బిల్డప్ కొడుతూ డబ్బులు ఇవ్వబోతుంటే... బాలు తనకు వద్దు అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.
‘ ఎందుకు వద్దురా?’ అని సత్యం అడిగితే.... ‘ నాకు వాళ్లు ఇవ్వాల్సింది 4 లక్షలు..కానీ అవి రెండు లక్షలు మాత్రమే.. అందులో కూడా సగం నొక్కేశారు’ అని బాలు అంటాడు. నిజమేనా అని సత్యం అడిగితే... ‘ ఇప్పటికి ఇవి తీసుకోమని చెప్పండి మామయ్య... తొందరల్లోనే మిగితా డబ్బులు ఇచ్చేస్తాం’ అని రోహిణి అంటుంది. ‘ ఈ ముక్క ముందు చెప్పాలి కదా పార్లరమ్మా... డబ్బులు నా చేతిలో పెట్టాక.. తర్వాత లెక్కలేసుకున్న తర్వాత చెబుతారా? నువ్వు కూడా ఈ తల్లీ కొడుకులో కలిసిపోయావా పార్లరమ్మా’ అని బాలు అడగడంతో... ‘ లేదు బాలు... మొత్తం ఒకేసారి పంపడం కుదరక మా నాన్న ఈ రెండు లక్షలు మాత్రమే పంపించాడు’అని కవర్ చేస్తుంది. ‘ నా షో రూమ్ లో పోయిన సరుు ఇంకా రాలేదు.. ఇప్పటికి ఇవి తీసుకోమని చెప్పు నాన్న’ అంటూ మనోజ్ అడగగా.. సత్యం రివర్స్ లో తిడతాడు.
కానీ బాలు ఒప్పుకోడు. తనకు మొత్తం డబ్బులు ఒకేసారి కావాలి అంటాడు. రోహిణీ ఏదో చెప్పడానికి ప్రయత్నించినా కూడా బాలు వినిపించుకోడు. అయితే... మీనా సర్ది చెప్పడంతో.... ఆ డబ్బులు బాలు తీసుకుంటాడు. మిగిలిన డబ్బులు కూడా వెంటనే కావాలి అని బాలు అనడంతో.. తొందర్లోనే ఇస్తాంఅని రోహిణి మాట ఇస్తుంది.
‘ అమ్మా రోహిణి... మనోజ్ చేసిన తప్పులకు, వాళ్ల అమ్మ చేసిన తప్పులకు నువ్వు బాధ్యత తీసుకొని డబ్బులు తిరిగి ఇస్తున్నావ్.. ఇలా ఇస్తూ పోతే... అది వాళ్లకు ఆనవాయితీగా మారిపోతుంది. ఇలాంటి తప్పులు మళ్లీ చేయకూడదని వాళ్లిద్దరికీ గట్టిగా చెప్పు’ అని కోడలికి సలహా ఇచ్చి... మనోజ్ మీద చిరాకు పడుతూ సత్యం అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక డబ్బులు బీరువాలో దాచి పెట్టమని, లేకపోతే మళ్లీ మింగేస్తారని మీనాతో బాలు చెబుతాడు.
‘ ఏంటమ్మా రోహిణి... అడిగిన దానివి మొత్తం 4 లక్షలు అడిగితే.. వీళ్లతో మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా’ అని పద్మావతి అంటే... బ్యాంక్ ఎకౌంట్ సీజ్ చేశారు కదా అందుకే మొత్తం ఇవ్వలేదు అని రోహిణీ కవర్ చేస్తుంది. తర్వాత ఆమె వెళ్లిపోయాక... ‘ అనవసరంగా మనం దాచుకున్న డబ్బులో నుంచి 2 లక్షలు పోయాయి’ అని మనోజ్ ఫీలౌతాడు. కానీ రోహిణీ భర్తను తిడుతుంది.
రాత్రికి కిచెన్ లో మీనా పని చేసుకుంటూ ఉంటే.... బాలు వచ్చి పిలుస్తాడు. తొందరగా పడుకుంటే... పొద్దున్నే బయటకు వెళ్లాలి అని చెబుతాడు. 2 లక్షలతో నగలు కొనుక్కుందామని చెబుతాడు. కానీ.. తనకు నగలు వద్దు అని మీనా చెబుతుంది. ‘ ఎందుకు వద్దు..?’ అని బాలు అడిగితే... ‘ నేను నగలు వద్దు అనే అత్తయ్యకు తీసి ఇచ్చాను.. మీరు కొన్నాకే వేసుకుంటాను.. కాబట్టి.. ఆ నగల తాలుకా డబ్బులు నాకు వద్దు’ అని మీనా తేల్చి చెబుతుంది. ‘ అంటే.. నువ్వు ఆ శపథం మర్చిపోలేదా?’ అని బాలు అడిగితే.. ‘ మీరు కొనకపోతే నాకు నగలే వద్దు.. కానీ ఆ డబ్బులతో మాత్రం తనకు వద్దు’ అని చెబుతుంది. ‘ ఆడబ్బుతో మనం రూమ్ కట్టుకుందామా?’ అని బాలు అడిగితే.. పునాది వేద్దాం అని మీనా సలహా ఇస్తుంది. అంటే అని బాలు అడిగితే... ఆ డబ్బుతో ఇంకో కారు కొందామని... ఆ రెండింటితో వచ్చిన ఆదాయంతో చిట్టీ వేసి.. తర్వాత గది కట్టుకుందాం అని చెబుతుంది.
తర్వాత... అత్తయ్య, మామయ్యను కలపాలని కూడా అనుకుంటారు. ఇదే విషయం గురించి మాట్లాడాలని సత్యం దగ్గరకు వెళతారు. ఆయన హాల్లో పడుకోవడం చూసి వీళ్లు బాధపడతారు. లోపల పడుకోమని బాలు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ... సత్యం వినిపించుకోడు. మధ్యలో మీనా కూడా నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది... అత్తయ్యతో మాట్లాడమని బతిమిలాడుతుంది. కానీ.. సత్యం వినడు. వీళ్లు ఇలా వాదులాడుకుంటూ ఉండగా.. పద్మావతి అక్కడకి వస్తుంది. తాను ఒక్కదాన్నే ఆ గదిలో సుఖంగా నిద్రపోవాలని అనుకోవడం లేదు.. నేను ఇక్కడే పడుకుంటాను అని చెబుతుంది. ఇక.. వీళ్ల బలవంతంతో.. సత్యం గదిలోకి వెళతాడు. పద్మావతిని కూడా లోపలికి వెళ్లమని మీనా చెబుతుంది. కానీ... ఆమె వినిపించుకోకుండా.. ఏదేదో మాట్లాడుతుంది. పనిలో పనిగా మీనాని తిడుతుంది.
మరుసటి రోజు మీనా కిచెన్ లో పని చేసుకుంటూ ఉంటే... శ్రుతి బయటకు వస్తుంది. కాఫీ కావాలని అడుగుతుంది. ఈలోగా రోహిణి వస్తుంది.. ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లకు మీనా కాఫీ ఇస్తుంది. ముగ్గురూ కలిసి తాగుతూ ఉంటారు. ‘ అత్తయ్యకు కాఫీ ఇచ్చావా?’ అని రోహిణీ అడిగితే... ఇచ్చానని.. సింక్ లో పారబోసారు అని మీనా చెబుతుంది. ఇక ముగ్గురూ కలిసి మళ్లీ ఆ నగల గురించి టాపిక్ వస్తుంది. శ్రుతి.. మనోజ్ ని తిడుతుంది. రోహిణీ కవర్ చేయాలని చూస్తుంది కానీ.. శ్రుతి వినిపించుకోదు. మీనాకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. కానీ.. వాళ్లను మీనా ఆపుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది......