
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో ఇప్పుడు చెప్పు షాపింగ్ కి ఎప్పుడు వెళ్దాం అంటుంది పారు. షాపింగ్ ఎందుకు అంటుంది జ్యోత్స్న. పెళ్లి కొడుకు ఒక్క రోజులో దొరుకుతాడు కానీ.. మ్యాచింగ్ డ్రెస్సులు, ఇయర్ రింగ్స్, చెప్పులు ఒక్క రోజులో దొరకవే అంటుంది పారు. నా పెళ్లి అంటే అంత ఉత్సాహం ఎందుకు నీకు అంటుంది జ్యోత్స్న.
నాకు కాకపోతే ఎవరికి ఉంటుందే అంటుంది పారు. డాడీ అడిగాడు కాబట్టి ఒప్పుకోవాల్సి వచ్చింది అంతే అంటుంది జ్యోత్స్న. అయితే పెళ్లి నిజం కాదా? అంటుంది పారు. జరిగేవరకు ఏదీ నిజం కాదు గ్రానీ అంటుంది జ్యోత్స్న. నేను కాంచన, శౌర్యలను నా మాటలతో మార్చేశానే అంటుంది పారు. ఇదెప్పుడు జరిగింది అంటుంది జ్యోత్స్న. ఎప్పుడో జరిగింది నేనే నీతో చెప్పలేదు అంటుంది పారు.
ఇంతలో కార్తీక్, దీప, శౌర్య వస్తారు. శౌర్య ముద్దుల తాత అంటూ పరిగెత్తుకొని వచ్చి.. నాకు నువ్వు వద్దు అని పారు దగ్గరికి వెళ్తుంది. షాక్ అవుతాడు శివన్నారాయణ. ఎగ్జైట్ అవుతుంది పారు. పిల్లలు నచ్చిన వాళ్ల దగ్గరికే వెళ్తారు అంటుంది పారు.
అదే నువ్వు నచ్చడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటాడు శివన్నారాయణ. జ్యో గ్రానీ మంచిది ముద్దుల తాత అంటుంది శౌర్య. అంత మంచి పని ఏం చేసిందో అంటాడు శివన్నారాయణ. నాకు చాలా మంచి విషయాలు చెప్పింది ముద్దుల తాత అంటుంది శౌర్య. ఏం చెప్పింది అని అడుగుతాడు శివన్నారాయణ.
అమ్మ కడుపులో బేబీ ఉంది కదా.. ఆ బేబినే అందరూ ఇష్టపడతారట. నాన్న కూడా నన్ను పక్కన పెట్టేస్తాడట. నేనంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదట. నాకు ఏమి కొనివ్వరటా.. కొద్దిరోజుల తర్వాత నన్ను ఎక్కడైనా వదిలేసి వస్తారట. అని పారు చెప్పిన విషయాలన్నీ శివన్నారాయణతో చెప్తుంది శౌర్య.
నా గదిలో స్వీట్ బాక్స్ ఉంది. నువ్వు వెళ్లి అక్కడే కూర్చొని తిను అని చెప్పి శౌర్యను పంపిస్తాడు శివన్నారాయణ. చిన్నపిల్లలకు ఇలాంటి మాటలు చెప్పడం తప్పు అనే విషయం నీకు తెలియదా అని పారుపై సీరియస్ అవుతాడు శివన్నారాయణ.
నీ కూతురికి ఇలాంటి మాటలు చెప్పినందుకు తనకు ఏ శిక్ష వేయాలో నువ్వే చెప్పు దీప అంటాడు. గుర్తుండిపోయేలా ఏదో ఒక శిక్ష వేయమంటుంది దీప. అయితే ఈ రోజు నీ పనులు, ఇంట్లో పనులు పారిజాతమే చేయాలి. కార్తీక్ తో పదికి పది మార్కులు వేయించుకోవాలి అంటాడు శివన్నారాయణ.
మరోవైపు శ్రీధర్, కాశీ.. శివన్నారాయణ ఇంటికి బయల్దేరుతారు. అన్నీ కరెక్టుగా ప్లాన్ చేశావా? ఏవైనా తప్పులు ఉంటే ఎత్తిచూపడానికి జ్యోత్స్న రెడీగా ఉంటుంది అంటాడు శ్రీధర్. జ్యోత్న్స అక్కకు ఆ అవకాశం రాదులే సార్ అంటాడు కాశీ. ఇంతలో కాశీకి స్వప్న ఫోన్ చేస్తుంది. గుడికి వెళ్లాలి త్వరగా రా అని చెప్తుంది. పర్మిషన్ ఇవ్వడం కుదరదు అంటాడు శ్రీధర్. కోపంగా ఫోన్ కట్ చేస్తుంది స్వప్న. ఇద్దరి మధ్య నేను ఇరుక్కుపోయాను అని మనసులో అనుకుంటాడు కాశీ.
కిచెన్ లో పనిచేస్తూ ఉంటుంది పారు. చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కార్తీక్, దీప. సాంబార్ చేసి కార్తీక్ ని టేస్ట్ చేయమంటుంది పారు. టేస్ట్ చేసి.. నీ సాంబార్ తో శత్రువులను ఈజీగా చంపేయొచ్చు అంటాడు కార్తీక్. ఈ సాంబార్ కి రెండు మార్కులు కూడా పడవు అంటాడు. మరీ అంత దారుణంగా మాట్లాడకురా అంటుంది పారు.
మరోవైపు కోపంగా ఉన్న స్వప్న దగ్గరకు వస్తుంది కావేరి. గుడికి వెళ్తా అన్నావు కదా అన్నీ చక్కగా ముందే సర్దుకో అని చెప్తుంది. అవసరం లేదు. ఇంట్లోనే దీపం వెలిగించి దండం పెట్టుకుంటాను అంటుంది స్వప్న. అదేంటి అంటుంది కావేరి. కాశీ రాడట. నాన్న పర్మిషన్ ఇవ్వలేదు అంటుంది స్వప్న.
ఏదైనా ముఖ్యమైన పని ఉందేమో అంటుంది కావేరి. ఉంటే మాత్రం ఒక గంట ముందు పంపించలేరా? కాశీని డాడీ పీఏ లాగే చూస్తున్నాడు అంటుంది స్వప్న. తను పీఏనే కదా అంటుంది కావేరి. పీఏ అయితే అల్లుడు కాకుండా పోతాడా అంటుంది స్వప్న. నేను నీతో వాదించలేను. ఏమైనా ఉంటే మీ నాన్నతో చూసుకో అని చెప్పి వెళ్లిపోతుంది కావేరి.
దీప ఖాళీగా ఉంది. ఆపిల్ కట్ చేసి, తినిపిస్తే 3 మార్కులు వేస్తాను అంటాడు కార్తీక్. వెంటనే కట్ చేస్తుంది పారు. పాట పాడుతూ తినిపించమంటాడు కార్తీక్. పారు పాడుతుంటే, కార్తీక్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు.
దశరథకు స్వీట్స్ తినిపిస్తూ ఉంటుంది శౌర్య. అది చూసి.. ఇదే నిజమైన మనుమరాలు అని తెలిస్తే పండుగ చేసుకుంటారేమో అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో నమస్తే ఛైర్మన్ సార్ అంటూ లోపలికి వస్తాడు శ్రీధర్. ఇంట్లో ఫార్మాలిటీస్ వద్దు అని చెప్పాను కదా శ్రీధర్ అంటాడు శివన్నారాయణ.
మనం అనుకున్న ప్లాన్ రెడీ అయింది బావ అని దశరథతో అంటాడు శ్రీధర్. ముందు కాఫీ తాగు తర్వాత మాట్లాడుకుందాం అంటాడు శివన్నారాయణ. కార్తీక్… కాఫీ పంపించు అని చెప్తాడు. కార్తీక్ పారుకి చెప్తాడు. నేను తీసుకెళ్లను. అల్లుడి ముందు బాగుండదు అంటుంది పారు. మొహానికి కొంగు కవర్ చేస్తూ వెళ్లు. వెళ్తే 3 మార్కులు వేస్తాను అంటాడు కార్తీక్. అయితే నేనే వెళ్తాను అంటుంది పారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.